తెలుగు రథం - సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ హైదరాబాద్ లో 2008 అక్టోబరు 24 న ప్రారంభం అయింది. ఈ సంస్థకు కొంపెల్ల శర్మ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, జనపదం, వికాసం, ఆధ్యాత్మికం - అనే రంగాలను సంస్థ కార్యక్రమాలను నిర్వహించుకునే సౌలభ్యం కోసం ప్రాతిపదికగా నిర్మాణం చేసుకోవడం ప్రణాళికలో భాగంగా నిర్థారింపబడ్డాయి. సంస్థ కార్యక్రమాల ప్రస్థాన శైలి కోసం కూడా - "సప్త దృక్పథ" నిర్మాణం - ప్రస్తావన, ప్రవేశం, ప్రతిభ, ప్రయోగం, పరిశీలనం, ప్రస్తారం, ప్రభావం - అని స్థూలంగా  చేసుకోవడం జరిగింది. ఈ సంస్థ హైదరాబాదులో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో పలుప్రాంతాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయించాలన్నది సంస్థ ఆశ, ఆకాంక్ష, ఆశయంగా పెట్టుకోవడమే కాకుండా, మన మాతృభాష "తెలుగు"లో కార్యక్రమాల విశ్లేషణకు మేము సైతం అంటూ ముందడుగు వేసే ప్రయత్నం, సంకల్పంతో అందరి సహకార ప్రోద్బల ప్రోత్సాహాలతో వైవిధ్యమైన, విశిష్ట తరహాల్లో స్వచ్చందంగా సారస్వత కార్యక్రమాలను నిత్య నిరంతరంగా నిర్వహించడంలో ఈ సంస్థ తనదైన ప్రత్యేకతను  ఆపాదించుకుంది.  

తెలుగు రథం వ్యవస్థాపక అధ్యక్షుడు కొంపెల్ల శర్మ

"దశాబ్ది" సేవల్లో - తెలుగురథం (2008-2018)

మార్చు

"మా పథం - వెలుగు * మా రథం - తెలుగు" భావనాత్మక నినాదంతో, "సప్తాశ్వ రథం" ప్రేరణతో - తెలుగురథ ప్రస్థానం - పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న తరుణంలో "తెలుగురథం" సంస్థ "దశాబ్ది" ఉత్సవాలను నిర్వహించే ప్రణాళికను సిద్ధం చేసుకుంది.

"మన తెలుగు తేజోమూర్తులు * ప్రసంగ సంస్మరణీయం" అన్న శీర్షికతో - 2018 అక్టోబర్ - నవంబర్ నెలల్లో - 12 రోజులపాటు ప్రసంగలహరి కార్యక్రమాల్ని నిర్వహించింది.

తెలుగురథం - ఆకాంక్షలు, ఆశయాలు, ఆలోచనలు, ఆచరణలు:

మార్చు
  • భాషా, సాహిత్య, సాంస్కృతిక, కళా, వికాస, ఆధ్యాత్మిక రంగాల ప్రక్రియలను విశ్వవ్యాప్తంగా అందజేయడం.
  • వివిధ రంగాల్లోని ప్రతిభావంతుల జీవన వ్యక్తిత్వ వికాసాలను ప్రస్తుతించడం.
  • సారస్వత మూర్తుల బహుముఖీన ప్రజ్ఞావంతుల - శత జయంతి/వర్థంతి, జయంతి, వర్థంతి సమాలోచన సభలని నిర్వహించడం.
  • శాస్త్రీయ, లలిత, జానపద సంగీత శాఖల/ప్రజ్ఞావంతుల పై ప్రత్యేక సభలు నిర్వహణ.
  • శాస్త్రీయ నృత్య,నృత్త,నాట్య కళల/కళకరుల పై ప్రత్యేక సదస్సులు నిర్వహించడం.
  • ఐక్యరాజ్యసమితి, కెంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రణాలిక ప్రకారం - ప్రత్యేక సంవత్సర/వార/దినోత్సవ సభలను నిర్వహించడం.
  • జనపద, వికాస రంగాల్లోని ప్రత్యెక అంశాల/విశిష్త వ్యక్తులపై సభలు నిర్వహించడం.
  • సాహిత్య, సంగీత, ణాట్య ప్రక్రియలపై విశ్లేషణాత్మక సదస్సులు.
  • ఆంగ్ల/తెలుగు మాసాల ప్రత్యేకతలు, రోజువారీగా ప్రత్యేకతలు, చారిత్రక నేపథ్యాలను సామాజిక, అంతర్జాల మాధ్యం ద్వారా విశ్వస్థాయిలొ సమాచారాన్నిన్ అందుబాటులోకి తీసుకురావడం.
  • వ్యవసాయ, వ్యవసాయేతర గ్రామీణ వికాస రంగంలో విశిష్త సేవలని అందించడం.
  • పరిశొధనాత్మక ప్రక్రియలకు, తత్సంబంధిత ప్రచురణలకు సహాయ సహకార ప్రొత్సాహ ప్రోద్బలాల్ని అందజేయడంతోబాటు, వాటిపై ఆయా పరిశొధకులచే సందర్భోచిత, సమయోచిత ప్రసంగ పరంపరలు నిర్వహించడం.
  • సర్వస్థాయి విద్యాసంస్థల్లోనూ - ప్రేరణాత్మక సదస్సులు, సమాలోచన సభలు నిర్వహించడం.  

ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు

మార్చు

ఈ సంస్థ నిర్వహించిన అనేక ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలలో కొన్ని:

  • భాష/సాహిత్యం
  1. మాతృభాషా దినోత్సవం
  2. మథునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
  3. ఆరుద్ర
  4. విశ్వనాథ సత్యనారాయణ
  5. గిడుగు వేంకట రామమూర్తి పంతులు
  6. తెలుగు వ్యవహార భాష కు నూరేళ్ళ ప్రస్థానం.
  7. శ్రీ కృష్ణదేవరాయలు - పట్టాభిషేక - పంచ శత వర్షోత్సవం
  8. దాశరథి కృష్ణమాచార్యులు
  9. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి (శతజయంతి)
  • సంగీతం
  1. ముత్తుస్వామి దీక్షితులు
  2. తాళ్ళపాక అన్నమాచార్యులు
  3. నారాయణ తీర్థ
  4. మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  5. శ్రీపాద పినాకపాణి
  6. నూకల చిన సత్యనారాయణ
  7. యం.యస్.సుబ్బులక్ష్మి
  8. స్వాతి తిరుణాళ్.
  • సంగీతం బాలాంత్రపు రజనీకాంతరావు గారు - లలిత సంగీతానికి శతవసంత సౌరభాలు ఆధ్యాత్మికం శంకరాచార్య - సౌందర్య లహరి
  • శంకరాచార్య-రామానుజాచార్య (శంకరాద్వైతం - విశిష్టాద్వైత రామానుజం) మహావైశాఖి - వైశాఖ పూర్ణిమ హనుమజ్జయంతి శ్రీకృష్ణాష్టమి భక్త జయదేవ  

ఈ సంస్థ నిర్వహించిన అనేక ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలలో కొన్ని:

మార్చు
  • తెలుగురథం - ప్రతిభా పురస్కారం -
  • మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు
  • శతావధాని - గండూరి దత్తాత్రేయ శర్మ గారు
  • సాహితీభీష్మ పోతుకూచి సాంబశివరావు గారు

మూలాలు

మార్చు