దామెర్ల సత్యవాణి
దామెర్ల సత్యవాణి (1907-1992) తొలితరం మహిళా చిత్రకారిణి.[1]
దామెర్ల సత్యవాణి | |
---|---|
ఇతర పేర్లు | సత్యవాణి |
జీవిత భాగస్వామి | దామెర్ల రామారావు |
జీవిత విశేషాలు
మార్చుఆమె ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు భార్య. ఆమె చిత్రలేఖనం నేపధ్యంగా గల కుటుంబమునకు చెందినది. ఆమెకు ఉన్న చిత్రలేఖనాభిమానంతో భర్త వద్ద నుండి చిత్రలేఖనం నేర్చుకున్నది. అనతికాలంలోనే ఆమె ప్రసిద్ధ చిత్రకారిణిగా గుర్తింపబడి అనేక ప్రైజులు పొందారు. జాతీయ చిత్ర ప్రదర్శనలలో అనేక చిత్రాలను ప్రదర్శించారు. ఆమె గుర్తింపు పొందిన చిత్రకారిణిగా సేవలందిస్తూ స్థానిక ప్రభుత్వ బాలికా ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యానిగా సేవలనందించారు.
దామెర్ల రామారావు బ్రతికింది కేవలం 28 సంవత్సరాలు. ఆ స్వల్ప కాలంలోనే ఎన్నో అద్భుతమైన చిత్రాలు గీసి, గొప్ప చిత్రకారుడిగా పేరు పొందాడు. దామెర్ల రామారావు ఆంద్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ని స్థాపించారు. చిత్రకారులకి మోడల్ లభించడం ఎంతో కష్టమైన ఆరోజుల్లో తన భార్య సత్యవేణినే మోడలుగా ఉంచి ఎన్నో కళాఖండాలవంటి చిత్రాలు గీశారు. భర్తను, పురిటి కందు బిడ్డను పోగొట్టుకుని సత్యవాణి చిత్రలేఖనానికి దూరంగా మారింది.