గవరసాన సత్యనారాయణ

'డాక్టర్‌ గవరసాన సత్యనారాయణ' స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలో గొల్లప్రోలు. వృత్తిరీత్యా వైద్యుడు. శస్త్రచికిత్సలో ప్రావీణ్యత. 1966 ప్రాంతాలలో అమెరికాలో శిక్షణ పొందుతూన్న కాలంలో తెలుగు భాషా పత్రిక వ్యవస్థాపకులలో ఒకరుగా విశేషంగా కృషి చేసారు. గ్రామీణ వ్యవస్థని మెరుగు పరచాలని గొల్లప్రోలు తిరిగి వెళ్ళి, అక్కడ శుశ్రుత క్లినిక్‌ అన్న పేరు మీద ఒక వైద్యాగారాన్ని చాల ఏళ్ళు నడిపి, తరువాత మకాం విశాఖపట్నానికి మార్చేడు. విశాఖపట్నం లో లయన్సు కేన్సరు ఆసుపత్రి ని స్థాపించటానికి విశేషంగా కృషిచేసి సాధించిన వ్యక్తి. ఈయన ధర్మపత్నితో కలసి గొల్లప్రోలు అభివృద్ధికి చేపట్టిన ప్రణాలికలు:

  • 1. మలిరెడ్డి వెంకటరాజు మెమోరియల్‌ ప్రాథమిక పాఠశాల
  • 2. శ్రీమతి మలిరెడ్డి ఉమాంబ ప్రాథమిక పాఠశాల
  • 3. మంచినీటి సరఫరా ప్రణాళిక

పుస్తకాలు

మార్చు

1. గవరసాన సత్యనారాయణ, కర్రీ తింటే కేన్సరు రాదా?: కేన్సరు వ్యాధిపై వ్యాసాలు, గవరసాన ఫౌండేషన్‌, గొల్లప్రోలు-533 455, ఇండియా, 2006