థాయిలాండ్‌లో హిందూమతం

థాయ్‌లాండ్‌లో హిందూ మతం మైనారిటీ మతం. 2018 నాటికి దేశ జనాభాలో 0.02% మంది హిందువులు. [1] బౌద్ధ మెజారిటీ దేశం అయినప్పటికీ, థాయిలాండ్‌లో హిందూ ప్రభావం చాలా బలంగా ఉంది. ప్రసిద్ధ థాయ్ ఇతిహాసం రామకియన్, బౌద్ధ దశరథ జాతక కథల ఆధారంగా రూపొందించబడింది. ఇది రామాయణానికి థాయ్ రూపాంతరం.

చరిత్ర

మార్చు
 
సుమారు 14వ శతాబ్దంలో బ్యాంకాక్ నేషనల్ మ్యూజియంలో ఉన్న సుఖోతై విష్ణువు , సుఖోథై హిస్టారికల్ పార్క్ వద్ద దీన్ని కనుగొన్నారు.

థాయ్‌లాండ్ ఎప్పుడూ మెజారిటీ హిందూ దేశం కానప్పటికీ, అది హిందూమతంచే బాగా ప్రభావితమైంది. థాయ్‌లాండ్ ఒక దేశం కాకముందు, ప్రస్తుత థాయ్‌లాండ్‌ ప్రాంతం హిందూ - బౌద్ధ ఖైమర్ సామ్రాజ్యం పరిధిలో ఉండేది. గతంలో, దేశం బలమైన హిందూ మూలాలున్న ఖైమర్ సామ్రాజ్య ప్రభావంలోకి వచ్చింది. నేడు థాయిలాండ్ బౌద్ధ మెజారిటీ దేశం అయినప్పటికీ, థాయ్ సంస్కృతిలో, ప్రతీకల్లో అనేక అంశాలు హిందూ ప్రభావాలను, వారసత్వాన్నీ ప్రదర్శిస్తాయి. ఉదాహరణకు, బౌద్ధ దశరథ జాతక కథలపై ఆధారపడిన ప్రసిద్ధ గాథ, రామ్‌కియెన్ రామాయణాన్ని బాగా పోలి ఉంటుంది. థాయిలాండ్ రాజ చిహ్నం విష్ణు వాహనమైన గరుడ. [2]

బ్యాంకాక్ సమీపంలోని అయుత్థాయ అనే థాయ్ నగరానికి రామ జన్మస్థలమైన అయోధ్య పేరే పెట్టారు. హిందూమతం నుండి ఉద్భవించిన అనేక ఆచారాలు - ఉదా: పవిత్ర తంతువులను ఉపయోగించడం, శంఖం నుండి నీటిని పోయడం వంటివి - థాయ్ ఆచారాలలో ఇమిడిపోయాయి. ఇంకా, హిందూ-బౌద్ధ దేవతలను చాలా మంది థాయ్‌లు పూజిస్తారు. ప్రసిద్ధ ఎరావాన్ పుణ్యక్షేత్రంలో బ్రహ్మ, వినాయకుడు, ఇంద్రుడు, శివుడి విగ్రహాలు, అలాగే హిందూ దేవతలకు సంబంధించిన అనేక చిహ్నాలు కనిపిస్తాయి. ఉదా, గరుడ. సురిన్ (థాయ్‌లాండ్) సమీపంలోని 12వ శతాబ్దపు ప్రసాత్ సిఖోరఫుమ్ వంటి ఆలయాల గోడలపై ఉన్న చిత్రాల్లో నటరాజుతో పాటు పార్వతి, విష్ణువు, బ్రహ్మ, వినాయకుడుల చిన్న చిత్రాలు ఉన్నాయి. [3]

దేవసాథన్, 1784లో రామ I స్థాపించిన హిందూ దేవాలయం. ఈ ఆలయం థాయ్‌లాండ్‌లోని బ్రాహ్మణ మతానికి కేంద్రంగా ఉంది. రాజాస్థానపు బ్రాహ్మణులు ఆలయాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ ఏటా అనేక వేడుకలను నిర్వహిస్తారు.

త్రియంపావై-త్రిపావై అనే వార్షిక ఉయ్యాల వేడుకను 1935 వరకు థాయిలాండ్‌లోని ప్రధాన నగరాల్లో నిర్వహించేవారు. భద్రతా కారణాల దృష్ట్యా దాన్ని రద్దు చేసారు. [4] ఈ వేడుక పేరును తిరువెంపవై, తిరుప్పావై అనే రెండు తమిళ భాషా కీర్తనల పేర్ల నుండి తీసుకున్నారు. ఈ వేడుకలోను, అలాగే థాయ్ రాజు పట్టాభిషేక వేడుకలోనూ తిరువెంపవై నుండి తమిళ శ్లోకాలు పఠించేవారు. [5] TP మీనాక్షిసుందరం ప్రకారం, పండుగ పేరులో తిరుప్పావై ఉండడాన్ని బట్టి తిరుప్పావై కూడా పారాయణం చేసేవారని తెలుస్తోంది. [6] దేవుడు ప్రపంచాన్ని ఎలా సృష్టించాడనే దాని గురించి ఉయ్యాల వేడుక వెల్లడి చేస్తుంది. దుకాణాల వెలుపల, ముఖ్యంగా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, సంపద, అదృష్టం, శ్రేయస్సుల దేవత అయిన నాంగ్ క్వాక్ (లక్ష్మి) విగ్రహాలు కనిపిస్తాయి. [7]

