పూణె జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా

పూణే జిల్లా : (पुणे जिला) (پونے ضلع ) - (Pune (District)) భారత్ లోని మహారాష్ట్ర జిల్లాలలోని ఒక జిల్లా. పూణే నగరం దీని పరిపాలనా నగరం. దీని జనాభా 9,426,959, భారత్ లోని 640 జిల్లాలలో అధిక జనాభాగల జిల్లాల ప్రకారం నాలుగవ స్థానం ఆక్రమిస్తుంది.[2] మొత్తం జనాభాలో నగరప్రాంత జనాభా 58.08% ఉంది.[3] ప్రస్తుతం పూణే అర్బన్ ప్రాంత జనాభా 50 లక్షలను దాటుతోంది.

పూణే జిల్లా
पुणे जिल्हा
మహారాష్ట్ర పటంలో పూణే జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో పూణే జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనుపూణే డివిజన్
ముఖ్య పట్టణంపూణే
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Pune, 2. Baramati, 3. Shirur, 4. Maval (రాయగడ్ జిల్లా లోని కొన్ని ప్రాంతాలు కలిపి) Based on (Election Commission website)
 • శాసనసభ నియోజకవర్గాలు21
విస్తీర్ణం
 • మొత్తం15,642 కి.మీ2 (6,039 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం99,24,224
 • జనసాంద్రత630/కి.మీ2 (1,600/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత87.19%[1]
 • లింగ నిష్పత్తి919
ప్రధాన రహదార్లుNH-4:National Highway 9 (India)|NH-9, NH-50
Websiteఅధికారిక జాలస్థలి
పూణె జిల్లా
శనివార్ వాడా ముందు బాజీ రావు I విగ్రహం, పాతాలేశ్వర్ గుహలు, పూణే, లోనావాలాలోని పర్వతాలు, చతుర్‌శృంగి ఆలయం, లోహగడ్ నుండి పూణే వీక్షణ

చరిత్ర

మార్చు

మాలిక్ అహమ్మద్

మార్చు

నిజాం షాహి పాలన స్థాపించి తరువాత అహమ్మద్ నగర్ నగరాన్ని రాజధానిగా చేసుకుని దాదాపు పూనా ప్రాంతం అంతటినీ (ఇందాపూర్ మినహా) పాలించాడు. అప్పటికి ఇందాపూర్ నామమాత్రంగా యూసఫ్ ఆదిల్ ఖాన్ ఆధీనంలో ఉండేది. ఈ భూభాగం ప్రత్యేక పరగణాలు, ప్రదేశాలుగా విభజించబడిన సర్కారుగా ఉండేది. నిజాంషాహి అంగీకారం పొందిన రాజప్రతినిధులు పన్ను వసూలు బాధ్యతను నిర్వహించేవారు. నిజాంషాహి రక్షణ వ్యవస్థ, నేరం, సివిల్ కేసులు వ్యవహారాలపై ఒక పర్యవేక్షణాధికారిని నియమించాడు.

మొగలుల దాడి

మార్చు

1595లో అహమ్మద్ నగర్ మీద మొఘల్ సైన్యాలు దాడిచేసాయి. ప్రాంతీయ వాసులు మొఘల్ దాడులకు ఎదురుగా నిలిచి అహమ్మద్ నగర్ పాలకులకు మద్దతుగా నిలిచారు. అహమ్మద్ నగర్ పాలకుల మద్దతుతో మరాఠీ రాజప్రతినిధులు శక్తిని కూడదీసుకున్నారు. వీరిలో శక్తివంతుడైన మలోజీ భోంస్లే 1595లో పూనా, సుపా ప్రాంతాలతో జాగీర్ ఆధిపత్యం సాధించాడు. మాలోజీ భోంస్లేకు షివ్నేరి, చకన్ కోటల బాధ్యతను కూడా అప్పగించబడింది. పూనా ఆరంభకాల చరిత్రలో ఈ కోటలు చాలా ప్రముఖపాత్ర వహించాయి. రాజా బిరుదు పొందక మునుపే మాలోజీకి పలు గ్రామాల మీద ఆధిపత్యం ఉండేది. విదర్భలో భాగంగా ఉన్న వెరుల్ ప్రాంతం వాటిలో ఒకటి. మాలోజీ దీపాభాయిని వివాహం చేసుకున్నాడు. దీపాభాయి పఠాన్‌కు చెందిన జగ్పాల్ నాయక్ నింబాల్కర్ సహోదరి. మాలోజీ భోంస్లేకు మరాఠీ రాజప్రతినిధులతో సత్సంబంధాలు ఉండేవి. విస్తారమైన మొఘల్ సైన్యాల తాకిడికి నిలబడడానికి నిజాంషాహి ప్రయత్నిస్తున్న క్లిష్టసమయంలో మాలోజీ నిజాంషాహీకి అండగా నిలిచాడు.

