ఏలూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్‌ జిల్లా

[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Pagetype/setindex' not found.]]

ఏలూరు జిల్లా
ఏలూరు లో బుద్ధ పార్క్ లో గౌతమ బుద్ధుని విగ్రహం
ఏలూరు లో బుద్ధ పార్క్ లో గౌతమ బుద్ధుని విగ్రహం
Location of ఏలూరు జిల్లా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఆంధ్రప్రదేశ్
జిల్లా కేంద్రంఏలూరు
Government
 • జిల్లా కలెక్టర్వి ప్రసన్న వెంకటేష్
Area
 • Total6,411.56 km2 (2,475.52 sq mi)
Population
 (2011)[1]
 • Total20,02,658
 • Density310/km2 (810/sq mi)

ఏలూరు జిల్లా 2022లో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా పాత పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా నుండి విడదీసి కొత్తగా ఏర్పరచిన జిల్లా. జిల్లా కేంద్రం ఏలూరు. కొల్లేరు సరస్సు, ఏలూరు సమీపాన "చిన్న తిరుపతి"గా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.

చరిత్ర మార్చు

ఏలూరు జిల్లా చరిత్రకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా చరిత్రలు ఆధారం.

బాదామి చాళుక్యుల (పశ్చిమ చాళుక్యులు) వంశానికి చెందిన 2వ పులకేశి సోదరుడైన కుబ్జవిష్ణువు పిఠాపురాన్ని జయించి ఇక్కడ చాళుక్యుల పాలనకు నాంది పలికాడు. కుబ్జ విష్ణునితో తూర్పు చాళుక్య పాలన మొదలయ్యింది. తూర్పు చాళుక్యులు 700 నుండి 1200 వరకు కోస్తా ఆంధ్రను పాలించారు. వారి పాలనలో రాజధాని పిఠాపురం నుండి వేంగి (ఏలూరుకి సమీపంలోగలది), తరువాత రాజమండ్రికి మార్చబడింది. సా.శ. 892-921 మధ్య రాజైన 1వ చాళుక్య భీముడు ద్రాక్షారామ శివాలయాన్ని నిర్మించాడు. కాకతీయ వంశజ రాణి రుద్రమదేవి నిరవద్యపురము అనబడే ఈనాటి నిడదవోలును రాజధానిగా పాలించిన చాళుక్యుల ఇంటి కోడలు. ఏలూరు 1471 వరకు కళింగ సామ్రాజ్యంలో భాగమైంది.తర్వాత గజపతి సామ్రాజ్యం చేతుల్లోకి వెళ్లింది.1515లో కృష్ణదేవరాయలు దీనిని స్వాధీనం చేసుకున్నారు.విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత, దీనిని గోల్కొండ కోట సుల్తాన్ కుతుబ్ షా స్వాధీనం చేసుకున్నాడు.

2022 ఏప్రిల్ 4న,పాత పశ్చిమ గోదావరి జిల్లా నుండి 8 మండలాలు పాత కృష్ణా జిల్లా నుండి 20 మండలాలతో మొత్తం 28 ఏలూరు జిల్లా ఏర్పాటు చేశారు.[1]

భౌగోళిక స్వరూపం మార్చు

 
ఏలూరులో ఒక వాణిజ్య ప్రాంతం

జిల్లా 6,679 కిమీ 2 (2,578.776 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది. జిల్లాకు ఉత్తరాన తెలంగాణ లోని భద్రాద్రి జిల్లా, తూర్పున అల్లూరి సీతారామరాజు జిల్లా,తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా, దక్షిణాన కృష్ణా జిల్లా,పశ్చిమ గోదావరి జిల్లా, పశ్చిమాన ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా గణాంకాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా మొత్తం జనాభా 20,02,658. ఇది రాష్ట్ర మొత్తం జనాభాలో 4.04%గా ఉంది . జిల్లాలో స్త్రీ జనాభా 10,02,389 ఉన్నారు. జిల్లాలోని గ్రామీణ జనాభా 16,18,288 ఉన్నారు ఇది జిల్లా జనాభాలో 80.70 %గా ఉంది.జిల్లాలోని SC జనాభా 4,38,087 ఉన్నారు. ST జనాభా 1,21,973 ఉన్నారు. 2011 జనాభా లెక్కల వరకు జిల్లాలో పది సంవత్సరాల జనాభా పెరుగుదల 3.5%.గా ఉంది.జిల్లా అక్షరాస్యత రేటు 71.44%, ఇది రాష్ట్ర అక్షరాస్యత రేటు 67.35% కంటే ఎక్కువ. జిల్లాలో లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 1002 స్త్రీలు ఉన్నారు.

వాతావరణం మార్చు

ఏలూరు జిల్లాలో, డెల్టా ప్రాంతంలో శీతాకాలం వేసవి కాలాల్లో వాతావరణం మధ్యస్థంగా ఉంటుంది.ఏజెన్సీ ప్రాంతాల్లో వేసవిలో వేడి తీవ్రంగా ఉంటుంది. జిల్లాలో సాధారణ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36.2 0 C నుండి 19.9 0 C వరకు నమోదవుతాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో నమోదవుతుంది.వర్షపాతం ఎక్కువగా నైరుతి ఈశాన్య రుతుపవనాల నుండి పొందుతుంది.

