తౌబాల్
తౌబాల్, మణిపూర్ రాష్ట్రంలోని తౌబాల్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. 18 మున్సిపల్ వార్డులతో మున్సిపల్ కౌన్సిల్ గా ఏర్పడింది. 'అథౌబా' అనే పదం నుండి 'తౌబాల్' వచ్చింది. మణిపూర్ రాష్ట్రంలోని పెద్ద పట్టణాల్లో ఒకటైన ఈ పట్టణంలో అనేక సరస్సులు, నదులు, వరి పొలాలు, తోటలు ఉన్నాయి.
తౌబాల్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°38′N 94°01′E / 24.63°N 94.02°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | తౌబాల్ |
Elevation | 765 మీ (2,510 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 45,947 |
భాషలు | |
• అధికారిక | మీటీ (మణిపూర్) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 795138 |
టెలిఫోన్ కోడ్ | 03848 |
Vehicle registration | ఎంఎన్ 04 |
భౌగోళికం
మార్చుతౌబాల్ పట్టణం 24°38′N 94°01′E / 24.63°N 94.02°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్రమట్టానికి 765 మీటర్ల (2,509 అడుగుల) ఎత్తులో ఉంది. ఇది తౌబల్ నది ఒడ్డున ఉంది.
జనాభా
మార్చు2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [3] తౌబాల్ పట్టణంలో 41,149 జనాభా ఉంది. ఈ జనాభాలో 50% మంది పురుషులు, 50% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 75% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 85% కాగా, స్త్రీల అక్షరాస్యత 65%గా ఉంది. మొత్తం జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
పర్యాటక ప్రాంతాలు
మార్చుచుట్టూ కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశం ట్రెక్కింగ్, హైకింగ్ లకు అనువుగా ఉంటుంది. ఇక్కడ అందమైన నదులు, సరస్సులు ఉన్నాయి. ఇక్కడి స్థానిక ప్రజలు తమ ఇళ్ల మైదానంలో మర్రి చెట్లను పెంచుతారు.[4]
- తౌబల్ నది
- ఇంఫాల్ నది
- ఐకాప్ సరస్సు
- వైథౌ సరస్సు
- పీపుల్స్ మ్యూజియం
- లౌసీ సరస్సు
- తౌబల్ బజార్
- ఖోంగ్జోమ్ యుద్ధ స్మారకం
రాజకీయాలు
మార్చుతౌబాల్ పట్టణం, 31 - తౌబాల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.
రవాణా
మార్చురోడ్డుమార్గం
మార్చుతౌబాల్ పట్టణం నుండి టాటా మ్యాజిక్, ఆటో, వింగర్ వంటి వాహనాల ద్వారా మాత్రమే రవాణా సౌకర్యం ఉంది.
ఆర్థిక వ్యవస్థ
మార్చు2006 సామాజిక-ఆర్థిక సర్వే ప్రకారం, ఈ పట్టణంలో 15,320 (పట్టణ జనాభాలో 36.94%) మంది శ్రామికులు ఉన్నారు. ఈ శ్రామిక జనాభాలో 10,207 (24.61%) మంది పురుషులు, 5,113 (12.33%) మంది స్త్రీలు ఉన్నారు. పట్టణంలో శ్రామికుల తలసరి వార్షిక ఆదాయం రూ. 24,810 గా ఉంది.
క్రీడలు
మార్చుఇక్కడ తౌబల్ జిల్లా ఇండోర్ స్టేడియం ఉంది.
మూలాలు
మార్చు- ↑ http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=278751
- ↑ "Maps, Weather, and Airports for Thoubal, India". www.fallingrain.com. Retrieved 2021-01-08.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2021-01-08.
- ↑ "Top 8 Places To Visit In Manipur". Trans India Travels. 2016-12-05. Retrieved 2021-01-08.
ఇతర లంకెలు
మార్చు- మణిపూర్ ప్రభుత్వం పర్యాటక వెబ్సైట్ Archived 2014-06-06 at the Wayback Machine