మొఘల్ పాలన

మార్చు

1600లో అహ్మద్‌నగర్‌ను మొఘలులు స్వాధీనం చేసుకున్నారు. 17వ శతాబ్దం ఆరంభంలో పూనా భూభాగంతో సహా అహ్మద్‌నగర్ రాజ్యం మొఘలుల వశం అయింది. నిజాం షా విశ్వాసపాతృడైన మాలిక్ అంబర్ నిజాంషాహి సింహాసనం కొరకు రెండవ ముర్తాజాను సిద్ధం చేసాడు. తరువాత తరానికి మాలిక్ అంబర్ నిజాంషాహి వారసులకు మార్గదర్శకం వహించాడు. నిజాంషాహీ రాజ్యానికి పూనా కేంద్రం అయింది. అన్నిరంగాలలో మాలిక్ అంబర్ చేపట్టిన సంస్కరణలు ఈ ప్రాంతప్రజల ఆర్థిక, రాజకీయ స్థితిని మెరుగుపరిచాయి. 1626లో మాలిక్ అంబర్ మరణించాడు. పునా రెవెన్యూ విధానం స్వయంప్రతిపత్తి కలిగి ఉండేది.

షహాజీ భోస్లె

మార్చు

మాలోజీ భోంస్లే తరువాత ఆయన కుమారుడు షాహాజీ భోస్లే వారసత్వ అధికారం పొందాడు. తరువాత షాహాజీ భోంస్లే, నిజాంషాహీ మద్య సంబంధాలు క్షీణించాయి. షాజీ తన జాగీరు రక్షణార్ధం మొఘలు పాలకుల మద్దతు కోరాడు. మొఘలు పాలకులు షాహాజీకి మద్దతు ఇచ్చారు. 1632 లో షాహాజీ మొఘలులను వదిలి అహమ్మద్ నగర్ పాలకుడైన నిజాంషాహీ శత్రువైన ఆదిల్షాహీ (బీజపూర్ పాలకుడు) కు స్నేహహస్థం అందించాడు. షాహాజీ చర్యలకు కుపితులైన మొఘల్ పాలకులు 1635లో పూనా మీద దండెత్తి పూనాను నేలమట్టం చేసారు. మొఘలుల విజయం తరువాత అహమ్మద్ రాజ్యం రెండుగా విభజించబడి మొఘల్ సామ్రాజ్యంలో కొంత, బీజపూర్ సామ్రాజ్యంలో కొంత విలీనం అయింది. పూనా బీజపూర్ రాజ్యంలో విలీనం అయింది. షాహాజీకి సరికొత్త సామ్రాజ్యంలో కొత్త అధికారాలు లభించాయి. బీజపూర్ సామ్రాజ్య విస్తరణలో షాహాజీ భాగస్వామ్యం వహించాడు. షాహాజీ కర్నాటకా దండయాత్రకు పోయే సమయంలో తన కుమారుడైన శివాజీ విద్యా బాధ్యతను తల్లి జిజియాభాయికి అప్పగించి జాగీరు, కుటుంబసహాయ బాధ్యతలను తన విశ్వాసపాత్రుడైన సేవకుడైన దాదాజీకి అప్పగించాడు. 1647లో దాదాజీ మరణించిన తరువాత జాగీరు బాధ్యతలు వారసత్వంగా శివాజీకి సంక్రమించాయి.

