దయానిత సింగ్ ( జననం: 1961 ) కళాకారిణి, ఫోటోగ్రాఫర్.

దయానిత సింగ్
జననం1961 (age 62–63) [1]
న్యూ ఢిల్లీ
జాతీయతభారతీయ
వృత్తికళాకారిణి, ఫోటోగ్రాఫర్.

తొలినాళ్ళ జీవితం

మార్చు

ఈమె 1961 లో న్యూఢిల్లీలో జన్మించింది. ఈమె నలుగురు సోదరీమణులలో పెద్దది.[2] ఈమె అహ్మదాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో విజువల్ కమ్యూనికేషన్ పూర్తిచేసింది. తరువాత న్యూయార్క్ నగరంలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫోటోగ్రఫీలో డాక్యుమెంటరీ ఫోటోగ్రఫి పూర్తిచేసింది. ఫోటో జర్నలిజంలో తన వృత్తిని ప్రారంభించిన ఆమె 1990లో పదవీ విరమణ చేసింది.[3][2]

కెరీర్

మార్చు

ఈమె మొట్టమొదటిసారిగా తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్‌తో రిహార్సల్‌ ప్రదర్శనలో అతనిని ఫోటోలు తీయమని తనని ఆహ్వానించాడు. ఈ ప్రదర్శన తరువాత ఆరు శీతాకాలాల పాటు తన పర్యటనలను డాక్యుమెంటరీ చేసింది.1986 లో తన మొదటి పుస్తకం జాకీర్ హుస్సేన్ పేరుతో తన చిత్రాలను ప్రచురిచింది. ఈమె జాకీర్ హుస్సేన్ ను తన గురువుగా భావిస్తుంది. దశాబ్ద కాలం తరువాత ఈమె 2001లో మైసెల్ఫ్ మోనా అహ్మద్ పేరుతో తన రెండవ పుస్తకాన్ని ప్రచురించింది.

ఈమె జర్మనీకి చెందిన ప్రచురణకర్త గెర్హార్డ్ స్టీడ్ల్‌తో కలిసి అనేక ప్రదర్శనలు చేసింది. అందులో ప్రైవసీ, ఛైర్స్, సెంట్ ఆ లెటర్, బ్లూ బుక్, డ్రీమ్ విల్లా, ఫైల్‌రూమ్, మ్యూజియం ఆఫ్ ఛాన్స్ వంటి ప్రదర్శనలు ఉన్నాయి.

