కర్ణాటకలోని హళిబీడులో ఉన్న బ్రహ్మ శిల్పం

హిందూ సంప్రదాయంలో స్థానంసవరించు

 
కమలంపై బ్రహ్మ

సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకరు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పం అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తూ తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతారు.

ప్రస్థావనసవరించు

త్రిమూర్తులలో ఒక్కడు.

తొల్లి కల్పావసానమున సమస్తము జలార్ణవము అయి అంతట అంధకారబంధురముగ ఉండువేళ ఆజలమధ్యమున శ్రీమన్నారాయణమూర్తి వటపత్రశాయియై యోగనిద్రను తేలుచు ఉండి వరాహరూపమును ఒంది తన దంష్ట్రాగ్రమున భూమిని జలమునందుండి పైకి ఎత్తి నిలుపఁగా ఇతఁడు ఆపంకజోదరుఁడు అగు నారాయణుని గర్భమున ప్రవేశించి అందు ఉండు బ్రహ్మాండముల తత్వమును ఎఱిఁగి ఆదేవుని నాభికమలమునందుండి వెడలివచ్చి జగత్సృష్టి ఒనర్ప ఆరంభించెను. కనుక ఇతనికి పంకజభవుఁడు అను నామము కలిగెను.

ఇతఁడు చతుర్ముఖుడు. తొలుత ఇతనికి అయిదు ముఖములు ఉండెను. ఒక కాలమునందు త్రిమూర్తులు కొలువుతీరి ఉండఁగా అచ్చటికి పార్వతీదేవి వచ్చి పంచముఖులు అగు శివబ్రహ్మలు ఇరువురిని చూచి ఇతఁడు శివుఁడు ఇతఁడు బ్రహ్మ అని తెలిసికోలేక పిమ్మట శివుని కనుసైఁగచేత ఎఱిఁగి చేరఁబోయెను. అప్పుడు శివుడు తన భార్యకు ఇంత భ్రమ పుట్టుటకు కారణము బ్రహ్మకును అయిదు తలలు ఉండుటయె కదా అని అతని తలలో ఒకటిని శివుడు తీసివేసెను. అంత బ్రహ్మ అలిగి శివుడు కాపాలికత్వమును చెంది భిక్షాటనము చేయునట్లు శపించెను. ఆబ్రహ్మహత్యాపాపము పోవుటకై విష్ణువుయొక్క ఉపదేశమున శివుడు తీర్థయాత్ర చేసెను. అటుల యాత్రచేయుచు కాశిక్షేత్రమునకు రాగా అచట ఆపాపమువలన విముక్తుడు అయ్యెను.

ఇతని విధి సృష్టిచేయుట. తొలుత ఇతనికి అనేకులు మానసపుత్రులు కలిగిరి. వారిలో తొమ్మండ్రు ప్రజాసృష్టికి కారణభూతులు అయి నవబ్రహ్మలు లేక నవ ప్రజాపతులు అనబడిరి. వారు మరీచి, అత్రి, అంగిరసుఁడు, పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, భృగువు, వసిష్ఠుఁడు, దక్షుఁడు అనువారు. తక్కిన మానసపుత్రులలో సనకుడు, సనందనుడు, సనత్సుజాతుఁడు, సనత్కుమారుడు, బుభుడు, నారదుడు, హంసుడు, అరుణి, యతి మొదలు అగువారు ముఖ్యులు. వీరు అందఱును ఊర్ధ్వరేతస్కులు అయి సృష్టియందు ఇచ్ఛలేక జన్మము మొదలు జ్ఞానులై తిరుగుచు ఉందురు.

బ్రహ్మయొక్క ఛాయవలన కర్దముడు పుట్టెను. భ్రూమధ్యమువలన అర్ధనారీశ్వరుడు అగు రుద్రుడు పుట్టెను.

