థర్మిష్టర్ అనేది, ఉష్ణోగ్రతతో పాటుగా నిరోధం మార్పుచెందే స్వభావం గల ఒక నాన్ ఓమిక్ పరికరం.నికెల్, ఇనుము, కోబాల్ట్, రాగి మొదలైనవాటి ఆక్సిడ్లు అర్ధవాహకాలుగా ప్రవర్తిస్తాయి.ఇటూవంటి అర్ధవాహకాలతో థర్మిష్టర్ తయారవుతుంది.సాధారణంగా, ఈ థర్మిష్టర్ని, ఒక ఎపోక్సి తలతో ఉన్న నాళికా గొట్టంలో ఉంచి మూస్తారు. అధిక రుణాత్మక విలువలతో ఉండే ఉష్ణోగ్రత నిరోధక గుణాలు కలిగిన థర్మిష్టర్లను,10kకోటికి చెందిన అల్ప ఉష్ణోగ్రతలను కొలిచే నిరోధక థర్మామీటర్గా వాడుతారు. వీటికి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అధిక నిరోధము ఉండడం వల్ల, అల్ప ఉష్ణోగ్రతలను చాలా కచ్చితంగా కొలవడానికి అనువూగా ఉంటుంది. ఒక చిన్న పూస మాదిరిగా ఉండే అర్ధవాహక పదార్దము థర్మిష్టర్ గా రుపొందుతుంది.ఇది ఒక్స్ సునిశిత థర్మామీటర్గా ఉపయొగపడుతుంది.

థర్మిష్టర్
థర్మిష్టర్
10-3kకోటికి చెందిన ఉష్ణోగ్రత మర్పులను ఈ రకం థర్మామీటర్ లతో కచ్చితంగా కొలవవచ్చును.

మిక్రోతరంగ పుంజాలలోని శక్తి ప్రవాహ రేటును కొలవడానికి థర్మిష్టర్విరివిగా వాడుతారు.ఉష్ణోగ్రతలో వచ్చె ఏ కొద్దిపాటి పెరుగుదల అయినా, థర్మిష్టర్ నిరోధంలో చాలా ఎక్కువ మార్పు తెస్తుంది.దీనికి కారణం థర్మిష్టర్ యొక్క α విలువ చాలా ఎక్కువ కావడమే.కిరణపుంజం వచ్చి థర్మిష్టర్ మీద పడుతుంది.పడి దానిని వేడి చేస్తుంది.ఫలితంగా దాని నిరోధంలో వచ్చే మార్పులను కొలిచి, మిక్రో తరంగము సామర్ధ్యాన్ని మనం చాలా కచ్చితంగా కొలవవచ్చును. [1]

ఇవి కూడా చుడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము భౌతిక శాస్త్రము(2010)టెక్స్ట్ బుక్

బాహ్య లింకులు మార్చు