అంత్యక్రియలు, ఉత్సవాలు, రాష్ట్ర వేడుకలకు గుర్తుగా శ్రేష్ఠులు, రాజ కుటుంబీకులూ బ్రాహ్మణులను నియమించుకుంటారు. చాలా ఆచారాలు బౌద్ధమతంతో కలుస్తున్నప్పటికీ, హిందూమత ప్రాముఖ్యత తిరస్కరించలేనిది. [8]

థాయ్ బ్రాహ్మణ సమాజం

మార్చు
 
ఒక వేడుకను నిర్వహిస్తున్న రాయల్ బ్రాహ్మణులు. ఎమరాల్డ్ బుద్ధ ఆలయంలో కుడ్య చిత్రం.

థాయ్‌లాండ్‌లో రెండు తెగల థాయ్ బ్రాహ్మణ సంఘాలున్నాయి-బ్రహ్మ లుయాంగ్ (రాయల్ బ్రాహ్మణులు), బ్రహ్మ చావో బాన్ (జానపద బ్రాహ్మణులు). ఈ తెగల బ్రాహ్మణులందరూ అవటానికి బౌద్ధులే గానీ, వారు హిందూ దేవుళ్ళనే ఆరాధిస్తారు. [9] బ్రహ్మ లుయాంగ్ (రాయల్ బ్రాహ్మణులు) ప్రధానంగా థాయ్ రాజ కుటుంబానికి చెందిన వేడుకలను నిర్వహిస్తారు. వీటిలో రాజు పట్టాభిషేకం కూడా ఒకటి. [10] వారు థాయ్‌లాండ్‌లో సుదీర్ఘకాలంగా నివసిస్తున్న బ్రాహ్మణ కుటుంబాల వారసత్వానికి చెందినవారు, తమిళనాడు మూలాలు కలిగినవారు. బ్రహ్మ చావో బాన్ లేదా జానపద బ్రాహ్మణులు అంటే పూజారుల రక్త సంబంధానికి చెందని బ్రాహ్మణుల వర్గం. సాధారణంగా, ఈ బ్రాహ్మణులకు ఆచారాలు సంప్రదాయాల గురించిన పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది. థాయ్‌లాండ్‌లో బ్రాహ్మణ కార్యకలాపాలకు దేవసాథన్ కేంద్రంగా ఉంది. ఇక్కడే తమిళ శైవ ఆచారం అయిన త్రయంపావై వేడుక నిర్వహిస్తారు. దీన్ని 200 సంవత్సరాల క్రితం నిర్మించారు. వీరు కాకుండా భారతదేశం నుండి ఇటీవల థాయ్‌లాండ్‌కు వలస వచ్చిన భారతీయ బ్రాహ్మణులు కూడా ఉన్నారు. [11]

ఇతర ఆగ్నేయ దేశాలలో కూడా బ్రాహ్మణులు ఒకప్పుడు రాజ వేడుకలను నిర్వహించారు. ఖైమర్ రూజ్‌ని పడగొట్టిన తర్వాత కంబోడియాలో బ్రాహ్మణ ఆచారాలను పునరుద్ధరించారు. [12] [13] రాచరికం రద్దు కారణంగా మయన్మార్‌లో బ్రాహ్మణులు తమ పాత్రను కోల్పోయారు.

రాజ చరిత్రకారుడు దమ్రోంగ్ రాజానుభాబ్ మూడు రకాల బ్రాహ్మణుల గురించి చెప్పాడు. వాళ్ళు: నఖోన్ శీ తమ్మరాత్ కు చెందినవారు, ఫత్తాలంగ్‌కు చెందినవారు, కంబోడియా నుండి వచ్చిన వారు. [14]

భారతీయ హిందువులు

మార్చు

సుఖోథాయ్, ఆయుత్థాయ కాలంలో, థాయ్ ఆస్థానంలో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని అనేక మంది పాశ్చాత్య యాత్రికులు వర్ణించారు. అయితే వర్తమాన కాలంలో ఉన్న భారతీయులలో చాలా మంది 19వ శతాబ్దం మొదటి అర్ధభాగంలోను, 1920 తర్వాతా థాయిలాండ్‌కు వచ్చారు. [15]

బ్యాంకాక్‌లోని మారియమ్మన్ ఆలయం దక్షిణ భారత వాస్తుశిల్పంలో నిర్మించిన మొదటి ఆలయం. దీనిని 1879లో తమిళ హిందూ వలసదారు అయిన వైతి పడయాచి నిర్మించాడు. [16] [17] [18]

జనాభా వివరాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
200552,631—    
201041,808−20.6%
201522,110−47.1%
201813,886−37.2%
సంవత్సరం శాతం పెంచు
2005 0.09% -
2010 0.06% -0.03%
2015 0.03% -0.03%
2018 0.02% -0.01%

2005 థాయ్ జనాభా లెక్కల ప్రకారం, థాయిలాండ్‌లో 52,631 మంది హిందువులు నివసిస్తున్నారు, మొత్తం జనాభాలో వీరు 0.09% మాత్రమే. [19]

2010 థాయ్‌లాండ్ జనాభా లెక్కల ప్రకారం థాయిలాండ్‌లో 41,808 మంది హిందువులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 0.06% . [20] 2015 జనాభా లెక్కల్లో ఈ జనాభా 22,110 లేదా 0.03%కి తగ్గింది. [21]

అయితే, 2014లో థాయ్ జనాభాలో 0.1% హిందూమతం ఉందని, థాయిలాండ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతంగా కూడా ఉందనీ ప్యూ పరిశోధనా డేటా కనుగొంది. హిందూ జనాభా 2014లో 0.1% నుండి 2050 నాటికి 0.2%కి పెరుగుతుందని ప్యూ రీసెర్చ్ డేటా నివేదించింది [22]


థాయిలాండ్ లో భవిష్యత్తు హిందూ జనాభా
సంవత్సరం మొత్తం జనాభా హిందూ జనాభా శాతం
2014 6,84,38,748 68,439 0.1%
2050 6,59,40,494 1,31,881 0.2%
మూలం: [23]

థాయ్‌లాండ్‌లోని హిందూ ప్రదేశాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Population by religion, region and area, 2015" (PDF). NSO. Archived from the original (PDF) on 10 December 2017. Retrieved 2017-10-12. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "The concept of Garuda in Thai society". Archived from the original on 2019-03-24. Retrieved 2021-11-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. Sikhoraphum, Thailand, Arts & Archaeology Journal
  4. M. E. Manickavasagom Pillai (1986). Dravidian Influence in Thai Culture. Tamil University. p. 69.
  5. Upendra Thakur (1986). Some Aspects of Asian History and Culture. Abhinav. pp. 27–28. ISBN 978-81-7017-207-9.
  6. Norman Cutler (1979). Consider Our Vow: Translation of Tiruppāvai and Tiruvempāvai Into English. Muttu Patippakam. p. 13.
  7. Ara Wilson (2008), The Sacred Geography of Bangkok’s Markets, International Journal of Urban and Regional Research, Volume 32.3, September 2008, page 635
  8. "Hinduism Today | Thailand | July/August/September, 2003". Archived from the original on 30 October 2006. Retrieved 3 September 2006.
  9. คมกฤช อุ่ยเต็กเค่ง. ภารตะ-สยาม ? ผี พราหมณ์ พุทธ ?. กรุงเทพฯ : มติชน, 2560, หน้า 15
  10. Thai King Officially Crowned, Cementing Royal Authority, VOA, May 04, 2019
  11. "The new Brahmins". Retrieved 4 March 2020.
  12. Priests Uphold a Unique—and Royal—Tradition By Samantha Melamed and Kuch Naren, Compodian Daily, October 31, 2005
  13. Balancing the foreign and the familiar in the articulation of kingship: The royal court Brahmans of Thailand, Nathan McGovern, Journal of Southeast Asian Studies, Volume 48 Issue 2, June 2017, pp. 283-303
  14. สมเด็จกรมพระยานริศรานุวัดติวงศ์, สาส์นสมเด็จ [Royal letters], vol. 1, 2nd ed. (พระนคร: กรมศิลปากร, 2516[1973]), p. 270, cited in Kanjana, ‘Ways of life, rituals and cultural identity’, p. 65.
  15. "INDIAN COMMUNITY IN THAILAND". Retrieved 3 March 2020.
  16. Sandhu & Mani 2006, p. 978.
  17. Kesavapany & Mani 2008, p. 673.
  18. Manguin, Mani & Wade 2011, p. 475.
  19. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-28. Retrieved 2021-11-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  20. "Population by religion, region and area, 2010" (PDF). NSO. Archived from the original (PDF) on 19 అక్టోబరు 2016. Retrieved 2 March 2020.
  21. "Population by religion, region and area, 2015" (PDF). NSO. Archived from the original (PDF) on 10 డిసెంబరు 2017. Retrieved 2 March 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  22. "Hinduism fastest growing religion in Pakistan and Saudi Arabia". Retrieved 2 March 2020.
  23. "Hinduism fastest growing religion in Pakistan and Saudi Arabia". Retrieved 2 March 2020.