త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత , రాజరాజేశ్వరి ) దశ మహావిద్యలలో ఒక స్వరూపము. సాక్ష్యాత్ ఆది పరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయసు కల, పదహారు వివిధ కోరికలు కలది కావు షోడసి అని వ్యవహరిస్తారు.

శ్రీ చక్రం పై ఎడమ పాదమును మోపి చెరుకు తో చేసిన విల్లు, పుష్ప బాణములు, ఉరి తాడు, కొరడా లని పట్టుకొని ఆసీనురాలై ఉన్న త్రిపుర సుందరి.

వ్యుత్పత్తి

మార్చు

త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.

అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో

ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.
* స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది.
* సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.
* పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది.
శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.
* ఇఛ్ఛా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి
* జ్ఞాన శక్తి: జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి
* క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి
ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే

లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి, లయలు దేవి యొక్క ఆటలు.

చిత్రమాలిక

మార్చు


ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. https://web.archive.org/web/20150320141304/http://www.shivashakti.com/tripura.htm
  2. Brooks, Douglas R. (1990). The Secret of the Three Cities: An Introduction to Hindu Sakta Tantrism. Chicago & London: The University of Chicago Press. p. 80.
  3. Brooks, Douglas R. (1990). The Secret of the Three Cities: An Introduction to Hindu Sakta Tantrism. Chicago & London: The University of Chicago Press. p. 97.
  4. Brooks, Douglas R. (1990). The Secret of the Three Cities: An Introduction to Hindu Sakta Tantrism. Chicago & London: The University of Chicago Press., 103.
  • Brooks, Douglas R. (1990), The Secret of the Three Cities: An Introduction to Hindu Sakta Tantrism, Chicago & London: University of Chicago Press
  • Brooks, Douglas R. (1992), Auspicious Wisdom, Albany: State University of New York Press
  • Kinsley, David (1997), Tantric Visions of the Divine Feminine: The Ten Mahavidyas, New Delhi: Motilal Banarsidass, ISBN 978-0-520-20499-7
  • books released by Sathguru sri seshadri swamigal brindavanam trust ( regd) web site:www.seshadri.info

ఇతర పఠనాలు

మార్చు
  • Kinsley, David. Hindu Goddesses: Vision of the Divine Feminine in the Hindu Religious Traditions. Berkeley: University of California Press, 1998.
  • Dikshitar, V.R. Ramachandra. The Lalita Cult. Delhi: Motilal Banarsidass Publishers Pvt Ltd, 1991.

ఇతర లింకులు

మార్చు