త్రినాథ్ రావ్
త్రినాథ్ రావ్ భారతదేశానికి చెందిన సినిమా నృత్య దర్శకుడు. ఆయన కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'తూరల్ నిన్రు పోచ్చు' కొరియోగ్రాఫర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500 పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశాడు.
త్రినాథ్ రావ్ | |
---|---|
జననం | త్రినాథ్ రావ్ 1953 |
మరణం | 2022 జూన్ 15 చెన్నై, తమిళనాడు |
వృత్తి | నృత్యదర్శకుడు (కొరియోగ్రాఫర్) |
పిల్లలు | 6 |
సినీ జీవితం సవరించు
త్రినాథ్ రావ్ సినీరంగంలోకి అడుగుపెట్టి శేషు మాస్టర్, పసుమర్తి కృష్ణమూర్తి, సలీం మాస్టర్, వెంపటి చిన్నసత్యం దగ్గర వద్ద అసిస్టెంట్‌గా పని చేసి 1982లో కె.భాగ్యరాజ్ డైరెక్ట్ చేసిన ‘తూరల్ నిన్రు పోచ్చు’ అనే చిత్రం ద్వారా వెండితెరకు నృత్యదర్శకుడిగా పరిచయమై తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 500 పైగా సినిమాలకు నృత్యదర్శకుడిగా పని చేశాడు.
నృత్యదర్శకుడిగా కొన్ని సినిమాలు సవరించు
- తూరల్ నిన్రు పోచ్చు (1982)
- రాణీకాసుల రంగమ్మ
- ముందానై ముడిచ్చు
- అమరావతి
- వైదేహి కాత్తిరుందాల్
- వానత్తై పోల
- సెందూర పాండి
- దావడి కలవుగల్
- నేశం
మరణం సవరించు
త్రినాథ్‌రావ్ గుండెపోటుతో చెన్నైలోని స్వగృహంలో జూన్ 15న మరణించాడు. ఆయనకుకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు.[1][2][3]
మూలాలు సవరించు
- ↑ Sakshi (16 June 2022). "చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
- ↑ Zee News Telugu (16 June 2022). "సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత..." Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
- ↑ Andhra Jyothy (16 June 2022). "ప్రముఖ నృత్యదర్శకుడు త్రినాథ్‌రావ్ మృతి" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.