త్రిశాల
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
త్రిశాల ( త్రిశాల మాత, మదర్ త్రిశాల, త్రిశాల దేవి, ప్రియంకరిణి, లేదా త్రిశాల రాణీగా కూడా పిలువబడుతుంది)జైనమత 24వ తీర్థంకరుడైన వర్థమాన మహావీరుని తల్లి. ఈమె ప్రస్తుతం బీహార్ లోని కుంద్‌గ్రాంకు చెందిన జైన చక్రవర్తి భార్య. ఈమె శాస్త్రీయ జైన ఆగమములు, ఆచార్య బద్రబాహుడు వ్రాసిన కల్పసూత్రాల గురించి, జైన తీర్థంకరుల జీవిత చరిత్రలను ఆవిష్కరించారు.
జీవితం
మార్చుఆమె కుమారుడు వర్థమాన మహావీరుని లాగానే ఆమె కూడా రాజ కుటుంబంలో జన్మించారు. ఆమె వైశాలి నగర అధ్యక్షులైన "చేతకుని" కుమార్తె.పెద్ద కుమార్తె[›]త్రిశాలకు ఏడుగురు సోదరీమణులున్నారు. అందులో ఒకరు జైన సన్యాసం తీసుకోగా మిగిలిన ఆరుగురు చెల్లెళ్ళు ప్రముఖ రాజులను వివాహమాడారు. వారిలో ముఖ్యులు మగథ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు, మహావీరుని స్వంత సోదరుడు నందివర్థనుడు. ఆమె, ఆమె భర్త సిద్ధార్థుడు జైనమత 23 వ తీర్థంకరుడైన పార్శ్వనాధుని ఆరాధకులు. జైన మత గ్రంథముల ప్రకారం త్రిశాల క్రీ.పూ 6 వ శతాబ్దంలో ఆమె కుమారుని తొమ్మిది మాసాల ఏడున్నర రోజులు మోసినదని తెలుస్తుంది. అయితే శ్వేతాంబరులు సాధారణంగా మహావీరుడు ఒక బ్రాహ్మణుని భార్య అయిన దేవానందకు ఉధ్బవించినట్లు నమ్ముతారు. ఆ తర్వాత ఆ బాలుని ఇంద్రుని ద్వారా త్రిశాల గర్భంలోనికి బదిలీ చేసినట్లు చెబుతారు. దీనికి కారణం అందరు తీర్థంకరులు క్షత్రియులు కావడం.
స్వప్నాలు
మార్చుజైన పవిత్ర గ్రంథాల ప్రకారం, త్రిశాల తన గర్భధారణ సమయంలో పదునాలుగు కలలను కన్నదని తెలియుచున్నదిభావన[›].జైన మతంలోని దిగంబర శాఖలో పదహారు కలలని ఉంది. ఆ కలలను కన్న తర్వాత ఆమె తన భర్త అయిన సిద్ధార్థుని లేపి తన స్వాప్నిక వృత్తాంతాన్ని వివరించింది. ఆ మరుసటి దినం సిద్ధార్థుడు తన ఆస్థానంలో విధ్వాంసులను ఈ స్పాప్నిక ఫలాల అర్థాల గురించి అడిగాడు. ఆ జ్ఞానులు "చాలా బలమైన, ధైర్యవంతుడైన, ధర్మపరాయణుడైన కుమారుడు కలుగుతాడు" అని వివరించారు.
- ఆమె స్వప్నంలో
- ఏనుగు
- ఎద్దు
- సింహం
- లక్ష్మీ
- పూలు
- పౌర్ణమి చంద్రుడు
- సూర్యుడు
- పతాకం
- వెండి పాత్ర
- కమలాలతో నిండిన సరస్సు
- పాలువంటి సముద్రము
- ఖగోళ వాహనం
- రత్నాల రాశులు
- పొగ లేని అగ్ని
- చేపల జత (దిగంబర)
- ఒక సింహాసనం
వారసత్వం
మార్చుప్రస్తుతం జైనమతస్థులు "స్వప్నాల" కార్యక్రమం జరుపుకుంటారు. ఈ వేడుకను "స్వప్నదర్శనం" అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో "ఘీ బోలీ" అని కూడా పిలుస్తారు.
విషయ నివేదిక
మార్చు^ పెద్దకుమార్తె: According to the Jain Shwethambar sect Trishala was the sister of Chetaka and her sisters were instead her nieces.
^ భావన: According to the Jain Shwethambar sect, a Brahmin woman named Devananda was the first one to give birth to the son. After she held the son in her stomach, the fetus was then transplanted into Trishala. Jain Digambara sect does not believe that the son was ever held by Devananda.
మూలాలు
మార్చు[1] - FreeIndia.org
[2] - JainWorld
[3]- Trishla Mata Temple Mahavirpuram