చత్రపతి శివజీ (17వ శతాబ్దం)

మార్చు

శివాజీ అధికారం చేపట్టిన తరువాత ముస్లిం కామాండర్‌కు లంచం ఇచ్చి కొండనా కోట మీద దాడిచేసి స్వాధీనం చేసుకున్నాడు. కొండానా స్వాధీనం చేసుకోవడం పూనా చరిత్రలో ప్రాముఖ్యత సంతరించుకుంది. తరువాత శివాజీకి చకాన్, నిరా మద్య ప్రాంతం మీద ఆధిపత్యం వహించడం సులువుగా సాధ్యమైంది. తరువాత శివాజీ 1648 నాటికి రాజధానిని రాజ్గడ్‌కు మార్చుకున్నాడు. బీజపూర్ పాలకుడు ముహమ్మద్ ఆదిల్షా శివాజీ రాజ్యవిస్తరణ చూసి కలత చెంది కీడును శకించి షాహాజీని ఖైదు చేసాడు. ఇది శివాజీ మరింతగా రాజ్యవిస్తరణ చేయడానికి ప్రేరణ అయింది.

ముంసబ్దార్ పదవి

మార్చు

శివాజీ మొఘల్ పాలనలో ముంసబ్దార్ పదవిని అంగీకరించాడు. అంతటితో శివాజీ బీజపూర్ రాజ్యం మీద శతృత్వం వహించడం లోకవిదితం అయింది. శివాజీ 5,000 ఆశ్వికదళంతో కూడిన ముంసబ్దార్ పదవిని సంరక్షించుకున్నాడు. శివాజీ శక్తియుక్తులు గ్రహించిన బీజపూర్ సుల్తాన్ షాహాజీని విడుదల చేసాడు. శివాజీ శక్తియుక్తుడవడం పూనాను కూడా శక్తివంతం చేసింది. పూనా ఉత్తర, వాయవ్య భూభాగం అప్పటికి మొఘల్ పాలకుల చేతిలో ఉంది.

శివాజీ పాలనలో సమృద్ధి (1647–1680).

మార్చు

శివాజీ కాలంలో పూనా ప్రజల జీవితం సమృద్ఫ్హమైనది. ప్రాంతీయ పంటల అభివృద్ధి మాత్రమేకాక విదేశీ పంటలైన పత్తి, గోధుమ పంటలు కూడా విస్తారంగా పండించబడినవి. ప్రత్యేకంగా జిల్లా వాయవ్యభాగంలో అధికంగా పండుంచబడినవి.

సంభాజీ మరణించిన తరువాత పూనా విభాగంలో రాజకీయ అస్థిరత, ఒడిదుడుకులు నెలకొన్నాయి.

పూనా (1714).

మార్చు

బాలాజీ విశ్వనాథ్ ఆయన కుమారుడు అబాజి పురందరే పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు.

భాజీరావు II (1795–1817)

మార్చు

1797లో అరబ్ సైనికబృందాల మద్య సంఘర్షణ జరిగింది. ఈ సంఘర్షణలో 100 మనిదికంటే అధికంగా ప్రాణాలు కోల్పోయారు. దుకాణాలు దోపిడీకి గురైయ్యాయి. అదే సంవత్సరం నానా ఫద్వవి నివాసం మీద సింధే సైనికులు దాడిచేసారు. ఈ యుద్ధం పగలు రాత్రి అంతా జరిగింది.

యశ్వంతరావు హోల్కర్

మార్చు

1800 లో నానా ఫద్నవిస్ మరణించిన తరువాత దౌలత్‌రావ్ అధికారాన్ని చేపట్టాడు. దౌలత్‌రావు, బాజీరావు కలిసి తమశత్రువులను కారుణ్యరహితంగా వారి రాజకీయ శత్రువులను అణిచివేసారు. షిండేకు పేష్వా వద్ద పలుకుబడి హోల్కర్‌కు అయిష్టతను కలుగజేసింది. 1802లో హోల్కర్ పేష్వా, సిండే మీద దాడిచేసి ఓడించాడు. కొంతకాలం వరకు హోల్కర్ బాజీరావు స్థానంలో అమృతరావును పేష్వాను చేసాడు. భాజీరావు పారిపోయి ఆంగ్లేయులను ఆశ్రయించి బాసియన్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం మూలంగా భాజీరావు తన స్వతంత్రం, ప్రజల స్వేచ్ఛను ఫణంగా పెట్టి పేష్వాపదవి, స్వీయ రక్షణను సంపాదించుకున్నాడు. భాజీరావు పూనాను చేరుకున్న సమయంలో అమృతరావు తన సహోదరునికి అధికారం అప్పగించడానికి ముందు పూనా నగరాన్ని కాల్చివేయడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ జనరల్ వెల్లెస్లీ నగరాన్ని ఆపద నుండి రక్షించాడు. పూనా మానవ కల్పిత ఆపద నుండి రక్షించబడినప్పటికీ 1804-1804 మద్య ప్రకృతి కలిగించిన విపత్తు నుండి రక్షించబడలేదు.

1818 తరువాత

మార్చు

1817 నవంబరు 17న పూనా స్వాధీనం చేసుకొనబడింది. పూనాను స్వాధీనం చేసుకున్న తరువాత బ్రిటిష్ సైన్యం మరాఠీ అధికారం స్వాధీనం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించింది. 1818 ఫివ్రవరి 10న బ్రిటిష్ సైన్యం సతారాను స్వాధీనం చేసుకుంది. సతారాను స్వాధీనం చేసుకున్న తరువాత భాజీరావు పారిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం పేష్వాల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. సింహ్గడ్, పురందర్, చకన్, లోహొగాడ్, జిల్లాలోని 1-2 కోటలు బ్రిటిష్ పరం అయ్యాయి. సింహ్గడ్ 1818 మార్చి, పురందర్ మార్చి 16, మే 3న జీవధాన్ (నానాపాస్ సమీపంలో) కంపెనీ అధీనంలోకి మారాయి. ఒక మాసకాలంలో భాజీరావు తనకుతానే సర్ జాన్ మాల్కొల్మ్‌కు లొంగిపోయాడు. క్రమంగా పూనా జిల్లాలోని భూభాగం అంతా కంపెనీ స్వాధీనం అయింది.

భౌగోళికం

మార్చు

పూనా జిల్లా మహారాష్ట్ర రాష్ట్ర పశ్చిమభూభాగంలో ఉంది. పూనాజిల్లా పశ్చిమకనుమలలోని సహ్యాద్రి పర్వతాలలో ఉంది. ఇది తూర్పున దక్కన్ పీఠభూమి వరకు విస్తరించి ఉంది. సముద్రమట్టానికి ఇది 559 మీ ఎత్తున ఉంది. ఇది 17.5° నుండి 19.2° ఉత్తత అక్షాంశం, 73.2° నుండి 75.1° డిగ్రీల దక్షిణ రేఖాంశంలో ఉంది. జిల్లాలో 2 మునిసిపల్ కార్పొరేషన్లు (పూనా మునిసిపల్ కార్పొరేషన్, పింప్రి - చించ్వద్ మునిసిపల్ కార్పొరేషన్లు) ఉన్నాయి. పింప్రి - చించవద్ పూనా నగర పశ్చిమభాగంలో జాతీయరహదారి ఆనుకుని ఉంది. కార్పొరేషన్‌లో నిగ్ది, అకుర్ది, పింప్రి, చించ్వద్, భొసరి ప్రాంతాలు ఉన్నాయి. దీనిని ఎం.ఐ.డి.సి, ఇండస్ట్రియల్ జోన్ అభివృద్ధిచేసాయి.

సరిహద్దులు

మార్చు
సరిహద్దు వివరణ జిల్లా
వాయవ్య సరిహద్దు తానే జల్లు
పశ్చిమ సరిహద్దు రాయగడ్
దక్షిణ సరిహద్దు సతారా
ఆగ్నేయ సరిహద్దు సోలాపూర్
ఉత్తర - వాయవ్య సరిహద్దు అహ్మద్‌నగర్

వాతావరణం

మార్చు

జిల్లా సరాసరి వర్షపాతం 600 -700 మి.మీ. వర్షాకాలం జూలై- అక్టోబరు. మితమైన ఉష్ణోగ్రత ఉంటుంది. వేసవి కాలం మార్చి- జూన్ వరకు ఉంటుంది. వేసవి పొడిగానూ, వేడిగానూ ఉంటుంది. ఉష్ణోగ్రత 20-38 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. ఒక్కోసారి 40 డిగ్రీల సెల్షియస్ చేరుతుంది. శీతాకాలం జనవరి, మార్చి మాసాల మద్య ఉంటుంది. ఉష్ణోగ్రత 9-14 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. ఒక్కోసారి 3 డిగ్రీల సెల్షియస్ చేరుతుంది. జూన్ - సెప్టెంబరు మద్య వర్షాలతో వ్యవసాయం బాధించబడుతుంది.