పర్యాటక ప్రాంతాలు మార్చు

 
కొల్లేరు సరస్సు
 
ఏలూరులో బుద్ధ పార్క్
 
ద్వారకాతిరుమల ప్రవేశ ద్వారం వద్ద భక్తులు
దస్త్రం:Godavari at paapi hills.jpg
పాపికొండల మధ్య గోదావరి

పరిపాలనా విభాగాలు మార్చు

జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అవి జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు. ఈ రెవెన్యూ డివిజన్లు 28 మండలాలుగా విభజించబడ్డాయి.

మండలాలు మార్చు

జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 9, ఏలూరు డివిజన్‌లో 13, నూజివీడు డివిజన్‌లో 6 మండలాలున్నాయి. మొత్తం 28 మండలాలు క్రింద ఇవ్వబడ్డాయి:

గ్రామాలు మార్చు

జిల్లాలో 655 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో 624 గ్రామాలు జనావాస గ్రామాలు కాగా, మిగిలిన 31 జనావాసాలు లేని గ్రామాలు. జిల్లాలో మొత్తం 550 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[2]

నగరాలు, పట్టణాలు మార్చు

రాజకీయ విభాగాలు మార్చు

ఏలూరు లోకసభ నియోజకవర్గం పరిధితో ఏలూరు జిల్లా ఏర్పాటుచేశారు. దీనిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు భాగంగా ఉన్నాయి. రాజమండ్రి లోకసభ నియోజకవర్గం లో భాగమైన గోపాలపురం శాసనసభ నియోజకవర్గం పాక్షికంగా ఈ జిల్లాలో ఉంది.

శాసనసభా నియోజకవర్గాలు మార్చు

 1. ఉంగుటూరు
 2. ఏలూరు
 3. కైకలూరు
 4. గోపాలపురం (SC) (పాక్షికం)
 5. చింతలపూడి (SC)
 6. దెందులూరు
 7. నూజివీడు
 8. పోలవరం (ఎస్.టి)

రవాణా మౌలిక వసతులు మార్చు

రోడ్డు మార్గాలు మార్చు

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216A, జాతీయ రహదారి 44లు జిల్లాలో గుండా పోతాయి.

రైలు మార్గాలు మార్చు

 
ఏలూరు రైల్వే స్టేషన్

ఏలూరు రైల్వే స్టేషను, దక్షిణ మధ్య రైల్వే జోను లోని విజయవాడ రైల్వే డివిజనుకు చెందిన ఒక రైల్వే స్టేషను.[3] పవర్‌పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషను నగరానికి చెందిన శాటిలైట్ స్టేషన్లు. ఈ స్టేషన్లు హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉన్నాయి. జిల్లాలో భీమడోలు నూజివీడు కైకలూరు ప్రధాన రైల్వే స్టేషన్లుగా ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు మార్చు

 • రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నూజివీడు.
 • ఆశ్రం మెడికల్ కాలేజి- అల్లూరి సీతారామ రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ ఏలూరు జిల్లాలో ఆరోగ్యం, వైద్య విద్యను ప్రోత్సహించడానికి 1998లో స్థాపించబడింది. దీనిని ఆశ్రమ్ కాలేజ్ అని పిలుస్తారు.
 • సర్ సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థలు- ఏలూరు నగరం ఉంది. సర్.సి.ఆర్.రెడ్డి విద్యాసంస్థల యాజమాన్యంలో నడుస్తున్నాయి. స్వర్గీయ కట్టమంచి రామలింగారెడ్డి గారి పేరు మేద నిర్మించబడ్డాయి. 1930 దశకంలో ప్రాంభమైనవి. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఉన్నత విద్య,CBSE పాటశాల కలవు, మహిళా కళాశాల సత్రం పాడు లో కలదు
 • సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు లో కలదు.
 • ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు పాత బస్ స్టాండ్ వద్ద,ఏలూరు లో ఉంది.
 • సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ దుగ్గిరాల ఏలూరు సమీపంలో కలదు
 • రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల వట్లూరు లో కలదు.

వ్యవసాయం మార్చు

ఏలూరు జిల్లాలో ప్రధానంగా చేపలు, రొయ్యలు, పామ్ ఆయిల్ తోటలు, కోకో తోటలు,కొబ్బరి తోటలు, వరి, చెరకు, పొగాకు, మొక్క జొన్న పండుతుంది.

పరిశ్రమలు మార్చు

 
ఏలూరు, ఆర్.ఆర్ పేటలోని సెంట్రల్ ప్లాజ
 • అంబికా గ్రూప్ - 60 యేళ్ళపైగా ఈ వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసే "అంబికా దర్బార్ బత్తి", మరి కొన్ని అగర్‌బత్తిలు దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ గ్రూప్ అధిపతులు ఇంకా సినిమా నిర్మాణం, విద్యుత్తు, హోటళ్ళు వంటి మరికొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు.
 • జూట్ మిల్లు- ఈస్టిండియా కమర్షియల్ కార్పొరేషన్ వారి జనపనార పరిశ్రమ పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్ద పరిశ్రమ.స గోనె సంచులు, ఇతర జనప నార ఉత్పత్తులు ఎక్కువ జరుగుతాయి
 • ఏలూరు తివాచీ, చేనేత పరిశ్రమలు - ఏలూరులో తివాచీలు అధికంగా మహమ్మదీయులచే నేయబడుతున్నాయి. ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్నాయి.

మూలాలు మార్చు

 1. 1.0 1.1 1.2 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
 2. "హోమ్". Eluru district. Retrieved 2022-07-14.
 3. "Divisional info" (PDF). Indian Railways. Retrieved 10 February 2016.