తొడా ప్రజలు
తోడా ప్రజలు తమిళనాడులోని నీలగిరి పర్వతాలలో నివసించే ద్రావిడ జాతి. 18 వ శతాబ్దం, బ్రిటీషు వలసరాజ్యానికి ముందు తోడా స్థానికంగా కోటా, బడగా, కురుంబాతో సహా ఇతర జాతి వర్గాలతో కలిసి ఒకే కులం-లాంటి సమాజంలో సహజీవనం చేసింది. ఇందులో తోడా అగ్రస్థానంలో ఉంది.[1]20 వ శతాబ్దంలో తోడా జనాభా 700 - 900 ఉంది.[1] భారతదేశంలోని పెద్ద జనాభాలో ఒక చిన్న భాగం అయినప్పటికీ 19 వ శతాబ్దం ఆరంభం నుండి తోడా "వారి జాతిపరమైన అసమర్థత కారణంగా చాలా అసమానతను ఎదుర్కొన్నది" [1] "వారి రూపురేక్ఖలు, మర్యాద, ఆచారాలు వారి పొరుగువారి అయిష్టతకు కారణం అయ్యాయి."[1] మానవ శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు వారి సంస్కృతిని అధ్యయనం చేయడం సాంఘిక మానవ శాస్త్రం, ఎథ్నోముసైకాలజీ రంగాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నం అయ్యారు.
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
---|---|
India (Tamil Nadu) | |
భాషలు | |
Toda |
తోడా సాంప్రదాయకంగా ముండు అని పిలువబడే స్థావరాలలో నివసిస్తుంది, ఇందులో మూడు నుండి ఏడు చిన్న కప్పబడిన ఇళ్ళు ఉంటాయి. ఇవి సగం బారెల్సు ఆకారంలో నిర్మించబడతాయి. పచ్చిక బయలు వాలులలో నిర్మించబడతాయి. వీటి మీద వారు దేశీయ గేదెలను మేపుతుంటారు.[2] వారి ఆర్థిక వ్యవస్థ గేదెల ఆధారపడింది. వీరి పాల ఉత్పత్తులు నీలగిరి కొండల పొరుగు ప్రజలకు విక్రయించబడుతుంటాయి.[2]తోడా మతం పవిత్రమైన గేదెను కలిగి ఉంది; తత్ఫలితంగా అన్ని పాడి కార్యకలాపాలకు, పాడి-పూజారులు ఆచారాలు నిర్వహిస్తారు. మత, అంత్యక్రియల ఆచారాలు సాంఘిక సందర్భాన్ని అందిస్తాయి. దీనిలో గేదె ఆరాధన గురించి సంక్లిష్టమైన కవితా పాటలు కూర్చబడి, జపించబడతాయి.[2]
సాంప్రదాయ తోడా సమాజంలో సోదర పాలియాండ్రీ చాలా సాధారణం; ఏదేమైనా స్త్రీ శిశుహత్య వంటి పద్ధతి ఇప్పుడు పూర్తిగా వదిలివేయబడింది. 20 వ శతాబ్దం చివరి త్రైమాసికంలో, బయటి వ్యక్తులు వ్యవసాయం కోసం ఉపయోగించడం వలన [2] తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అటవీ నిర్మూలన కారణంగా కొంత తోడా పచ్చిక భూమిని కోల్పోయింది. గేదె మందలను బాగా తగ్గించడం ద్వారా తోడా సంస్కృతిని అణగదొక్కడానికి ఇది బెదిరింపుగా మారింది. 21 వ శతాబ్దం ఆరంభం నుండి తోడా సమాజం, సాంస్కృతికంగా సున్నితమైన పర్యావరణ పునరుద్ధరణలో అంతర్జాతీయ ప్రయత్నానికి కేంద్రంగా ఉన్నాయి.[3] తోడా భూములు ఇప్పుడు యునెస్కో నియమించిన అంతర్జాతీయ బయోస్పియరు రిజర్వ్ అయిన నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లో ఒక భాగంగా ఉన్నాయి; వారి భూభాగం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది.[4]