శీతోష్ణస్థితి డేటా - Pune
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 29.9
(85.8)
31.9
(89.4)
35.4
(95.7)
37.7
(99.9)
36.9
(98.4)
31.7
(89.1)
28.4
(83.1)
27.4
(81.3)
29.4
(84.9)
31.4
(88.5)
30.0
(86.0)
28.0
(82.4)
31.5
(88.7)
సగటు అల్ప °C (°F) 10.0
(50.0)
12.0
(53.6)
15.0
(59.0)
19.5
(67.1)
22.4
(72.3)
22.7
(72.9)
22.0
(71.6)
21.3
(70.3)
20.3
(68.5)
17.0
(62.6)
14.0
(57.2)
10.0
(50.0)
17.2
(62.9)
సగటు అవపాతం mm (inches) 0
(0)
3
(0.1)
2
(0.1)
11
(0.4)
40
(1.6)
138
(5.4)
163
(6.4)
129
(5.1)
155
(6.1)
68
(2.7)
28
(1.1)
4
(0.2)
741
(29.2)
సగటు అవపాతపు రోజులు 0.1 0.3 0.3 1.1 3.3 10.9 17.0 16.2 10.9 5.0 2.4 0.3 67.8
Mean monthly sunshine hours 291.4 282.8 300.7 303.0 316.2 186.0 120.9 111.6 177.0 248.0 270.0 288.3 2,895.9
Source: HKO

నదులు, సరసులు , ఆనకట్టలు

మార్చు

జిల్లాలో పుష్పవతి, క్రుష్ణవతి, కుకడి, మీనా, ఘోడ్, భీమా, అంధ్రా, ఇంద్ర్యాణి, పవ్న, మూల, ముత, మోస్, శివగంగ, కనంది, గుంజవ్ని, వెల్వంది, నీరా, కర్జ,వెలు నదులు ప్రవహిస్తున్నాయి.

ప్రధాన ఆనకట్టలు

మార్చు

యెద్గావ్ (కుకది), పింపల్గావ్ (పుస్పవతి), మణిక్దొ, మీనా (మీనా), డింబే (ఘొడ్), చాస్ - కామన్, ఉజని (భీమా), అంధ్రా (అంధ్రా), వల్వహన్ (ఇంద్రయాని), పవన (పవన), ముల్షి (మూల), తెంఘర్, ఖదక్వల్స (ముథ), వరస్గావ్ (అంబి), పంషెట్ (మోస్), చాపెట్ (కనంది), భత్గర్ (వెల్వంది), వీర్ (నీరా)

సరసులు

మార్చు

లోంవ్ల ప్రాంతంలో (వద్గావ్ - మవల్ తాలూకా) లేక్ మహారాష్ట్ర డిస్ట్రిక్ అని పిలువబడుతుంది. ఇక్కడ భుషి, లోనావాల, ఐ.ఎన్.ఎస్. శివాజీ, పవ్న, వల్హన్, తుంగరి, అంధ్రా, షిర్వ్త సరసులు ఉన్నాయి. సహ్యాద్రి, దాని శాఖల నుండి ప్రవహిస్తున్న పలు ప్రవాహాలు ఈ సరసులకు అవసరమైన నీటిని అందిస్తున్నాయి.

2011 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 9,429,408,[2]
ఇది దాదాపు. బెనిన్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నార్త్ కరోలినా నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 4 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 603 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 30.34%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 910:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 87.19%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

2001 గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
2001 గణాంకాలను అనుసరించి 7,232,555
కుటుంబాలు 1,517,041
జనసాంధ్రత 462
4 వయసు లోపు పిల్లలు 1,491,352
5-15 వయసు లోపు పిల్లలు 4,466,901
16-59 వయసు 5,89,280 60
స్త్రీ: పురుష 919:1000

ఎడ్యుకేషన్

మార్చు

హయ్యర్ ఎడ్యుకేషన్

మార్చు

పూనే జిల్లాలో పూనే విశ్వవిద్యాలయం కేంద్రంగా ఉంది. నగరాన్ని కూడా ఈస్ట్ ఆక్స్ ఫర్డ్ అని పిలుస్తారు. ప్రముఖ కళాశాలలు:5

ప్రాథమిక , మాధ్యమిక విద్య

మార్చు

పూనే జిల్లాలో ప్రభుత్వ విద్యను జిల్లా పరిషత్ నిర్వహిస్తుంది. జిల్లాలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి.ప్రస్తుతం హిగ్నే వద్ద ఉన్న కర్వెంగర్ పాఠశాల 1910లో భారతరత్న డాక్టర్. ధొండో కేశవ్ కార్వే ద్వారా స్థాపించబడిన పురాతన పాఠశాలగా భావిస్తున్నారు.

విభాగాలు

మార్చు

జిల్లాలో 15 తాలూకాలు, 15 పంచాయితీ సమితులు ఉన్నాయి:

జున్నార్ తాలూకా, అబిగావ్ తాలూకా, ఖేడ్ తాలూకా, మావల్ తాలూకా, ముల్షి తాలూకా, వెల్హే తాలూకా, భోర్కు తాలూకా, హవేలీ తాలూకా, పురందర్ తాలూకా, పింప్రి- చించ్ వాడ్ నగరాన్ని టెంసిల్, పూనే సిటీ తాలూకా, ఇందపూర్ తాలూకా, దావండ్ తాలూకా, బారామతి తాలూకా, షిరూర్ తాలూకా.

పూనా నగరం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లాలో 1866 గ్రామాలు ఉన్నాయి. జిల్లలో 18 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి: జూన్నార్, అంబిగావ్, ఖేడ్-అలందిలో, మావల్, ముల్షి హవేలీ, బొపొడి, శివాజీనగర్, పార్వతి (ఎస్.సి), కస్బ పేట్, భవాని పేట్, పూనే కంటోన్మెంట్, షిరూర్, దావండ్, ఇందపూర్, బారామతి, పురంధర్, భోర్కు. పూనా జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి : పూనా, బారామతి, షిరూర్, మవల్.

పూనా జిల్లాలోని తూర్పు భాగాన్ని వేరు చేసి భారామతి జిల్లా రూపొందుంచాలని ప్రతిపాదిస్తున్నారు. ఇందులో షిరూర్ తాలూకా, పురందర్ తాలూకా, దావండ్, బారామతి, ఇంద్పూర్ తాలూకాలు ఉన్నాయి. వీటితో పొరుగున ఉన్న సతారా జిల్లా లోని పత్లాన్ తాలూకాను బారామతి జిల్లాలో కలపాలని ప్రతిపాదిస్తున్నారు.

పూనా జిల్లా కోర్టు

మార్చు

పూనా డిస్ట్రిక్ కోర్ట్‌ జిల్లాపరిధిలో న్యాయవివాదాలను పరిష్కరిస్తుంది. సివిల్ వ్యవహారాలను పరిష్కరించడానికి జిల్లాకోర్ట్ కృషిచేస్తుంది.

నగరాలు , పట్టణాలు

మార్చు

జిల్లాలో ప్రధానంగా పూనా నగరం, పింప్రి- చించ్వాద్ నగరాలు ఉన్నాయి. పూనా నగరం పాలనావ్యవహారాలు పూనా మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. పింప్రి- చించిద్వాద్ పాలనావ్యవహారాలు పింప్రి- చించిద్వాద్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. జిల్లాలో కంటోన్మెంటు ప్రాంతం ఉంది.

  • పూనే కంటోన్మెంట్
  • ఖడ్కి కంటోన్మెంట్
  • దేహు రోడ్ కంటోన్మెంట్

జిల్లాలోని పట్టణాలు 4

  • జిల్లాలోని ఉక్రుల్ కాంచన్ గ్రామపంచాయితీ నిర్వహణలో ఉంది.

కోటలు

మార్చు

జిల్లాలో పూనా లోపల, వెలుపల పలు కోటలు ఉన్నాయి. జిల్లాలో కొండలమీద పలు కోటలు ఉన్నాయి.

ఆర్ధికం

మార్చు

జిల్లా ఆర్థికంగా పరిశ్రమలు, వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. జిల్లా దేశంలో ఐ.టి ప్రధాన నగరంగా గుర్తించబడుతుంది. పూనా జిల్లా ప్రముఖ ఆటోమోటివ్ వ్యాపార కేంద్రంగా ఉంది. జిల్లాలోని పరిశ్రమలు:-

  • ధూత్ ట్రాంస్మిషన్ ప్రైవేట్ లిమిటెడ్.