సోలో ఎగ్జిబిషన్

మార్చు
  • 1997- 90 ల నుండి వచ్చిన చిత్రాలు, స్కాలో గ్యాలరీ, జూరిచ్
  • 1998 ఫ్యామిలీ పోర్ట్రెయిట్స్, నేచర్ మోర్టే, న్యూ ఢిల్లీ
  • 1999 ఫ్యామిలీ పోర్ట్రెయిట్స్, స్టూడియో గ్వెంజాని, మిలన్
  • 1999 మోనా డార్లింగ్, వెనిజియా ఇమ్మాగిన్, వెనిస్
  • 2000 దయానితా సింగ్, టెంపో ఫెస్టివల్, స్టాక్‌హోమ్
  • 2000 దయానితా సింగ్, గ్యాలరీ రోడోల్ఫ్ జాన్సెన్, బ్రస్సెల్స్
  • 2000 ఐ యమ్ హియర్, ఐకాన్ గ్యాలరీ, బర్మింగ్‌హామ్
  • 2000 డెమెల్లో వాడో, సాలిగావో ఇన్స్టిట్యూట్, గోవా
  • 2001 ఎంప్టీ స్పేసేస్, ఫ్రిత్ స్ట్రీట్ గ్యాలరీ, లండన్
  • 2002 బొంబాయి టు గోవా, ఆర్ట్ హౌస్ ఇండియా, గోవా
  • 2002 బొంబాయి టు గోవా, కలఘోడా ఫెస్టివల్, బొంబాయి
  • 2002 పార్సీస్ ఎట్ హోమ్, గ్యాలరీ కెమోల్డ్, బొంబాయి
  • 2002 ఐ యామ్ ఆస్ ఐ యమ్, మైసెల్ఫ్ మోనా అహ్మద్, స్కాలో గ్యాలరీ, జూరిచ్
  • 2003 దయానిత సింగ్: ఇమేజ్ / టెక్స్ట్ (ఛాయాచిత్రాలు 1989–2002), ఆర్ట్ అండ్ ఎస్తెటిక్స్ విభాగం. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ
  • 2003 మైసెల్ఫ్ మోనా అహ్మద్, మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్, బెర్లిన్
  • 2003 దయానితా సింగ్: ప్రైవసీ, నేషనల్ గాలరీ ఇమ్ హాంబర్గర్ బాన్హోఫ్, బెర్లిన్
  • 2004 ప్రైవసీ, రెన్కాంట్రెస్-ఆర్లెస్, ఆర్లెస్
  • 2005 , స్టూడియో గుయెంజాని, మిలన్
  • 2005 , ఫ్రిత్ స్ట్రీట్ గ్యాలరీ, లండన్
  • 2005 ఛైర్స్, ఇసాబెల్లా స్టీవర్ట్ గార్డనర్ మ్యూజియం, బోస్టన్
  • 2006 గో అవే క్లోజర్, నేచర్ మోర్టే, న్యూ ఢిల్లీ
  • 2006 బెడ్స్ అండ్ ఛైర్స్, వాలెంటినా బోనోమో గ్యాలరీ, రోమ్
  • 2007 బెడ్స్ అండ్ ఛైర్స్, గ్యాలరీ కెమోల్డ్, ముంబై
  • 2007 గో అవే క్లోజర్, గ్యాలరీ స్టెయిన్రూకే మిర్చందాని, ముంబై
  • 2007 గో అవే క్లోజర్, కృతి గ్యాలరీ, వారణాసి
  • 2008 లేడీస్ ఆఫ్ కలకత్తా, బోస్ పాసియా గ్యాలరీ, కలకత్తా
  • 2008 సేంట్ ఎ లెటర్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, ముంబై
  • 2008 సేంట్ ఎ లెటర్, అలయన్స్ ఫ్రాంకైస్, న్యూ ఢిల్లీ
  • 2008 డ్రీం విల్లా, ఫ్రిత్ స్ట్రీట్ గ్యాలరీ, లండన్
  • 2008 లెట్ యు గో, నేచర్ మోర్టే, బెర్లిన్
  • 2008 లెస్ రెన్కాంట్రెస్ డి ఆర్లెస్ ఫెస్టివల్, ఫ్రాన్స్
  • 2009 బ్లూ బుక్, గ్యాలరీ మిర్చందాని స్టెయిన్రూకే, ​​బొంబాయి
  • 2009 బ్లూ బుక్, నేచర్ మోర్టే, న్యూ ఢిల్లీ
  • 2010 దయానితా సింగ్ (ఛాయాచిత్రాలు 1989–2010), హుయిస్ మార్సెయిల్, ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్
  • 2010 డ్రీం విల్లా, నేచర్ మోర్టే, న్యూ ఢిల్లీ
  • 2010 దయానితా సింగ్, మ్యాప్‌ఫ్రే ఫౌండేషన్, మాడ్రిడ్
  • 2011 దయానితా సింగ్, మ్యూజియం ఆఫ్ ఆర్ట్, బొగోటా 2011 హౌస్ ఆఫ్ లవ్, పీబాడీ మ్యూజియం, హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్
  • 2011 అడ్వెంచర్స్ ఆఫ్ ఎ ఫోటోగ్రాఫర్, షిసిడో గ్యాలరీ, టోక్యో
  • 2012 హౌస్ ఆఫ్ లవ్, నేచర్ మోర్టే, న్యూ ఢిల్లీ
  • 2012 మాన్యుమెంట్స్ ఆఫ్ నాలెడ్జ్, ఛాయాచిత్రాలు దయానితా సింగ్, కింగ్స్ కాలేజ్ లండన్
  • 2012 దయానితా సింగ్ / ది అడ్వెంచర్స్ ఆఫ్ ఎ ఫోటోగ్రాఫర్, బిల్డ్‌ముసీట్, ఉమియా విశ్వవిద్యాలయం, స్వీడన్
  • 2012 దయానిత సింగ్: ఫైల్ రూమ్, ఫ్రిత్ స్ట్రీట్ గ్యాలరీ, లండన్
  • 2013 క్లో అవే క్లోజర్, హేవార్డ్ గ్యాలరీ, లండన్
  • 2014 చికాగోలోని ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌లో దయానితా సింగ్ సోలో ఎగ్జిబిషన్
  • 2014 మ్యూజియం ఆఫ్ ఛాన్స్: ఎ బుక్ స్టోరీ, గోథే-ఇన్స్టిట్యూట్, ముంబై
  • 2015 దయానితా సింగ్: పుస్తక రచనలు, గోథే-ఇన్స్టిట్యూట్ / మాక్స్ ముల్లెర్ భవన్, న్యూ ఢిల్లీ
  • 2015–2016 కె ఛాంబర్స్ మ్యూజియం భవన్, న్యూ ఢిల్లీలోని కిరణ్ నాదర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో సోలో ఎగ్జిబిషన్
  • 2016 మ్యూజియం ఆఫ్ ఛాన్స్ బుక్ ఆబ్జెక్ట్, జైపూర్ లోని హవా మహల్ వద్ద సోలో ఎగ్జిబిషన్
  • 2016 మ్యూజియం ఆఫ్ ఛాన్స్ బుక్ ఆబ్జెక్ట్, బంగ్లాదేశ్ లోని ఢాకా ఆర్ట్ సమ్మిట్ లో సోలో ప్రాజెక్ట్
  • 2017 దయానితా సింగ్: టోక్యోలోని టోక్యో ఫోటోగ్రాఫిక్ ఆర్ట్ మ్యూజియంలో సోలో ఎగ్జిబిషన్ మ్యూజియం భవన్
  • 2018 దయానితా సింగ్: పాప్-అప్ బుక్‌షాప్ / మై ఆఫ్‌సెట్ వరల్డ్, కాలికూన్ ఫైన్ ఆర్ట్స్, న్యూయార్క్.

మరిన్ని విశేషాలు

మార్చు

ఈమె పుస్తకాలను కూడా ప్రచురిస్తుంది. ఇవి పుస్తకాలు, కళ వస్తువులు, ప్రదర్శనలు, కేటలాగ్‌లకు సంబంధించినవి ఉంటాయి. ఈమె ప్రదర్శనలను మ్యూజియం భవన్ లండన్ (2013) లోని హేవార్డ్ గ్యాలరీ, మ్యూజియం ఫర్ మోడరన్ కున్స్ట్, ఫ్రాంక్‌ఫర్ట్ (2014), ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగో, చికాగో (2014), కిరణ్ నాదర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, న్యూ ఢిల్లీ (2016) లో ప్రదర్శించింది.

పురస్కారాలు, గుర్తింపులు

మార్చు

ఈమె 2008 లో సింగ్‌కు ప్రిన్స్ క్లాజ్ పురస్కారం అందుకుంది. 2013 లో లండన్‌లోని హేవార్డ్ గ్యాలరీలో సోలో ప్రదర్శన చేసిన తొలి భారతీయురాలు.

మూలాలు

మార్చు
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; guard14 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 Singh, Dayanita (2003). Privacy. Schmitz, Britta, 1963-, Staatliche Museen zu Berlin--Preussischer Kulturbesitz. (First ed.). [Berlin]. ISBN 3-88243-962-9. OCLC 53708947.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  3. Malone, Theresa (10 October 2013). "Dayanita Singh's best photograph – a sulking schoolgirl". The Guardian. Retrieved 2019-11-13.[permanent dead link]