దశభుజ వినాయక దేవాలయం
దశభుజ వినాయక దేవాలయం, మహారాష్ట్రలోని పూణేలో ఉన్న వినాయకుడి దేవాలయం. పూణేలోని కార్వే రోడ్‌లో ఉన్న పురాతన దేవాలయాలలో ఇది ఒకటి.[1] దశభుజ వినాయక దేవాలయాన్ని ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు సందర్శిస్తారు. వినాయక చవితి సందర్భంగా అధికసంఖ్యలో విచ్చేస్తారు.[2]
దశభుజ వినాయక దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 18°30′20.80″N 73°49′32.88″E / 18.5057778°N 73.8258000°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | పూణే జిల్లా |
ప్రదేశం | ఎరంద్వానే, కార్వే నగర్ రోడ్డు, పూణే |
సంస్కృతి | |
దైవం | వినాయకుడు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | పశ్చిమ భారత నిర్మాణ శైలీ |
చరిత్ర
మార్చుపీష్వా సర్దార్ అయిన సర్దార్ హరిపంత్ ఫడ్కే యాజమాన్యంలో ఉన్న ఈ దేవాలయం పీష్వాలకు విరాళంగా ఇవ్వబడింది. పది చేతుల గణపతి విగ్రహం ప్రతిష్టించబడినందున దశభుజ గణపతి అనే పేరు వచ్చింది.
ప్రత్యేకత
మార్చుఇక్కడున్న వినాయకుడి తొండం అతని కుడివైపున ఉంటుంది, ఇది వినాయక విగ్రహాల ఇతర రూపాలకంటే అరుదైనది, పవిత్రమైనదిగా భావించబడుతోంది.[3] రద్దీగా ఉండే కూడలిలో ఉన్నప్పటికీ కార్వే రోడ్ ఫ్లైఓవర్ నుండి ఈ దేవాలయం కనిపిస్తుంది. స్థానిక నివాసితులలో ముఖ్యంగా సాయంత్రం పూట దేవాలయానికి వచ్చే సీనియర్ సిటిజన్‌లతో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ దేవాలయంలో హనుమంతుని గుడి కూడా ఉంది.
ప్రదేశం
మార్చుఈ దేవాలయం మహారాష్ట్ర, పూణే నగరం, ఎరంద్‌వానేలోని పాండురంగ్ కాలనీలో కార్వే నగర్ రోడ్డు పక్కన ఉంది.[4]
మూలాలు
మార్చు- ↑ "Dashbhuja Ganpati Temple, Pune". Tripadvisor (in ఇంగ్లీష్). Retrieved 2022-07-03.
- ↑ Shilpa (2019-10-31). "Dashabhuja temple, Pune". Retrieved 2022-07-03.
- ↑ Menon, Anoop. "Ganesh Chaturthi 2017: Famous Ganesh Temples in Pune | India.com". www.india.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-03.
- ↑ "Dashabhuja Ganapati Temple Pune Timings, Entry Fee, Ticket Cost Price; Dashabhuja Ganapati Temple Opening & Closing Time, Holidays & Phone Number - Pune Tourism 2021". punetourism.co.in. Retrieved 2022-07-03.