దామోదర్ రౌత్ ఒడిశా రాష్ట్రానిక్ చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆరోగ్యం, పంచాయితీరాజ్, సహకారం, వ్యవసాయం, సంస్కృతి, ఎక్సైజ్ శాఖల మంత్రిగా పని చేశాడు.

దామోదర్ రౌత్
దామోదర్ రౌత్


వ్యక్తిగత వివరాలు

జననం (1942-07-02)1942 జూలై 2
మరణం 2024 మార్చి 22(2024-03-22) (వయసు 81)
భువనేశ్వర్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ( మార్చి 2019 - అక్టోబర్ 2019)
ఇతర రాజకీయ పార్టీలు బిజు జనతా దళ్, జనతా దళ్, జనతా పార్టీ
తల్లిదండ్రులు కపిల్ చరణ్ రౌత్
జీవిత భాగస్వామి స్నేహ రౌత్
సంతానం సంవిత్ రౌతరాయ్ (కొడుకు)
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్ అయిన రౌత్ 1970లలో రాజకీయాల్లోకి వచ్చి 1974లో ఎరసమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓట్ల తేడాతో సిపిఐ అభ్యర్థి లోక్‌నాథ్ చౌదరి చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 1977లో జనతా పార్టీ టికెట్‌పై పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. దామోదర్ రౌత్ 1977 నుండి 2014 మధ్య ఎరసమ నియోజకవర్గం నుండి ఐదుసార్లు, పరదీప్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ మంత్రిగా, నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ఆరోగ్య, పంచాయితీరాజ్, సహకార, వ్యవసాయం, సంస్కృతి & ఎక్సైజ్ శాఖల మంత్రిగా పని చేశాడు.

దామోదర్ రౌత్ 1995లో జరిగిన ఎన్నికల్లో  తిర్టోల్, ఎరాసమా నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యాడు. దామోదర్ రౌత్  2017లో బ్రాహ్మణులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మంత్రివర్గం నుండి బీజేడీ ఉపాధ్యక్షుడి పదవి నుండి 2018లో బహిష్కరించబడ్డాడు. ఆయన బీజేడీ నుండి బహిష్కరించబడిన కొన్ని నెలల తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీలో చేరి 2019 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 2019 అక్టోబర్‌లో బీజేపీ పార్టీకి రాజీనామా చేశాడు.[1] దామోదర్ రౌత్ పై బహిష్కరణను పట్నాయక్  2024 జనవరి 1న రద్దు చేశాడు.[2]

మరణం మార్చు

దామోదర్ రౌత్‌ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతూ శ్వాసకోశ సమస్యల కారణంగా మార్చి 18న భువనేశ్వర్‌లోని క్యాపిటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో మరణించాడు.[3][4][5]

మూలాలు మార్చు

  1. The Wire (18 October 2019). "Why Nobody Is Surprised That Odisha's Damodar Rout Has Found Himself Without a Party". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  2. The Hindu (1 January 2024). "BJD revokes expulsion order of Damodar Rout" (in Indian English). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  3. The New Indian Express (22 March 2024). "Veteran BJD leader and former Odisha minister Damodar Rout passes away at 81" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  4. The Hindu (22 March 2024). "Veteran Odisha leader Damodar Rout passes away" (in Indian English). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  5. Hindustan Times (22 March 2024). "Former Odisha minister Damodar Rout passes away at 81" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.