దస్తూరాబాద్ మండలం

తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం
(దస్తూరబాద్ మండలం నుండి దారిమార్పు చెందింది)


దస్తూరాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం.[1] దస్తూరాబాద్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 8 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

దస్తూరాబాద్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, దస్తూరాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, దస్తూరాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, దస్తూరాబాద్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°05′48″N 78°51′51″E / 19.096567°N 78.864102°E / 19.096567; 78.864102
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం దస్తూరాబాద్
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 78 km² (30.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 15,814
 - పురుషులు 7,786
 - స్త్రీలు 8,028
పిన్‌కోడ్ 504202

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

ఇంతకుముందు దస్తూరాబాద్ గ్రామం అదిలాబాదు జిల్లా, నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధిలోని కడెంపెద్దూరు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా దస్తూరాబాద్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా, నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+07 (ఎనిమిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4] పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 78 చ.కి.మీ. కాగా, జనాభా 15,814. జనాభాలో పురుషులు 7,786 కాగా, స్త్రీల సంఖ్య 8,028. మండలంలో 4,016 గృహాలున్నాయి.[5]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. గోడ్‌సెర్యాల్
  2. చెన్నూర్
  3. దస్తూరాబాద్
  4. భుట్టాపూర్
  5. భూత్కూర్
  6. మల్లాపూర్
  7. మున్యాల్
  8. రేవోజీపేట్ (కొత్త)

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-28.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.