తొగరు చెట్టు

(తొగరు నుండి దారిమార్పు చెందింది)

తొగరు చెట్టు
Leaves and fruit
Scientific classification
Kingdom:
(unranked):
Order:
Family:
Genus:
Species:
సిట్రిఫోలియా
Binomial name
మోరిండా సిట్రిఫోలియా

పరిచయం

మార్చు

'తొగరు చెట్టు రూబియేసి కుటుంబానికి చెందిన పొద లేక చిన్న చెట్టు. దీని శాస్త్రీయ నామం మోరిండా సిట్రిఫోలియా (Morinda citrifolia ). ఈ చెట్టును గ్రేట్ మొరిండా, ఇండియన్ మల్బరీ అని కూడా పిలుస్తారు. తెలుగులో మద్ది చెట్టు, మొగలి, మొలఘ, మొలుగు, తొగరు మద్ది, తొగలు మొగిలి అని కూడా అంటారు. సంస్కృతంలో అచ్చుక, ఆష్యుక అంటారు. తమిళనాడులో నునాకై, ముంజ పవత్తై అని పిలుస్తారు. ఇది ప్రధానంగా ఆగ్నేయ ఆసియా ఖండంలో కనిపిస్తుంది. దీని కాయలు అద్భుత ఔషధ గుణాలు గలవి. అందువల్ల తొగరును నేడు హవాయి, పిలిప్పియన్స్, మలేషియా, ఆస్ట్రేలియా, భారత్ వంటి దేశాల్లో వాణిజ్య పంటగా పండిస్తున్నారు. హవాయి దేశాల్లో తొగరు కాయను నోని ఫ్రూట్ అని అంటారు. తొగరు చెట్టు ఏ నేలలోనైనా ఎదుగుంది. సంవత్సర పొడవునా ఫలాలను ఇస్తుంది. మొక్క నాటిన సంవత్సరంలోనే కాపు మొదలవుతుంది.

ఉపయోగాలు

మార్చు

పాలినేషియన్లు తొగరు చెట్టును 2000 సంవత్సరాలుగా వివిధ వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు. నోని కాయలు రుచికి వగరుగా, చేదుగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో నోని కాయలను కరువు సమయాల్లో తింటారు. నోని కాయల నుండి తీసిన రసం బహిష్టు సమస్యలకు, మధుమేహానికి, కాలేయ వ్యాధులకు, క్యాన్సర్, మూత్ర సంబంధిత వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ఆకులు కీళ్ళ నొప్పులకు ఉపయోగపడాతాయి. పచ్చి కాయ రసం నోటి పొక్కులకు ఉపయోగపడతాయి; మగ్గిన కాయలు తిన్నచో గొంతురు రొంపకు, కాళ్ళ పగుళ్ళకు, ఆకలికి, పంటి నొప్పులకు ఉపయోగపడతాయి. ఈ చెట్టు బెరడు కషాయం కామెర్లకు ఉపయోగపడతాయి. నోని రసం ఎండోమెట్రిసిస్, ఆస్త్మాకు, ఎలర్జీలకు కూడా ఉపయోగపతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు నోని రసం సేవించడం ప్రమాదకరం.

రసాయనాలు

మార్చు

నోని కాయల పొడిలో కార్బోహైడ్రేట్స్, చిన్న మోతాదులో పీచు పదార్ధాలు ఉన్నాయి. విటమిన్ సి, ఐరన్, పొటాషియం, నియాసిన్, విటమిన్ ఎ, కాల్షియం, సోడియం కూడా చిన్న మోతాదుల్లో ఉంటాయి. లిగ్నాన్స్, ఒలిగో, పాలిసాక్కిరైడ్లు, ఫ్లావనాయిడ్లు, ఇరిడాయిడ్లు, ఫ్యాట్టీ యాసిడ్లు, స్కొపోలెటిన్, క్యాటెచిన్, బిటా-సిటోస్టెరాల్, డామ్నాకెంతాల్, ఆల్కలాయిడ్లు వంటి ఫైటో కెమికల్స్ ఉంటాయి.

లంకెలు

మార్చు