పింప్రి- చించిద్వానాలో ఉన్న టాటామోటర్స్ కంపెనీ జిల్లాఆర్ధిక రంగానికి అధికంగా సహకరిస్తుంది. జిల్లాలో అదనంగా ఇంఫోసిస్, థర్మాక్స్, మహీంద్రా, ఇ- జెస్ట్ సొల్యూషంస్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.

ప్రయాణసౌకర్యాలు

మార్చు

వాయుమార్గం

మార్చు

పూనా నగరానికి ఈశాన్యంలో లోహేగావ్ ఎయిర్ బేస్ వద్ద పూనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడ నుండి పలు దేశీయ, విదేశీ సేవలు లభిస్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూనా ఎయిర్ ట్రాఫిక్‌ను నియంత్రిస్తుంది.,[6][7]

బారామతి నుండి 12 కి.మీ దూరం, పూనా నుండి 100కి.మీ దూరంలో బారామతి విమానాశ్రయం ఉంది. ఇది ఫైలట్ ట్రైనింగ్, చార్టర్ విమానాల రాకపోకలకు ఉపయోగిస్తున్నారు. [8]

రహదార్లు

మార్చు

జిల్లాలోని రహదార్ల మొత్తం పొడవు 13,642 కి.మీ. జిల్లాను పలు జాతీయరహదారి, రాష్ట్రీయ రహదార్లు దాటిపోతుంటాయి.

  • పూనే ముంబై, పూనే బెంగుళూర్ జాతీయ రహదారి (జా.ర 4)
  • పూనే షోలాపూర్ Hydrabad నేషనల్ హైవే (జా.ర 9)
  • పూనే నాసిక్ జాతీయ రహదారి (జా.ర50)
  • ముంబై పూనే ఎక్స్ప్రెస్వే

ప్రధాన రాష్ట్రం రహదార్లు

  • పూనే కొల్లాపూర్ ఔరంగాబాద్ స్టేట్ హైవే
  • పూనే అలందిలో స్టేట్ హైవే
  • పూనే సస్వద్ పండరపుర స్టేట్ హైవే
  • పూనే పౌడ్ రోడ్ స్టేట్ హైవే
  • తలెగావ్ చకన్ స్టేట్ హైవే

మునిసిపల్ బస్ సిస్టం బస్ సర్వీసులు అందిస్తుంది. స్టేట్ సర్వీస్ బసులు (ఎం.ఆర్.టి.సి) జిల్లాలోని గ్రామాలు అన్నింటికీ బసు సేవలు అందిస్తుంది.

రైలు మార్గాలు

మార్చు

పూనా జిల్లాలో రెండు ప్రధాన జంక్షన్లు ఉన్నాయి. అవి పూనా జంక్షన్, దౌండ్ జంక్షన్. అన్ని రైలు మార్గాలు పూనా మీదుగా పయనిస్తాయి. సెంట్రల్ రైల్వేకి చెందిన బ్రాడ్ గేజ్‌ లైన్లు ఉన్నాయి.

  • పూనే-ముంబై.
  • పూనే-కళ్యాణ్-నాసిక్ నగరం.
  • పూనే-దావండ్.
  • పూనే-దావండ్-షోలాపూర్ (సోలాపూర్ భిగ్వాన్ నుండి సింగిల్ ట్రాక్).
  • పూనే-దావండ్-మన్మాడ్ (మన్మాడ్ కు దావండ్ నుండి సింగిల్ ట్రాక్).
  • పూనే-దావండ్-బారామతి శాఖ లైన్ (సింగిల్ ట్రాక్).
  • పూనే-దావండ్-కుర్దువాడి -లాతూర్ రోడ్.
  • పూనే-దావండ్-కుర్దువాడి-మిరాజ్.
  • పూనే-మిరాజ్-హుబ్లి.
  • పూనే-మిరాజ్-కొల్హాపూర్ శాఖ లైన్ (కొల్హాపూర్ మిరాజ్ నుండి సింగిల్ ట్రాక్).

మీటర్ గేజిగా ఉన్న పూనా- మిరాజ్- ఖోలాపూర్ రైల్వే మార్గం 1995 నుండి బ్రాడ్ గేజిగా మార్చాబడింది. అలాగే మీటర్ గేజ్ రైలుమార్గం లాతూర్ రోడ్డు - కురుద్వాడి - మిరాజ్ మార్గం బ్రాడ్ గేజ్ రైలు మార్గంగా మార్చబడింది.

