తెలుగు వ్యుత్పత్తి కోశం
(తెలుగు వ్యుత్పత్తి కోశము నుండి దారిమార్పు చెందింది)
లకంసాని చక్రధరరావు , ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సంపాదకత్వంలో తెలుగు వ్యుత్పత్తి కోశం పేరుతో తెలుగు నుండి తెలుగు నిఘంటువు 1,08,330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడినది.
తెలుగు వ్యుత్పత్తి కోశం | |
తెలువు వ్యుత్పత్తి కోసం, ప్రథమ సంపుటం ముఖచిత్రం. This file is a candidate for speedy deletion. It may be deleted after బుధవారము, 1 జనవరి 2014. | |
కృతికర్త: | లకంసాని చక్రధరరావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
సీరీస్: | ప్రథమ సంపుటం |
ప్రక్రియ: | తెలుగు భాష |
విభాగం (కళా ప్రక్రియ): | నిఘంటువు |
ప్రచురణ: | ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, విశాఖపట్నం |
విడుదల: | 1978 |
పేజీలు: | 412 |
దీని తరువాత: | రెండో సంపుటం |
సంపుటాలు
మార్చు- మొదటి సంపుటము: అ-ఔ (1978) 412 పేజీలు; ఇది పొట్టి శ్రీరాములు కి అంకితం. ఎమ్.ఆర్.అప్పారావు తొలిపలుకులు రాశారు. ఇందులో 12,219 పదాలు.
- రెండవ సంపుటము: క-ఘ (1981) 455 పేజీలు; ఇది కట్టమంచి రామలింగారెడ్డి కి అంకితం. ఆవుల సాంబశివరావు ముందుమాట రాశారు. ఇందులో 19,670 పదాలు
- మూడవ సంపుటము: చ-ణ (1981) 277 పేజీలు, ........... కి అంకితం, ఆవుల సాంబశివరావు ముందుమాట రాశారు. ఇందులో 11,000 పదాలు
- నాలుగవ సంపుటము: త-న (1985) 440 పేజీలు; ఇది వాసిరెడ్డి శ్రీకృష్ణ కి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి. ఇందులో 16,000 పదాలు.
- అయిదవ సంపుటము: ప-భ (1987) 498 పేజీలు, లంకపల్లి బుల్లయ్య కి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి. ఇందులో 19,000 పదాలు.
- ఆరవ సంపుతము: మ (1987) 268 పేజీలు, ఎమ్.ఆర్.అప్పారావు కి అంకితం కోనేరు రామకృష్ణారావు ముందుమాట. ఇందులో 9,754 పదాలు
- ఏడవ సంపుటము: య-వ (1989) 272 పేజీలు; ఇది ఆవుల సాంబశివరావు కి అంకితం. కనిశెట్టి వెంకటరమణ తొలిపలుకు. ఇందులో 10,132 పదాలు
- ఎనిమిదవ సంపుటము: శ-హ (1995) 315 పేజీలు; ఇది కోనేరు రామకృష్ణారావు కి అంకితం. మద్ది గోపాలకృష్ణారెడ్డి ప్రవచనం. ఇందులో 6,651పదాలు. 3904(అ-హ) అనుబంధం.