నిర్మల్

తెలంగాణ, నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలం లోని పట్టణం

నిర్మల్, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలానికి చెందిన పట్టణం.[1]

నిర్మల్
—  రెవెన్యూ గ్రామం  —
నిర్మల్ is located in తెలంగాణ
నిర్మల్
నిర్మల్
అక్షాంశరేఖాంశాలు: 19°06′N 78°18′E / 19.10°N 78.3°E / 19.10; 78.3
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండలం నిర్మల్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది సముద్ర మట్టానికి 348 మీ ఎత్తులో ఉంది ఎత్తులో ఉంది.నిర్మల్ జిల్లా పరిపాలనా కేంద్రం, మండల హెడ్ క్వార్టర్స్ నిర్మల్ పట్టణం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]

సమీప మండలాలు

మార్చు

తూర్పు వైపు లక్ష్మణచందా, పశ్చిమాన సారంగపూర్,

సమీప పట్టణాలు

మార్చు

వైద్య సౌకర్యం

మార్చు

జిల్లా ఆసుప‌త్రి

ఇక్కడ నిర్మల్ జిల్లా ప్రధాన‌ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. 42 కోట్ల రూపాయలతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుప‌త్రి భ‌వ‌న స‌ముదాయం, 166 కోట్ల రూపాయలతో వైద్య క‌ళాశాల ఏర్పాటు జరుగనుంది. ఈ ఆసుపత్రిలో 1.5 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన సిటీ స్కాన్‌ యంత్రాన్ని 2023 ఫిబ్రవరి 22న రాష్ట్ర అట‌వి, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించాడు.[3]

కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం

మార్చు

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులోని 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 56 కోట్ల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన రెండు అంతస్తులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. కింది అంతస్తులో కలెక్టర్‌, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు, రెండు వెయిటింగ్‌ హాల్స్‌, రెండు వీడియోకాన్ఫరెన్స్‌ హాల్స్‌, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు, దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ను నిర్మించారు. మొదటి అంతస్తులో వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. పూర్తి ఆక్సిజన్‌ జోన్‌గా రూపొందించిన ఈ కలెక్టరేట్‌ కార్యాలయంలోని అండర్‌ గ్రౌండ్‌లో 80వేల లీటర్ల నీటి సామర్థ్యంతో సంప్‌, 20 వేల లీటర్ల సామర్థ్యంతో రెండు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించారు. కలెక్టరేట్‌ ముందు ఆవరణలో హెలిప్యాడ్‌ను కూడా ఏర్పాటుచేశారు.[4]

2023, జూన్ 4న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డిని కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతోపాటు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]

అంబేద్కర్‌ భవన్

మార్చు

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎక‌రం విస్తీర్ణంలో రూ. 5 కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో నిర్మించిన నూతన అంబేద్కర్‌ భవన్ ను 2022 ఏప్రిల్ 18న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి-మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్, అట‌వీ-ప‌ర్యావ‌ర‌ణ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు.[6] మాజీ లోకస‌భ స్పీక‌ర్ జిఎంసీ బాల‌యోగి గ‌తంలో ఈ భ‌వ‌న నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేశాడు. అప్పటినుండి ఆగిపోయిన నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ద‌శ‌ల వారీగా నిధులు మంజూరు చేసింది. ఇందులో సుమారు 2 వేల‌ మంది కూర్చునేలా ఆడిటోరియం, స‌మావేశ మందిరం నిర్మించబడ్డాయి.[7][8]

ఈద్గా

మార్చు

రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మల్‌ పట్టణానికి సమీపంలో 5.35 కోట్ల రూపాయలతో పదెకరాల్ స్థలంలో నిర్మించిన ఈద్గాను 2023 ఏప్రిల్ 18న రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.[9]

ప్రభుత్వ వైద్య కళాశాల

మార్చు

నిర్మల్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం 2023లో నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేసింది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో 25 ఎకరాలలో 166 కోట్ల రూపాయలతో ఆరు బ్లాకులు, నాలుగు సెల్లార్లు, మూడు ఫ్లోర్‌లలో ఈ వైద్య కళాశాల నిర్మించబడింది. 2023 సెస్టెంబరు 15న ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.[10][11]

అభివృద్ధి పనులు

మార్చు

2023, అక్టోబరు 4న రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిర్మల్ పట్టణంలో మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంలో భాగంగా 23.91 కోట్ల రూపాయలతో నిర్మల్‌ పట్టణంలో ఇంటింటికి న‌ల్లా నీటి స‌ర‌ఫ‌రాను ప్రారంభించి, త‌హ‌సీల్ కార్యాలయ స్థలంలో 2.30 ఎక‌రాల విస్తీర్ణంలో 10.15 కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో నిర్మించనున్న స‌మీకృత మార్కెట్‌కు, [12] 2కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధుల‌తో నిర్మించే దోబీఘాట్ పనులకు, 4కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధుల‌తో మౌలిక వ‌స‌తుల కల్పన కోసం చేప‌ట్టే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు, మంచినీటి స‌ర‌ఫ‌రా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమృత్ ప‌థ‌కంలో భాగంగా 62.50 కోట్ల రూపాయలతో చేప‌ట్టే ప‌నుల‌కు, 50 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధుల‌తో మౌలిక వ‌స‌తుల క‌ల్పన కోసం చేప‌ట్టే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు, ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా 25 కోట్ల రూపాయలతో మౌలిక వ‌స‌తుల క‌ల్పనలో భాగంగా చేపట్టే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశాడు.[13]

మూలాలు

మార్చు
 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
 3. telugu, NT News (2023-02-22). "Minister Indrakaran reddy | సర్కారు ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు : మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి". www.ntnews.com. Archived from the original on 2023-02-22. Retrieved 2023-02-24.
 4. "నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటేడ్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". Sakshi. 2023-06-04. Archived from the original on 2023-06-05. Retrieved 2023-06-05.
 5. "CM KCR: చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది.. ఇదే పట్టుదలతో ముందుకు సాగుదాం: కేసీఆర్‌". EENADU. 2023-06-04. Archived from the original on 2023-06-04. Retrieved 2023-06-05.
 6. telugu, NT News (2022-04-18). "డా.బీఆర్‌ అంబేద్కర్‌ భవన్‌ను ప్రారంభించిన మంత్రులు కొప్పుల, ఐకే రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-04-18. Retrieved 2022-04-18.
 7. telugu, NT News (2022-04-06). "అంబేద్కర్‌ భ‌వ‌న్ నిర్మల్‌కే త‌ల‌మానికం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-04-18. Retrieved 2022-04-18.
 8. "ఆంబేద్క‌ర్ భ‌వ‌న్ నిర్మ‌ల్ కే త‌ల‌మానికం: ఇంద్రకరణ్ రెడ్డి". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-06. Archived from the original on 2022-04-06. Retrieved 2022-04-18.
 9. telugu, NT News (2023-04-18). "KCR | కేసీఆర్ పాల‌న‌లో అన్ని మ‌తాల‌కు స‌మప్రాధాన్యం : మంత్రి మ‌హ‌ముద్ అలీ". www.ntnews.com. Archived from the original on 2023-04-18. Retrieved 2023-04-22.
 10. "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-27.
 11. telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-27.
 12. "పర్యటన సాగిందిలా." Sakshi. 2023-10-05. Archived from the original on 2023-11-26. Retrieved 2023-11-26.
 13. telugu, NT News (2023-10-03). "ప్రగతి పండుగకు రామన్న". www.ntnews.com. Archived from the original on 2023-10-03. Retrieved 2023-11-26.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నిర్మల్&oldid=4266384" నుండి వెలికితీశారు