ఈ ప్రజాపతుల యొక్కయు, మహర్షుల యొక్కయు ఉత్పత్తి పలువిధములుగ చెప్పుదురు. శ్రీమద్భాగవతమున ఉన్నరీతిని బ్రహ్మయొక్క అంగుష్ఠమున దక్షుఁడును, నాభిని పులహుడును, కర్ణముల పులస్త్యుడును, త్వక్కున భృగువును, హస్తమున క్రతువును, ఆస్యమున అంగిరసుడును, ప్రాణమున వసిష్ఠుఁడును, మనమున మరీచియు, కన్నులయందు అత్రియు పుట్టిరి. మఱియు నారదుఁడు ఊరువులను, దక్షిణస్తనమువలన ధర్మమును, వెన్నువలన అధర్మ మృత్యువులును, ఆత్మను కాముడును, భ్రూయుగళమున క్రోధుడును పుట్టినట్లు చెప్పి ఉంది. ఇదిగాక బ్రహ్మ తన దేహమునుండి సరస్వతి జనింపగా ఆమెను కని విభ్రాంతిని పొంది కామాతురుడు అయి భార్యగా చేసికొనెను.

బ్రహ్మ మానస పుత్రులుసవరించు

మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, నారదుడు, కర్దముడు, వశిష్టుడు

న కథసవరించు

  • బ్రహ్మ విసిరిన పద్మం

పుష్కరతీర్థం ఆవర్భవించిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మేరు పర్వతం మీద శ్రీనిధానం అనే ఓ శిఖరం ఉంది.

మత సంప్రదాయాలుసవరించు

పేర్లు, అవతారాలుసవరించు

విధాత, సృష్టి కర్త ,విరించి , తాతసవరించు

గ్రంధాలూ, పురాణాలూసవరించు

దేవాలయాలుసవరించు

 
పుష్కర్ లోని బ్రహ్మదేవుడు
 
చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం.

బ్రహ్మదేవున్ని సుమారు అన్ని హిందూ యజ్ఞాలలో ప్రార్థించినా, బ్రహ్మను పూజించే దేవాలయాలు చాలా తక్కువ. వీటిలోకెల్లా ప్రఖ్యాతిచెందినది అజ్మీర్ దగ్గరలోని పుష్కర్ వద్దనున్న బ్రహ్మ దేవాలయం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. వేలకొలదీ భక్తులు ఇక్కడి సరస్సులో పుణ్యస్నానాల కోసం వస్తారు. శ్రీకాళహస్తిలో బ్రహ్మకు దేవాలయం ఉంది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఒక బ్రహ్మ గుడి ఉంది. దీనిని ఖేతేశ్వర బ్రహ్మధామ్ తీర్థం అంటారు. తమిళనాడులోని కుంభకోణంలోను, కేరళలోని తిరుపత్తూర్ లోను, మహారాష్ట్రలోని సోలాపూర్ లోను బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి. బ్రహ్మ దేవాలయాలన్నింటిలోకి పెద్దది కంబోడియా లోని ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని ధర్మపురి క్షేత్రం లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గర్భగుడి ప్రక్కన బ్రహ్మ దేవుని విగ్రహం ఉంది.

కర్ణాటక సంగీతంసవరించు

కర్ణాటక సంగీతంలోని మేళకర్త రాగాలలో తొమ్మదవ చక్రం పేరు బ్రహ్మ చక్రాల పేర్లు వాటితో సంబంధమున్న సంఖ్యను సూచిస్తాయి. ఇక్కడ నవబ్రహ్మలు అనగా తొమ్మిదవ చక్రం అని అర్ధం.[1][2]

ఆచారాలు, పండగలుసవరించు

ప్రార్ధనలు, స్తోత్రాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. South Indian Music Book III, by Prof. P Sambamoorthy, Published 1973, The Indian Music Publishing House
  2. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications

వనరులుసవరించు

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=బ్రహ్మ&oldid=3907672" నుండి వెలికితీశారు