తెలుగు భాషా పత్రిక

ఇది లిఖితపత్రికగా మొదలై అచ్చుపత్రికగా రూపాంతరం చెందింది. ప్రతి యేట ఉగాదికి ఒక సంచిక, దీపావళికి మరొక సంచిక వెలువడేది. ప్రవాసాంధ్రుల కోసం అమెరికాలోని అట్లాంటా నుండి ఈ పత్రికను పెమ్మరాజు వేణుగోపాలరావు నడిపేవాడు. వార్షిక చందా 1.50 డాలర్లు. మొదటి సంచిక ఏప్రిల్ 1970లో వెలువడింది. సంపాదకవర్గంలో పెమ్మరాజు వేణుగోపాలరావు, గవరసాన సత్యనారాయణ, పరిమి కృష్ణయ్య, రావిపూడి సుబ్బారావు మొదలైనవారు ఉన్నారు. మన మాతృభాషను మనము నిత్యము వాడుటకు ప్రయత్నించి మనకు తెలిసిన విజ్ఞానము మనకు తెలిసిన భాషలో వ్రాయగల స్తోమతను సాధించుటయే ఈ పత్రిక ఆదర్శము అని తొలి సంచికలో ఈ పత్రిక ధ్యేయాన్ని తెలిపారు. ఈ పత్రికలో శాస్త్రీయ వ్యాసాలు, కథలు, సీరియళ్లు, కవితలు ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికకి ఇండియాలో కూడ ఆదరణ లభిస్తుందనే ఆశతో, అచ్చురూపంలో వెలువరిస్తే ఇంకా అందంగా తీర్చి దిద్దవచ్చనే ఉద్దేశంతో ఈ పత్రికని ఎమెస్కో సంస్థ అధిపతి ఎమ్‌.ఎమ్‌.రావు సహాయంతో అచ్చురూపంలో మొదలు పెట్టేరు. తరువాత క్రమేపీ పత్రికలో ఆకర్షణ ప్రత్యేకత తగ్గిపోయి పతనమై మూతపడి పోయింది.

లిఖితపత్రిక ముఖచిత్రం
అచ్చుపత్రిక ముఖచిత్రం


1973 అక్టోబరు సంచికలో ఈ క్రింది శీర్షికలు[1] ఉన్నాయి.

 • మనవి మాటలు
 • మేలుజాతి పశువుల గ్రాసం
 • డి.డి.టి. వరమా? శాపమా?
 • తెలుగు లిపి
 • గణితానందం
 • ఆవుల తిండి
 • మతం - సాంకేతికం
 • జీవపదార్థములోని మూలకాలు
 • అద్భుతలోహము - అల్యూమినియము
 • ఖండచ్యుతి
 • కార్బన్ కాలనిర్ణయ పద్ధతి
 • లోహములలోని గ్లాని
 • సాంకేతిక పదాలపట్టిక
 • జవాబులేని ప్రశ్న (కథ)
 • బ్రహ్మాండం బద్దలయింది (కథ)
 • రచయితల పరిచయం

మూలాలుసవరించు

 1. ఎడిటర్ (ఏప్రిల్ 1973). "ఈ సంచికలో". తెలుగుభాషాపత్రిక. 3 (2): 2. Retrieved 18 January 2015.