క్రీడలు

మార్చు
  • పూనా మహారాష్ట్ర క్రికెట్ టీం హోం గ్రౌండ్ అయిన మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పునాలోని గహుంజే వద్ద ఉంది.
  • పూనా ఫుట్ బాల్ క్లబ్ ఐ- లీగ్స్ పునా నగరంలో ఉంది.
  • 1903లో పూనాలో నేషనల్ గేంస్ నిర్వహించబడ్డాయి. కొత్తగా నిర్మించబడిన స్పోర్ట్స్ సిటీ 2008లో కామంవెల్త్ క్రీడలు నిర్వహించబడ్డాయి. స్పోర్ట్స్ స్కూల్‌లో క్రీడా ప్రభోధిని పేరుతో క్రీడలలో శిక్షణ ఇస్తున్నారు. జలాశయాలు బోటుక్లబ్బులు (సి.ఒ.ఇ.పి, ఆర్.సి.బి.సి, కె.పి.ఆర్.సి, ఎం.ఐ.టి. ఆలంది) అధికరించడానికి సహకరిస్తున్నాయి.
  • పునా పలు ప్రముఖ క్రీడాకారులను (అభిజిత్ కుంటే, హృషీకేష్ కనిత్కర్, ధనరాజ్ పిళ్ళై, అంవర్ షైక్ ప్రపంచానికి అందించింది.
  • అన్ని క్రీడాకు అనుకూలమైన " బాలేగాడ్ " గ్రౌండ్ ఉంది.
  • పూనాలో 2011-12 నుండి " సహారా పూనా వారియర్స్ " హోం గ్రౌండ్‌ అయిన " సుబ్రతా రాయ్ స్టేడియం " ఉంది.
  • ప్రధాన 8 కబాడీ లీగ్‌లలో ఒకటైన పునేరి పాల్తన్‌ హోం గ్రౌండ్ జిల్లాలోని బలెవాడి వద్ద ఉంది.

పూనా ద్వారాలు

మార్చు

బిగ్వన్

మార్చు

బిగ్వన్ వద్ద ఉజ్జయిని ఆనకట్ట పరీవాహక ప్రాంతాలలో ఒకటి. ఇది పూనా నుండి 95కి.మీ దూరంలో పూనా- సోలాపూర్ రహదారి మార్గంలో (జాతీయ రహదారి-9) ఉంది. 18000 చ.హె. ప్రాంతంలో " బర్డ్ మైగ్రేషన్ " స్థాపించాలని యోచిస్తున్నారు. వాటర్ ఫౌల్ వలసపక్షికి ఇది ప్రధాన గమ్యం.

ఆరోగ్యం

మార్చు

పూనా జిల్లాలో 3 ప్రభుత్వ ఆసుపత్రులు (ససూన్ హాస్పిటల్, బుధ్రాని, డాక్టర్. అంబేత్కర్ హాస్పిటల్) ఉన్నాయి. ఇవి కాక జిల్లాలో పలు పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులు (సహ్యాద్రి హాస్పిటల్, జహంగీర్ హాస్పిటల్, సంచేటి హాస్పిటల్, ఆదిత్యా బిర్లా మెమోరియల్ హాస్పిటల్, కె.ఇ.ఎం హాస్పిటల్, రూబీ హాల్ క్లినిక్, మంగేష్కర్ హాస్పిటల్) ఉన్నాయి.

జిల్లా ప్రముఖులు

మార్చు
  • బాబు గేను సైద్: స్వాతంత్ర్య సమర యోధుడు. అంబెగావ్ తాలూకా మహాలుంగే పద్వాల్‌లో జన్మించాడు.

మూలాలు

మార్చు
  1. http://www.census2011.co.in/census/district/359-pune.html
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-08-10.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Benin 9,325,032
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. North Carolina 9,535,483
  6. AAI website, 1 November 2011, archived from the original on 8 ఫిబ్రవరి 2012, retrieved 1 February 2012
  7. New Airport for Pune
  8. "Reliance plans Baramati hub for pvt jets". Business Standard. 16 July 2011. Retrieved 19 September 2011.

వెలుపలి లింకులు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు