దక్షిణాన మానవ వ్యాప్తి
ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం నేపథ్యంలో, మానవుడు ఆసియా దక్షిణ తీరం వెంబడి, అరేబియా ద్వీపకల్పం నుండి పర్షియా, భారతదేశాల మీదుగా ఆగ్నేయాసియా, ఓషియానియాకు చేపట్టిన వలసలను దక్షిణ దిశగా మానవ వ్యాప్తి పరికల్పన వివరిస్తుంది. దీన్ని తీర వలస పరికల్పన అని కూడా అంటారు. దీనికి ఇతర పేర్లు "దక్షిణ తీర మార్గం" [1] లేదా "సత్వర తీర స్థావరం". ఈ వలసల తరువాతి కాలంలోని మానవులు చివరికి యురేషియా (ఐరోపాతో సహా), మిగిలిన ఓషియానియా, అమెరికాలకు వలస వెళ్ళి స్థిరపడ్డారు.
ప్రధానంగా అరేబియా ద్వీపకల్పం, భారతదేశం, ఆగ్నేయాసియా, న్యూ గినియా, ఆస్ట్రేలియా, ఓషియానియా సమీపంలో, కోస్తా చైనా, జపాన్ లలో సుమారు 70,000 నుండి 50,000 సంవత్సరాల క్రితం తొలుతగా జీవించడం మొదలుపెట్టడాన్ని వివరించడానికి తీరప్రాంత మార్గం సిద్ధాంతాన్ని ఉపయోగిస్తారు.[2][3][4]
ఇది mtDNA హాప్లోగ్రూప్ M, హాప్లోగ్రూప్ N యొక్క ఉనికి, విస్తరణలతో పాటు, ఈ ప్రాంతాలలో Y-DNA హాప్లోగ్రూప్ సి, హాప్లోగ్రూప్ D ల నిర్దుష్ట పంపిణీ విధానాలతో ముడిపడి ఉంది.
తొలి ఆధునిక మానవులు - మైటోకాండ్రియల్ హాప్లో గ్రూప్ L3 కలిగి ఉన్నవారు - 70 నుండి 50 వేల సంవత్సరాల కిందట, తూర్పు ఆఫ్రికా నుండి బాబ్ ఎల్-మండెబ్ జలసంధి ద్వారా అరేబియా ద్వీపకల్పం చేరుకున్నారని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తోంది. ఆఫ్రికాలోని 2,000 – 5,000 మంది జనాభాలో నుండి, 150 నుండి 1,000 మంది వరకూ ఉన్న ఒక చిన్న సమూహం మాత్రమే ఎర్ర సముద్రం దాటిందని అంచనా. ఈ బృందం, వారి వారసులూ వేగంగా పయనించి, కొన్ని వేల సంవత్సరాలలోనే అరేబియా, పర్షియా చుట్టూ తీరప్రాంతం నుండి భారతదేశానికి చేరుకున్నారు. భారతదేశం నుండి వారు ఆగ్నేయాసియా ("సుందలాండ్"), ఓషియానియా ("సాహుల్") లకు వ్యాపించి ఉంటారు.[2][4]
ఇవి కూడా చూడండి
మార్చు- ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం
- పేలియోఆంత్రోపాలజీ
మూలాలు
మార్చు- ↑ Metspalu et al 2006, Human Mitochondrial DNA and the Evolution of Homo sapiens.[permanent dead link]
- ↑ 2.0 2.1 Posth C, Renaud G, Mittnik M, Drucker DG, Rougier H, Cupillard C, Valentin F, Thevenet C, Furtwängler A, Wißing C, Francken M, Malina M, Bolus M, Lari M, Gigli E, Capecchi G, Crevecoeur I, Beauval C, Flas D, Germonpré M, van der Plicht J, Cottiaux R, Gély B, Ronchitelli A, Wehrberger K, Grigorescu D, Svoboda J, Semal P, Caramelli D, Bocherens H, Harvati K, Conard NJ, Haak W, Powell A, Krause J (2016). "Pleistocene Mitochondrial Genomes Suggest a Single Major Dispersal of Non-Africans and a Late Glacial Population Turnover in Europe". Current Biology. 26 (6): 827–833. doi:10.1016/j.cub.2016.01.037. PMID 26853362. S2CID 140098861.
- ↑ Kamin M, Saag L, Vincente M, et al. (April 2015). "A recent bottleneck of Y chromosome diversity coincides with a global change in culture". Genome Research. 25 (4): 459–466. doi:10.1101/gr.186684.114. PMC 4381518. PMID 25770088.
- ↑ 4.0 4.1 Haber M, Jones AL, Connel BA, Asan, Arciero E, Huanming Y, Thomas MG, Xue Y, Tyler-Smith C (June 2019). "A Rare Deep-Rooting D0 African Y-chromosomal Haplogroup and its Implications for the Expansion of Modern Humans Out of Africa". Genetics. 212 (4): 1421–1428. doi:10.1534/genetics.119.302368. PMC 6707464. PMID 31196864.