దత్తు బాబన్ భోకనాల్
దత్తు బాబన్ భోకనాల్ 2016 రియో ఒలింపిక్ క్రీడలలో రోయింగ్కి ఎంపిక అయిన వ్యక్తి [1][2][3]. ఇతను దక్షిణ కొరియాలో జరిగిన FISA ఆసియా, ఓషియానియా ఒలింపిక్ ఎంపిక రెగాట్టాలో పురుషుల స్కల్ ఈవెంట్లో 7 నిమిషాల 07.63 సెకండ్లలో[3] పూర్తిచేయడం ద్వారా ఒలింపిక్స్ కి ఎంపిక కావడం జరిగింది. ఇతను రియో ఒలింపిక్ క్రీడలకి ఎంపికైన ఏకైక భారతీయ రోయర్, భారతదేశం నుంచి ఒలింపిక్స్కి ఎంపికైన తొమ్మిదవ రోయింగ్ ఆటగాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుభోకనాల్ 1991లో మహారాష్ట్రలోని తాలెగావ్ అనే చిన్న ఊరిలో రాళ్ళు పగులగొట్టే కార్మిక కుటుంబంలో పుట్టాడు. అమ్మ పేరు ఆశ భావన భోకనాల్. 2012 నుంచి భారత సైనిక దళంలో పనిచేస్తున్నాడు.
రోయింగ్ వ్రత్తి ప్రగతి
మార్చు2012లో పూణేలోని బొంబాయి ఇంజినీరు గ్రూపు ఖడ్కి కేంద్రంలో రోయింగ్ ప్రారంభించిన ఇతడు 2013లో పూణే లోని సైనికదళ రోయింగ్ నోడ్ కి మారాడు. ఇతని మొదటి గురువు పేరు కుశ్రత్ ఆలీ. ప్రస్తుతం ఇతను జాతీయ ముఖ్య కోచ్ అయిన ద్రోణాచార్య ఇస్మాయిల్ బైగ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు.
ఇతను ప్రస్తుతం ఒలింపిక్స్ లో పథకం తేగల వ్యక్తులకు శిక్షణ ఇచ్చేందుకు ధనం సమకూరించే Target Olympic Podium (ఒలింపిక్ వేదిక లక్ష్యం) పథకంలో భాగంగా ఆర్థిక సహాయం పొందుతున్నాడు.
విజయాలు
మార్చు2014లో జాతీయ రోయింగ్ పోటీలలో ఇతను సర్వీసెస్ తరఫున రెండు స్వర్ణ పతకాలను పొందాడు.
చైనాలో జరిగిన 2014 ఆసియా క్రీడలలో అయిదవ స్థానం సంపాదించాడు.
మూలాలు
మార్చు- ↑ "Indian Olympic Association Link" (PDF). Archived from the original (PDF) on 2016-08-12.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "It was a hard row to hoe for him to reach Rio". The Hindu (in Indian English). 2016-05-04. ISSN 0971-751X. Retrieved 2016-06-24.
- ↑ 3.0 3.1 "India's #RioOlympics Rower Dattu Baban Bhokanal Comes From A Village Without Water". Retrieved 2016-06-24.