జాతి జువ్వి

(తెల్ల జువ్వి నుండి దారిమార్పు చెందింది)

జాతి జువ్విని White Fig (తెల్ల జువ్వి) అని కూడా అంటారు. దీని కాయలు తినవచ్చును. ఈ చెట్టు 24 నుంచి 27 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.

తెల్ల జువ్వి
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
F. virens
Binomial name
Ficus virens
Curtain Fig Tree in the Atherton Tableland.

పురాణ కథ

మార్చు

దేవతలు మొదట భూమి మీద నివసించేవారు. స్వర్గానికి పోవడానికి ఒక యజ్ఞం చేసారు. భూమి మీద మానములు కూడా అలాగే స్వర్గానికి రాకుండా ఒక యజ్ఞ పశువును నరికి దాని రక్తం ప్రవహింపజేసారు. అందులో నుంచే ప్లక్ష మొలిచింది.

గంధర్వులు, అప్సరసలు ఇలాంటి చెట్ల మీదనుంచే మానవులకు ఉన్మాదం కలిగిస్తారట. అందువలన ఈ జువ్వు గూటాలను హోమాలలో వాడితే వారు తృప్తిచెంది మానవులకు కీడు కలిగించరట.

ఉపయోగాలు

మార్చు

ఈ వృక్షం వలన చాలా ఉపయోగాలున్నాయి.[1]

  • విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఉపయోగిస్తారు.
  • ఆయుధాల వల్ల గాయాలైతే దీని పాలు పండ్ల రసములో కలిపి త్రాగితే తొందరగా నయమౌతాయి.
  • ఇది కఫ, వాత, పైత్యములు తగ్గించడానికి పనికివస్తుంది.
  • దీని బెరడు కషాయము పుక్కిలించిన నోటి పుండ్ల బాధ ఉపశమించును.
  • దీని బెరడును పంచవల్కలను తయారు చేయుటకు ఉపయోగిస్తారు.


మూలాలు

మార్చు
  1. ప్లక్ష - అడవి జువ్వి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1992, పేజీలు: 140-1.