ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సమాచార సాంకేతిక శాఖ వారి తెలుగు భాషా సాంకేతిక వనరుల కేంద్రం వెబ్‌సైటు పేరు తెలుగు విజయం.[1] దీనిలో తెలుగు సాంకేతికాలకు సంబంధించిన ఉపకరణాలు, సదుపాయాలను పొందుపరుస్తారు. దీనిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, 2012 నాడు మూడు కొత్త ఖతుల[2] విడుదలతో ప్రారంభించారు.

తెలుగు భాషా సాంకేతిక వనరుల కేంద్రం లక్ష్యాలు మార్చు

తెలుగు భాషా సాంకేతిక వనరుల కేంద్రం లక్ష్యాలు[3]

  • అందమైన తెలుగు ఫాంట్లను రూపొందించడం
  • ప్రభుత్వ వెబ్‌సైట్లు, రికార్డులను యూనికోడ్ సాంకేతికాలతో అంతర్జాలం ద్వారా అందుబాటులోకి తేవడం.
  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రామాణిక ఉపకరణాలను తెలుగు భాషకు అనువుగా మలచుకొనడం,
  • తెలుగుభాష సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు
  • కొత్త తెలుగు సాంకేతిక ఉపకరణాలభివృద్ధి

వనరులు మార్చు

  1. "తెలుగు విజయం వెబ్‌సైట్". Archived from the original on 2012-02-23. Retrieved 2012-02-22.
  2. "తెలుగు విజయం ఖతులు". Archived from the original on 2012-02-23. Retrieved 2012-02-22.
  3. "తెలుగు భాషా సాంకేతిక వనరుల కేంద్రం లక్ష్యాలు". Archived from the original on 2012-02-23. Retrieved 2012-02-22.