త్రిలింగ

(త్రిలిజ్గ నుండి దారిమార్పు చెందింది)

త్రిలింగ లేదా త్రిలిజ్గ ఒక తెలుగు సారస్వత పత్రిక. దీనిని వావిళ్ల సంస్థ వారు 1914 సంవత్సరంలో ప్రారంభించారు. దీనికు అక్కిరాజు ఉమాకాంతం వారు ప్రారంభ సంపాదకులుగా పనిచేశారు. సుమారు 50 సంవత్సరాలకు పైగా ఈ పత్రిక దేదీప్యమానంగా వెలిగింది.

త్రిలింగ పత్రిక ముఖచిత్రం.

వ్యావహారిక భాషోద్యమాన్ని గురించి త్రిలింగ పత్రిక కార్టూన్లు ప్రచురించేది. తెలుగు పత్రికలలో ఈ వ్యాజ చిత్రాలు ప్రారంభించింది త్రిలింగ పత్రికే.

పున:ప్రారంభం

మార్చు

ఈ పత్రిక 2010 సంవత్సరంలో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ నంస్ వారిద్వారానే తిరిగి హైదరాబాదులో ప్రారంభించబడినది. దీని పేరును మార్చలేదు. గానీ త్రిలింగ : సాహిత్య, సాంస్కృతిక త్రైమాసిన పత్రిక గా ఉంచారు.

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిలింగ&oldid=2953500" నుండి వెలికితీశారు