జనసంఖ్య
మార్చు1984 లో ఎం.బి. ఎమెనియో అభిప్రాయం ఆధారంగా తోడా కోసం వరుసగా దశాబ్దపు భారత జనాభా లెక్కలు: 1871 (693), 1881 (675), 1891 (739), 1901 (807), 1911 (676) (748 నుండి సరిదిద్దబడింది), 1951 (879), 1961 (759), 1971 (812). తన తీర్పులో, ఈ రికార్డులు
"జస్టిఫు [వై] 700 - 800 మధ్య ఉన్న సంఖ్యకు దగ్గరగా ఉండవచ్చని తేల్చి చెప్పింది. ఆ వైవిధ్యం ఒకవైపు అంటువ్యాధి విపత్తు తరువాత నెమ్మదిగా కోలుకోవటానికి కారణమైనుండవచ్చు. (1921 (640), 1931 (597), 1941 (630 శాతం) లేదా మరోవైపు డబులు ఎన్యూమరేషను (1901 - 1911 లకు సెన్ససు అధికారులు ఇప్పటికే సూచించారు. బహుశా 1951 కోసం సూచించారు). గణాంకాలలో అనిశ్చితికి మరో అంశం ప్రకటించినది లేదా ప్రకటించనిది క్రైస్తవ తోడాలను వివిధ ఎన్యూమరేటర్లు చేర్చుకోవడం లేదా మినహాయించడం ... 700 - 800 మధ్య ఒక సంఖ్యను ఇవ్వడం చాలా అసాధ్యం, సమాజానికి వర్తించే ప్రజారోగ్య ప్రయత్నాలు అభివృద్ధి చెందినట్లు కనిపిస్తున్నందున, ప్రస్తుత, భవిష్యత్తు ఆశాజనకంగా ఉండవచ్చు. తత్ఫలితంగా జననాల శాతం, జనాభా పెరుగుదల సాధ్యమని కొందరు ఆశిస్తారు. అయినప్పటికీ సమాజం క్షీణిస్తుందని గమనించారు. మునుపటి అంచనాలు మితిమీరిన నిరాశావాదం, బహుశా అభివృద్ధి ప్రణాళికలు బాగా స్థాపించబడలేదు. "[1]
భౌతిక రూపురేక్గలు
మార్చుభౌతిక మానవ శాస్త్రవేత్త ఎగాన్ ఫ్రీహెర్ వాన్ ఐక్‌స్టెడ్ మొదట తోడాలను " సౌత్ ఇండిడ్ " అని వర్ణించాడు. అందువలన వాటిని పురాతన ప్రోటో ద్రావిడ జనాభాతో కలుపుతుంది.[5] 21 వ శతాబ్దం ప్రారంభంలో డి.ఎన్.ఎ. అధ్యయనాలు తోడా, కోటా జాతులు జన్యువులను పంచుకున్నాయని తేలింది.[6]
సంస్కృతి, సంఘం
మార్చుతోడాప్రజలు సంప్రదాయంగా, భాషాపరంగా కోటా ప్రజలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు.
దుస్తులు
మార్చుతోడా దుస్తులు ఒకే వస్త్రం కలిగి ఉంటాయి. ఇది పురుషులకు ధోతిపై శాల్య ర్యాప్ లాగా, షాల్య ర్యాపుతో పాటు మహిళలకు స్కర్టు.
ఆర్ధికం
మార్చువారి ఏకైక వృత్తి పశువుల పెంపకం, పాడి పని. గేదె పాలను నిల్వ చేయడానికి పవిత్ర డెయిరీలను నిర్మించారు.
వివాహాలు
మార్చువారు ఒకప్పుడు సోదర పితృస్వామ్య విధానం అభ్యసించారు. ఈ పద్ధతిలో ఒక స్త్రీ ఒక కుటుంబంలోని సోదరులందరినీ వివాహం చేసుకునే ఆచారం గతంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం అది ఆచరణలో లేదు.[7][8]
అలాంటి వివాహాలలో పిల్లలందరూ పెద్ద సోదరుడి నుండి వచ్చినవారని భావించారు. మగవారికి ఆడవారి నిష్పత్తి మూడు నుండి ఐదు వరకు ఉంటుంది. ఈ సంస్కృతి చారిత్రాత్మకంగా ఆడ శిశుహత్యలను అభ్యసించింది. తోడా తెగలో కుటుంబాలు జంటల కోసం ఒప్పందం కుదుర్చుకుని బాల్యవివాహాలను ఏర్పాటు చేస్తాయి.
నివాసాలు
మార్చుతోడాలు ముండులు అనే చిన్న కుగ్రామాలలో నివసిస్తున్నారు. టోడా గుడిసెలు (డాగల్సు అని పిలుస్తారు), ఇవి ఓవలు, పెంటు ఆకారంలో ఉంటాయి. ఇవి సాధారణంగా 10 అడుగుల (3 మీ) ఎత్తు, 18 అడుగుల (5.5 మీ) పొడవు, 9 అడుగుల (2.7 మీ) వెడల్పుతో నిర్మించబడి ఉంటాయి. అవి వెదురు, పేముతో నిర్మించబడతాయి. గుడిసెకు దాని ప్రాథమిక బెంటు ఆకారాన్ని ఇవ్వడానికి మందపాటి వెదురు చెరకు వంపు ఉంటుంది. సన్నని పేం చెరకు (రట్టను) ఈ చట్రంలో ఒకదానికొకటి దగ్గరగా, సమాంతరంగా కట్టివేయబడి ఉంటాయి. దీని మీద ఎండిన గడ్డిని పేరుస్తారు. ప్రతి గుడిసె రాళ్ల గోడ లోపల ఉంటుంది.
గుడిసె ముందు, వెనుక భాగం సాధారణంగా రాళ్లతో (ఎక్కువగా గ్రానైటు) తయారు చేస్తారు. ఈ గుడిసెలో ముందు భాగంలో ఒక చిన్న ప్రవేశం ఉంది - సుమారు 3 అడుగుల (90 సెం.మీ) వెడల్పు, 3 అడుగుల (90 సెం.మీ) పొడవు, దీని ద్వారా ప్రజలు లోపలికి ప్రవేశించడానికి తల వంచి ప్రవేశించాలి. ఈ అసాధారణంగా చిన్న ప్రవేశం అడవి జంతువుల నుండి రక్షణకు సాధనంగా ఉపయోగిస్తారు. గుడిసె ముందు భాగం తోడా కళారూపాలతో అలంకరించబడి ఉంటుంది. ఇది ఒక రకమైన రాకు కుడ్య చిత్రలేఖనం.
ఆహారం
మార్చుశాఖాహారులు, మాంసం, పొదుగుతున్న గుడ్లు లేదా చేపలను తినరు (కొంతమంది గ్రామస్తులు చేపలు తింటున్నప్పటికీ). గేదెను పవిత్రమైన డైరీలో పాలు విక్రయిస్తారు. అక్కడ పూజారి / పాలవాడు కూడా వారి బహుమతులను అందిస్తాడు. బఫెలో పాలను వివిధ రూపాలలో ఉపయోగిస్తారు: వెన్న, మజ్జిగ, పెరుగు, జున్ను, త్రాగడానికి సాదా పాలు. బియ్యం ప్రధానమైనవి పాల ఉత్పత్తులు, కూరలతో తింటారు.
మతం
మార్చుతోడాల పౌరాణిక కథనాల ఆధారంగా టీకిర్షి దేవత, ఆమె సోదరుడు కలిసి మొదటి పవిత్రమైన గేదె, తరువాత మొదటి తోడా మనిషిని సృష్టించారు. మొదటి తోడా పురుషుడి కుడి పక్కటెముక నుండి మొదటి తోడా మహిళ సృష్టించబడింది. అనేక ఆచారాలు గేదెను పోలి ఉంటాయి. దాని పాలు, ఇతర ఉత్పత్తులు వారి ఆహారానికి ఆధారంగా ఉంటాయి.
తోడా మతం ఉన్నత తరగతి పురుషులను పవిత్ర పాలపురుషులుగా ఉద్ధరించే పవిత్ర పాడి పూజారులుగా పవిత్ర హోదాను ఇచ్చింది. 1922 లో సర్ జేమ్స్ ఫ్రేజర్ అభిప్రాయం ఆధారంగా (గోల్డెన్ బగ్ నుండి క్రింద ఉన్న కోట్ చూడండి), పవిత్ర పాలపురుషుడు కార్యాలయంలో ఉన్నప్పుడు వంతెనల మీదుగా నడవడం నిషేధించబడింది. ఆయన కాలినడకన, లేదా ఈత ద్వారా నదులను దాటవలసిన అవసరం ఉండేది. ప్రజలు బూట్లు ధరించడం లేదా ఎలాంటి పాదాల కవరింగు నిషేధించారు.
తోడా దేవాలయాలు రాళ్ళతో కప్పబడిన వృత్తాకార గొయ్యిలో నిర్మించబడ్డాయి. ఇవి తోడా గుడిసెలకు సమానంగా, నిర్మించబడతాయి. దేవాలయాలుగా నియమించబడిన ఈ గుడిసెలకు దగ్గరగా పోవడానికి లేదా ప్రవేశించడానికి మహిళలకు అనుమతి లేదు.
ఫ్రేజర్సు గోల్డెను బోఫ్ నుండి 1922:
"దక్షిణ భారతదేశంలోని తోడాలలో పవిత్రమైన పాడి పూజారిగా పనిచేసే పవిత్ర పాలపురుషుడు తన పదవిలో ఉన్న మొత్తం కాలంలో అనేక రకాల ఇబ్బందికరమైన, భారమైన ఆంక్షలకు లోబడి ఉంటాడు. ఇది చాలా సంవత్సరాలు ఉండవచ్చు. అందువలన ఆయన తప్పక జీవించాలి పవిత్రమైన పాలపురుషుడు తన ఇంటిని లేదా ఏ సాధారణ గ్రామాన్ని ఎప్పుడూ సందర్శించకపోవచ్చు. ఆయన బ్రహ్మచారిగా ఉండాలి; ఆయన వివాహం చేసుకుంటే ఆయన తన భార్యను విడిచిపెట్టాలి. లేకుంటే ఆయన తన కార్యాలయాన్ని వదలివేసి ఆయన పవిత్రత కాపాడు కోవాలి. వారంలో రెండు రోజులు అంటే సోమ, గురువారాల్లో మాత్రమే సాధారణ వ్యక్తి పాలపురుషుడితో సంప్రదించవచ్చు; ఇతర రోజులలో ఆయనతో ఏదైనా పని ఉంటే, ఆయన దూరంగా నిలబడాలి (కొందరు మైలులో నాలుగింట ఒక వంతు చెబుతారు), తన సందేశాన్ని మధ్య ప్రదేశంలో నిలబడి అరవాలి. అంతేకాకుండా పవిత్రమైన పాలపురుషుడు తన పదవి కాలంలో ఉన్నంతవరకు తన వెంట్రుకలను కత్తిరించడు లేదా గోళ్ళను కత్తిరించడు; ఎవరికైనా మరణం సంభవిస్తే తన వంశంలో ఆయన మొదట తన కార్యాలయానికి రాజీనామా చేసి పలపురుషుడి ఉన్నతమైన స్థానం నుండి కేవలం సాధారణ మర్త్యానికి దిగితే మినహా ఆయన అంత్యక్రియలకు హాజరు కాకపోవచ్చు. వాస్తవానికి పాతరోజులలో తన వంశంలోని ఏ సభ్యుడైనా ఈ జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చేది. ఏదేమైనా ఈ భారీ ఆంక్షలు పూర్తిగా అత్యున్నత తరగతికి చెందిన పాలపురుషులకు మాత్రమే ఉంచబడ్డాయి ".
వంశాలు
మార్చుతొడా భాష ద్రావిడం కుటుంబంలో సభ్యుడు. భాష టైపోలాజికలుగా అసహజమైనది. శబ్దపరంగా కష్టమైనది. భాషా శాస్త్రవేత్తలు తోడాను (దాని పొరుగు కోటాతో పాటు) చారిత్రక కుటుంబ ప్రోటో-సౌత్-ద్రావిడ దక్షిణ ఉప సమూహంలో సభ్యునిగా వర్గీకరించారు. ఇది దక్షిణ ద్రావిడ నుండి కన్నడ, తెలుగు తరువాత, కానీ మలయాళానికి ముందుగా విడిపోయింది.[1]
సంస్కృతి
మార్చుఇతర ప్రజలతో సాంకేతికంగా కలవవలసిన అవసరాలు ఏర్పడిన కారణంగా తోడా జీవనశైలి చాలా మార్పులకు కారణమైంది. వారు ప్రధానంగా మతసంబంధమైన ప్రజలు. కానీ ప్రస్తుతం వారు ఎక్కువగా వ్యవసాయం, ఇతర వృత్తులలోకి ప్రవేశిస్తున్నారు. వారు పూర్వం కఠినమైన శాఖాహారులుగా ఉండేవారు కాని ఇప్పుడు కొంతమంది మాంసం తింటారు.
21 వ శతాబ్దం ప్రారంభంలో కాంక్రీటుతో చేసిన ఇళ్ల కోసం అనేకమంది తోడాలు విలక్షణమైన వారి సాంప్రదాయ గుడిసెలను విడిచిపెట్టినప్పటికీ,[7]సాంప్రదాయ బారెల్-కప్పబడిన గుడిసెలను నిర్మించడానికి ఒక ఉద్యమం అభివృద్ధి చెందింది. 1995 నుండి 2005 వరకు ఈ శైలిలో నలభై కొత్త గుడిసెలు నిర్మించబడ్డాయి. అనేక తోడా పవిత్ర డెయిరీలు పునరుద్ధరించబడ్డాయి. ప్రతి దాని చుట్టూ ఇరుకైన రాతి గొయ్యి ఉంటుంది. చిన్న తలుపు ఒక భారీ రాయితో మూసివేయబడుతుంది. పూజారి మాత్రమే దానిలోకి ప్రవేశించవచ్చు. ఇది పవిత్రమైన గేదె పాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.[9]
ఎంబ్రాడియరీ
మార్చుభౌగోళిక సూచిక రిజిస్ట్రారు ఈ ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీకి హోదాను గి.ఐ. ఇచ్చారు. ఇది తరతరాలుగా ఇవ్వబడింది. ఈ స్థితి టోడా ఎంబ్రాయిడరీ ఉత్పత్తులకు ఏకరీతి ధరను నిర్ధారిస్తుంది. తక్కువ-నాణ్యత నకిలీ నుండి రక్షణను అందిస్తుంది.[10]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 (Emeneau 1984, pp. 1–2)
- ↑ 2.0 2.1 2.2 2.3 "Toda", Encyclopædia Britannica. (2007
- ↑ Chhabra 2006
- ↑ World Heritage sites, Tentative lists, April 2007. Whc.unesco.org (27 June 2013) in 2012.
- ↑ Eickstedt, E. "Anthropologische Forschungen in Südindien". Anthropologischer Anzeiger (6): 64–85.
- ↑ Vishwanathan, H.; et al. (డిసెంబరు 2003). "Insertions/Deletions Polymorphism in Tribal Populations of Southern India and their possible Evolutionary Implications". Human Biology. 75 (6).
- ↑ 7.0 7.1 (Walker 2004)
- ↑ (Walker 1998)
- ↑ (Chhabra 2005) harv error: multiple targets (2×): CITEREFChhabra2005 (help) Quote: "... over the past ten years, we have approached government and private agencies for sponsoring traditional houses. Today, we have been able to assist in funding over forty barrel-vaulted houses. Added to these are the scores of existing temples – two are conical and the rest barrel-vaulted."
- ↑ "GI certificate for Toda embroidery formally handed over to tribals", The Hindu (15 June 2013).
వనరులు
మార్చు- Classic Ethnographies
- Marshall, William E. (1873), Travels amongst the Toda, or the study of a primitive tribe in South India, London: Longmans, Green, and Co. Pp. xx, 269.
- Rivers, W. H. R. (1906), The Todas, London: Mcmillan and Company. Pp. xviii, 755.
- Thurston, Edgar; K. Rangachari (1909). Castes and Tribes of Southern India, Volume 7. Madras: Government Press.
- Walker, Anthony R. (1986). The Toda of South India: A New Look. Delhi: Hindustan Publishing Corp.
- Toda Music, Linguistics, Ethnomusicology
- Emeneau, M. B. (1958), "Oral Poets of South India: Todas", Journal of American Folklore, 71 (281): 312–324, doi:10.2307/538564, JSTOR 538564
- Emeneau, M. B. (1971), Toda Songs, Oxford: Clarendon Press. Pp. xvii, 1003.
- Hockings, Paul (1972), "Reviewed Work(s): Toda Songs, by M. B. Emeneau", The Journal of Asian Studies, 31 (2): 446, doi:10.2307/2052652, JSTOR 2052652
- Emeneau, Murray B. (1974), Ritual Structure and Language Structure of the Todas, Philadelphia: American Philosophical Society, Pp. 103, ISBN 0-87169-646-0.
- Tyler, Stephen A. (1975), "Reviewed Work(s): Ritual Structure and Language Structure of the Todas by M. B. Emeneau", American Anthropologist, 77 (4): 758–759, doi:10.1525/aa.1975.77.4.02a00930, JSTOR 674878.
- Emeneau, Murray B. (1984), Toda Grammar and Texts, Philadelphia: American Philosophical Society, Pp. xiii, 410, index (16), ISBN 0-87169-155-8.
- Nara, Tsuyoshi and Bhaskararao, Peri. 2003. Songs of the Toda. Osaka : ELPR Series A3-011.91pp [+3CDs with sound files of the songs].
- Nettl, Bruno; Bohlman, Phillip Vilas (1991), Comparative Musicology and Anthropology of Music: Essays on the History of Ethnomusicology, Chicago and London: University of Chicago Press, Pp. 396, pp. 438–449, ISBN 0-226-57409-1.
- Shalev, M. Ladefoged, P. and Bhaskararao, P. 1994. "Phonetics of Toda." PILC Journal of Dravidic Studies, 4:1. 19-56pp. (Earlier version in: University of California Working Papers in Phonetics. 84. 89-126 pp.). 1993.
- Spajic', S. Ladefoged, P. and Bhaskararao, P. 1996. "The Trills of Toda." Journal of International Phonetic Association, 26:1. 1-22pp.
- Modern Anthropology, Sociology, History
- Walker, Anthony (1998), Between Tradition and Modernity, and Other Essays on the Toda of South India, Delhi: B. R. Publishing Corporation, archived from the original on 17 సెప్టెంబరు 2008, retrieved 18 డిసెంబరు 2019.
- Emeneau, M. B. (1988), "A Century of Toda Studies: Review of 'The Toda of South India: A New Look' by Anthony R. Walker; M. N. Srinivas", Journal of the American Oriental Society, 108 (4): 605–609, doi:10.2307/603148, JSTOR 603148.
- Sutton, Deborah (2003), "'In this the land of the Todas': Imaginary Landscapes and Colonial Policy in Nineteenth-Century Southern India", in Dorrian, M.; Rose, G. (eds.), Deterritorialisations, Revisioning Landscape and Politics, London: Black Dog Press.
- Sutton, Deborah (2002), "'Horrid Sights and Customary Rights': The Toda Funeral on the Colonial Nilgiris", Indian Economic and Social History Review, 39 (1): 45–70, doi:10.1177/001946460203900102.
- Walker, Anthony R. (2004), "The Truth About The Toda", Frontline, the Hindu, archived from the original on 13 అక్టోబరు 2007, retrieved 18 డిసెంబరు 2019
{{citation}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help).
- Toda Traditional Knowledge, Environment, and Modern Science
- From: Chhabra, Tarun. 15 August 2002. "Toda's Traditions In Peril", Down to Earth. Quote:
“ | Toda’s quaint barrel vaulted houses, which symbolise the Nilgiris, are today hard to spot. These images have been dry transferred on T-shirts and other products as logos. Seven years ago, there were just a couple of traditional houses remaining in the permanent hamlets. One day, a Toda wanted to build a traditional house for his ailing father. The administration agreed to provide the funds. Quite soon, it was ready and one Sunday morning, the Collector, additional Collector and the Superintendent of police inaugurated the house. The construction was so impressive that advances were paid on the spot for two more houses. Nine houses came up that year. Today, over 35 traditional houses have been constructed. | ” |
- Chhabra, Tarun (2005), "How Traditional Ecological Knowledge addresses Global Climate change: the perspective of the Todas - the indigenous people of the Nilgiri hills of South India" (PDF), Proceedings of the Earth in Transition: First World Conference, archived from the original (PDF) on 4 September 2012.
- The Society for Ecological Restoration and Indigenous Peoples' Restoration Network. EIT PROJECT SHOWCASE: The Edhkwehlynawd Botanical Refuge (EBR)
- Chhabra, Tarun (2005), "How Traditional Ecological Knowledge addresses Global Climate change: the perspective of the Todas - the indigenous people of the Nilgiri hills of South India" (PDF), Proceedings of the Earth in Transition: First World Conference (PPT), archived from the original (PDF) on 11 అక్టోబరు 2007.(Pictures of a new house being built on pages 57–60, and new house, with decorative art, being blessed on page 70)
- Chhabra, Tarun (2006), "Restoring the Toda Landscapes of the Nilgiri Hills in South India", Plant Talk, 44, archived from the original on 10 అక్టోబరు 2007.
- India Environmental Trust. 2005. Supported Projects: Edhkwehlynawd Botanical Refuge (EBR) - Reforestation in a Tribal Area
- National Committee for the Netherlands for the International Union for the Conservation of Nature (IUCN-NL). 2006. Funded Projects:, India: Nilgiri Hills, NGO (EBR), 8 Hectares.
- Rajan, S.; Sethuraman, M.; Mukherjii, Pulok K. (2002), "Ethnobiology of the Nilgiri Hills, India", Phytotherapy Research, 16 (2): 98–116, doi:10.1002/ptr.1098, PMID 11933110.
వెలుపలి లింకులు
మార్చు- The Society for Ecological Restoration and Indigenous Peoples' Restoration Network. EIT PROJECT SHOWCASE: The Edhkwehlynawd Botanical Refuge (EBR)
- India Environmental Trust. 2005. Supported Projects: Edhkwehlynawd Botanical Refuge (EBR) - Reforestation in a Tribal Area
- National Committee for the Netherlands for the International Union for the Conservation of Nature (IUCN-NL). 2006. Funded Projects:, India: Nilgiri Hills, NGO (EBR), 8 Hectares.
- Toasting the Todas — 2008. Travelogue with pictures of ceremonies.
- Ethnologue: Toda, A language of India
public domain: Chisholm, Hugh, ed. (1911). "Todas". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 26 (11th ed.). Cambridge University Press. p. 1044.
This article incorporates text from a publication now in the