తొలెరుక ప్రఖ్యాత రచయిత, ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార విజేత ఛాయరాజ్ వ్రాసిన కావ్యం.[1] ప్రపంచ పీడనని భరించి, జన్మనిచ్చిన 'తొలెరుక' అమ్మ గర్భకోశం గోడల ప్రకంపనాల్లోంచి సామాజిక వైరుధ్యాల మూలాలను వెతికి పట్టుకుని ఈ రచన చేసారు.[2]

పుస్తకం విశేషాలు మార్చు

అమ్మను "తొలెరుక" గా చెప్పడం చెరుకుకంటే తీయని మధురానుభూతి పద చిత్రంగా ఎవరైనా ఒప్పుకోవలసినదే. సామ్రాజ్యవాదం "అమ్మ" స్వరూపాన్ని మార్చేసింది అని అంటారు ఛాయరాజ్. "ఆమె" పై అత్యాచారం చేయడాఅనికి వయోపరిమితులు లేకపోవడం మానవ దుస్థితికి నిదర్శనమన్నారు. ఆమెను గత్య చేయదాఅనికి అనంతకోటి వంశాలు సాకుగా అందుబాటులో వున్నాయంటారు. సౌందర్యానుభవ వాంఛల సాధనంగా, ప్రత్యుత్పత్తి యంత్రంగా ఆమెను చూడటమే సమకాలీన స్త్రీ ఆరాధనని విశ్లేషించడం. తన "తొలెరుక" దీర్ఘ కవిత ద్వారా ఇది నిజమనిపించారు ఆయన. దీనిని జన్మ కావ్యంగా చిత్రించారు.

"ప్రాచీన ప్రవాహాల్లోంచి ప్రార్థనల వ్యాకరణాల్లోంచి అపూర్వ రచనల్లోంచి అమ్మను చూడగలిగినంత మాత్రమే చూడగలిగాను; సీత, కుంతి, వాసవదత్త, శకుంతల, వసంతసేన; గోర్కీ "అమ్మ", గురజాడ - "మధురవాణి", చలం "అమీనా", శివసాగర్ "అమ్మ", స్త్రీవాద నీలిమేఘాలు లోని జన్మ సౌందర్య, రసధ్వనులను, గర్జనలను ఆలకించి అమ్మను తలచుకున్నాను." ఇది ఛాయరాజ్ ముద్ర. ఈ భయంకర వ్యవస్థలో "ఆమె" పుట్టుకను పెరుగుదలను చూశాను. అమ్మ గర్భకోశం లోంచి ఆమె అనుబహ్విస్తున్న హింసను ధరించి చూశాను. ఈ పరిస్థితులను ధ్వంసించేందుదా అన్నట్లు హింసను ధరించి చూసాను. అమ్మ గర్భకోశం లోంచి ఆమె అనుభవిస్తున్న హింసను ధరించి చూసాను. ఈ పరిస్థితులను ధ్వంసించేందుకా అన్నట్లు ప్రతిక్షణం పుడుతున్న కోటానుకోట్ల ఆడబిడ్దల ఫిరంగి నవ్వులలోంచి నన్ను పలకరిస్తున్న "అమ్మ"ను భరించిన ఆవేశాలలో ఈ కవితను అలంకరించి ఈ విశ్వానికి అందజేస్తున్నాననై సగర్వంగా చెప్పుకున్నారు.

గ్రామాన్ని చూసినవాడు-పల్లెను పలకరించినవాడు-గూడెం గుండె చప్పుళ్ళు విన్నవాడు, వారి కంటి చెమ్మలో గుండెలు తడుపుకున్నవాడు కాబట్టే జనం కోసం ఆయన ఇది రాయగలిగాడు. ఈ కావ్యం జనసాహితి విప్లవంగా పారింది. స్త్రీ పురుష సంబంధాలను విప్లవీకరించి అందమైన పదచిత్రాలతో రాయడాం ఛాయరాజ్ కే చెల్లింది.[3]

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు