తెలుగు లలితకళాతోరణం

తెలుగు లలితకళాతోరణం ఆరుబయట కళావేదిక (ఓపెన్ ఆడిటోరియం). తెలుగుకళాకారులు తమ లలితకళలను ప్రదర్శించడానికి ఏర్పాటుచేసిన ఒక ఉచిత వేదిక. 1985లో ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ప్రారంభించారు. చాలాకాలం ఇక్కడ సాయంత్రం సమయంలో సినిమాలు ప్రదర్శించారు. సంగీత కచేరీలు, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగేవి. ఇప్పుడు సినిమాల ప్రదర్శన కూడా నిలిపివేసారు. ‘తెలుగు లలితకళా గబ్బిళాల తోరణం’ పేరుతో వార్తలు వస్తే మళ్లీ సినిమాలు చాలా కాలం ప్రదర్శించారు. మళ్ళీ ఆగిపోయాయి. లలిత కళాతోరణం ప్రస్తుతం ధనవంతులకు పెద్ద పెద్ద సాంస్కృతిక సంస్థలకు లక్షల రూపాయలు స్పాన్సర్ తెచ్చుకోగలిగినవారికే పరిమితమైంది. ప్రస్తుతం లలిత కళాతోరణం అద్దె ముప్ఫయి ఎనిమిదివేల రూపాయలు. ఈ అద్దె కేవలం ప్రాంగణానికి మాత్రమే. కుర్చీలు, టేబుళ్లు, అలంకార సామాగ్రి బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. బయటకు చాలా అందంగా కనిపిస్తుంది కానీ లోపల కళావిహీనంగా వెలవెలబోతూ ఉంది. ఇకనైనా పేద కళాకారులను ఆహ్వానించి ప్రదర్శనలిప్పించాలి. లలిత కళాతోరణంలో మళ్లీ సినిమాలు ప్రదర్శించాలి. ప్రేక్షకులకు వసతులు కల్పించాలి.సాంస్కృతిక కార్యక్రమాల కోసం అద్దెను బాగా తగ్గించి అందరికీ అందుబాటులో వుంచాలని కళాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రతి నిత్యం భాగ్యనగరం చూడటానికి ఎంతోమంది టూరిస్టులు వస్తుంటారు. వారి కంటికి లలిత కళాతోరణం ఏదో ఒక కార్యక్రమంతో కళకళలాడుతూ కనిపించాలేకానీ వెలవెలపోకూడదు. అన్ని సదుపాయాలతో కొత్త అందాలతో లలితకళాతోరణం రూపుదిద్దుకోవాలి. అది నిత్యం కళాకారులతో సందడిగా ఉండాలి. తెలుగు లలిత కళామతల్లి ఖ్యాతి నలుదిశలా వ్యాపించాలి. [1] టి.సుబ్బరామిరెడ్డి కోరికమేరకు గతంలో తెలుగు లలితకళాతోరణం పేరును రాజీవ్‌ తెలుగు లలితకళాతోరణంగా మార్చారు. ప్రజల వ్యతిరేకత దృష్ట్యా మళ్ళీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. తెలుగు లలితకళాతోరణం పేరు మారిస్తే బోర్డు పీకేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కాంగ్రెస్‌ నేత సుబ్బిరామిరెడ్డికి అంతగా దానం చేయాలని ఉంటే మురికివాడల్లో మరుగుదొడ్లు నిర్మించి రాజీవ్‌, ఇందిరల పేర్లు పెట్టుకోవాలని సూచించారు. పేరు మార్చాలనుకుంటే సాహిత్య సేవ చేసిన సుద్దాల హనుమంతు, సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సూచించారు [2]

2018 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా , హైదరాబాదులోని లలిత కళాతోరణం నుండి ట్యాంక్ బండ్ వరకు జరిగిన కళాయాత్ర ప్రారంభోత్సవం
1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో తెలుగు లలిత కళాతోరణం ప్రారంభించారు.

చిత్రమాలిక

మార్చు
 
నేమ్ బోర్డ్
 
తెలుగు లలిత కళాతోరణం, నాంపల్లి

మూలాలు

మార్చు