తెలుగు సినిమా ప్రత్యేకతలు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
- రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు సినిమా పితామహుడు
- 1921 లో విడుదలైన తొలి మాటలు లేని (మూక) చిత్రం భీష్మ ప్రతిజ్ఞ రఘుపతి వెంకయ్య నాయుడు చే రూపొందించిబడింది.
- 1931 లో విడుదలైన తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. హెచ్.ఎమ్. రెడ్డి చే రూపొందించబడింది.
- దక్షిణ భారతదేశం లోనే మొట్టమొదటి సినిమా స్టూడియో దుర్గా సినీటోన్ 1936 లో నిడమర్తి సూరయ్య చే రాజమండ్రిలో నిరింపబడినది
- 1951 లో విడుదలైన మల్లీశ్వరి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొట్టమొదటి తెలుగు చిత్రం. 1953 లో దీనిని చైనీసు సబ్-టైటిళ్ళతో చైనా లోని బీజింగ్‌లో కూడా 13 ప్రింట్లతో విడుదల చేశారు
- 1951 లో నే విడుదలైన పాతాళ భైరవి చిత్రం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా (IFFI) లో ప్రదర్శింపబడ్డ తొలి దక్షిణ భరతదేశపు చిత్రం
- 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ ఆల్ ఇండియా సర్టిఫికెట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ని పొందిన ఏకైక తెలుగు చిత్రం
- రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నీస్ ప్రపంచ రికార్డులులో నమోదైనది.
- హైదరాబాదులో గల ప్రసాద్స్ ఐమ్యాక్స్ ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను.
- దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయి.