నవీన్ పట్నాయక్

ఒడిషా రాష్ట్ర 14వ ముఖ్యమంత్రి

నవీన్ పట్నాయక్ (జననం:1946 అక్టోబరు 16) ఒడిషా రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రి. అతను బిజూజనతాదళ్ రాజకీయ పార్టీ అధినేత. రచయితగా నాలుగు పుస్తకాలను ప్రచురించాడు.[2]

Naveen Patnaik
Official portrait, 2019
23rd Leader of the Opposition (LoP)
Odisha Legislative Assembly
Assumed office
19 June 2024[1]
గవర్నర్Raghubar Das
Chief MinisterMohan Charan Majhi
అంతకు ముందు వారుJayanarayan Mishra
14th Chief Minister of Odisha
In office
5 March 2000 – 11 June 2024
గవర్నర్
అంతకు ముందు వారుHemananda Biswal
తరువాత వారుMohan Charan Majhi
Member of Odisha Legislative Assembly
Assumed office
5 March 2000
అంతకు ముందు వారుUdayanath Nayak
నియోజకవర్గంHinjili
Union Minister of Mines, Government of India
In office
19 March 1998 – 4 March 2000
ప్రధాన మంత్రిAtal Bihari Vajpayee
అంతకు ముందు వారుBirendra Prasad Baishya
తరువాత వారుSunder Lal Patwa
President of Biju Janata Dal
Assumed office
26 December 1997
అంతకు ముందు వారుposition established
Member of Parliament, Lok Sabha
In office
12 April 1997 – 4 March 2000
అంతకు ముందు వారుBiju Patnaik
తరువాత వారుKumudini Patnaik
నియోజకవర్గంAska
వ్యక్తిగత వివరాలు
జననం (1946-10-16) 1946 అక్టోబరు 16 (వయసు 78)
Cuttack, Orissa, British India
(present-day Odisha, India)
రాజకీయ పార్టీBiju Janata Dal (since 1997)
ఇతర రాజకీయ
పదవులు
Janata Dal (until 1997)
తండ్రిBiju Patnaik
బంధువులుGita Mehta (sister)
Sonny Mehta (brother-in-law)
నివాసంNaveen Nivas,
Aerodrome Road, Bhubaneswar, Odisha, India
కళాశాలKirori Mal College, Delhi (BA)
నైపుణ్యం
నవీన్ పట్నాయక్
నవీన్ పట్నాయక్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2000 మార్చి 5
గవర్నరు రాజేంద్రన్
రామేశ్వర్ ఠాకూర్

ఎస్.సి. జమీర్
ముందు హేమానంద బిశ్వాల్
తరువాత Incumbent
నియోజకవర్గం హింజిలి శాసనసభ నియోజకవర్గం

భారత గనుల శాఖ మంత్రి
పదవీ కాలం
1998 మార్చి 19 – 2000 మార్చి 8
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి

పదవీ కాలం
1997 – 2000 మార్చి 8
ముందు బిజు పట్నాయక్

వ్యక్తిగత వివరాలు

జననం 1946 అక్టోబరు 16
కటక్, ఒడిశా, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (1996–98)
తల్లిదండ్రులు బిజు పట్నాయక్ (తండ్రి)
బంధువులు గీతా మెహతా (అక్క)
నివాసం నివాస్ భువనేశ్వర్
వృత్తి రచయిత, రాజకీయ నాయకుడు
మతం హిందూ
వెబ్‌సైటు Official BJD page
Chief Minister of Odisha

జీవిత విశేషాలు

అతను 1946 అక్టోబరు 16న కటక్లో జన్మించాడు. నవీన్ పట్నాయక్ ఒడిశా పూర్వపు ముఖ్యమంత్రి అయిన బిజు పట్నాయక్ కుమారుడు.[3] అతని సోదరుడు హిమాంశు పట్నాయక్.[4] పట్నాయక్ డెహ్రాడూన్ లోని ప్రతిష్ఠాత్మక వెల్‌హం బాలుర పాఠశాలలో విద్యాభ్యాసం చేసాడు. తరువాత డూన్ పాఠశాలలో చదివాడు.[5][6][7][8][9][10] డిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కిరోజీ మాల్ కళాశాలలో చేరిన తరువాత [11] బి.ఎ ఉత్తీర్ణుడయ్యాడు.[12] యువకునిగా ఉన్నప్పుడు ఒరిశా, రాజకీయాలకు దూరంగా ఒక రచయితగా ఖ్యాతి పొందాడు. అతని తండ్రి మరణం తరువాత 1997లో రాజకీయాలలోకి ప్రవేశించాడు. ఒక సంవత్సరం తరువాత బిజు జనతాదళ్ అనే పార్టీని తన తండ్రి పేరుతో స్థాపించాడు. తరువాత ఆ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించింది. నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. అతని విధానాలైన "అవినీతికి వ్యతిరేకంగా నిలబడటం", "పేదల అనుకూల విధానాలు" ఒడిశా రాష్ట్రలోఅతని పార్టీ భారీ మద్దతుతో విజయానికి సోపానాలయ్యాయి. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండటానికి దోహదపడ్డాయి. తండ్రివలె అధికార స్వామ్యం (బ్యూరోక్రసీ) ని నియంత్రించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఒక యంత్రంలా మారారు.[13] పూరీ లోని జగన్నాథస్వామి ఆరాధకుడు, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన తారా తరిణి అమ్మవారి భక్తుడు.

ఎన్నికలు - 2000

బిజూ పట్నాయక్ మరణం తరువాత జనతాదళ్ కు నాయకుడయ్యాడు.[12] అతను భారతదేశంలోని ఒడిశాకు చెందిన అస్కా లోక్‌సభ నియోజకవర్గంనకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్నికై 11 వ లోక్‌సభకు సభ్యులయ్యారు.[12] నవీన్ స్టీలు, గనుల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీకి సభ్యులుగానూ, కామర్స్ లో స్టాండిగ్ కమిటీ సభ్యులుగానూ, పార్లమెంటు లిబర్టీ కమిటి సభ్యునిగానూ పనిచేశాడు. ఒక సంవత్సరం తరువాత జనతాదళ్ పార్టీ విచ్ఛిన్నమై పట్నాయక్ "బిజూ జనతాదళ్" పేరుతో ఒక పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ జాతీయంగా బి.జె.పి సారథ్యం వహించిన "నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్.డి.ఎ)" కూటమిలో భాగస్వామి అయింది. పట్నాయక్ అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో గనుల శాఖలో మంత్రిగా పనిచేసాడు. ఒడిశా రాష్ట్ర ఎన్నికలలో బి.జె.డి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో పట్నాయక్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి 2000 లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.

ఎన్నికలు - 2004

అటల్ బిహారీ వాజపేయి, బి.జెపి ప్రజాదరణ ఫలితంగా 2004లో కూడా ఎన్.డి.ఎ విజయం సాధించింది. పట్నాయక్ ముఖ్యమంత్రిగా కొనసాగాడు. కానీ పరిపాలిస్తున్న పార్టీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ వివాదం భజరంగదళ్ ఒడిశాలోని కంధమల్ జిల్లాలో జరిగిన అల్లర్లు మూలంగా స్వామీ లక్ష్మణానంద సరస్వతి[14] హత్య జరిగిన తరువాత జరిగింది.

ఎన్నికలు - 2009

లోక్‌సభ, శాసన సభ ఎన్నికలు - 2009 లో ఆయన పార్టీ ఎన్.డి.ఎ నుండి విడిపోయి మూడవ ఫ్రంటు అయిన "లెప్ట్ ఫ్రంటు"లో కొన్ని పార్టీలతో పాటు చేరింది.[15] 2007లో క్రిస్టియన్ వ్యతిరేక అల్లర్లు కంధమై జిల్లాలో జరిగినప్పుడు దానికి బి.జె.పి పాత్ర ఉందని విమర్శించాడు. బి.జె.డి విధాన సభ, పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించింది. ఈ పార్టీ 21 లోక్‌సభ స్థానాలకు 14, 147 అసెంబ్లీ స్థానాలకు 103 స్థానాలను కైవశం చేసుకుంది. నవీన్ పట్నాయక్ 2009 మే 21 న ఒడిశా ముఖ్యమంత్రిగా మూడవసారి పదవిని అధిష్టించాడు.

ఎన్నికలు - 2014

2014 భారత సాధారణ ఎన్నికలలో, పెద్ద మెజారిటీతో నవీన్ పట్నాయక్ విజయం సాధించాడు. ఆయన పార్టీ బిజూజనతాదళ్ 21 లోక్‌సభ స్థానాలకు గానూ 20 స్థానాలను, 147 అసెంబ్లీ స్థానాకు గానూ 117 స్థానాలను కైవశం చేసుకుంది.[16] నాల్గవసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేసాడు.

భాష

నవీన్ పట్నాయక్ తన ప్రారంభ జీవితంలో అధిక కాలం ఒరిశాకు దూరంగా గడిపాడు. అతను ఒడియా భాష నేర్చుకోలేదు. భారతదేశ రాష్ట్రాల ముఖ్యమంత్రులలో స్థానిక భాష తెలియని ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తి. ఈ విషయంలో అతను విపక్షాలనుండి అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయనకు హిందీ భాష, ఫ్రెంచ్, ఆంగ్ల భాషలలో గొప్ప పాండిత్యం ఉంది. వివిధ కార్యక్రమాలలో అతను రోమన్ అక్షరాలలో వ్రాసుకొని ఒరియా భాషలో ఉపన్యాసాలనిస్తారు.[17]

వివాదాలు

అక్రమ చిట్‌ఫండు మరియ్ పోంజీ స్కీములలో భాగస్వామ్యం ఉన్నదనే ఆరోపణతో 2014 లో సి.బి.ఐ కొంతమంది బిజూ జనతాదళ్ పార్లమెంటు సభ్యులను, శాసనసభ సభ్యులను ప్రశ్నించడానికి అరెస్టు చేసింది.[18][19][20] జీవితకాల పొదుపు కొరకు లక్షల సంఖ్యలో పేదప్రజలకు జరిగిన కోట్లాది రూపాయల ఆర్థిక మోసాలకు సంబంధించి 30 కంపెనీల సంబంధం పై సి.బి.ఐ విచారణ చేపట్టింది. ఈ ఆర్థిక మోసాలకు సంబంధించి పట్నాయక్ మౌనంగా ఉన్నందున ఆయనకు అనేకమైన ఇటువంటి వ్యాపారాలు ఉన్నందున సి.బి.ఐ ప్రశ్నలను సంధించింది. అటువంటి ఒక కంపెనీ ప్రారంభోత్సవంలో నవీన్ పట్నాయక్ పాల్గొన్న ఫోటో లభించిన కారణంగా విచారణ జరిగింది.[21]

పురస్కారాలు, గుర్తింపులు

  • Naveen Patnaik was felicitated by the United Nations (UN) for an effort to evacuate nearly a million people ahead of tropical storm, Cyclone Phailin, that made a landfall on coastal Odisha in October 2013.[22]
  • Naveen Patnaik was ranked the Most Popular Chief Minister of India by India Today-ORG-Marg Mood of the Nation Poll.[23]
  • Naveen Patnaik was ranked the Second Best Performing Chief Minister by NDTV Opinion Poll.[24]

పుస్తకాలు

  • A Second Paradise: Indian Country Life 1590–1947 – Published in India, England and US
  • A Desert Kingdom: The People of Bikaner – Published in India, England and US
  • The Garden of Life: An Introduction to the Healing Plants of India- Published in India, England and US

మూలాలు

  1. Barik, Satyasundar (19 June 2024). "Naveen Patnaik elected Leader of Opposition in Odisha Assembly". The Hindu.
  2. From greenhorn to history-scripting politician, The Hindu, 18 May, 2009
  3. http://www.rediff.com/news/2000/feb/14oriss.htm
  4. – Rediff.com India News. In.rediff.com (11 March 2009). (Originally belongs to Ganjam Districth of Odisha) Retrieved on 25 December 2010.
  5. Reshmi R Dasgupta (10 May 2004). "Naveen Patnaik sets stage for GeNext Doscos – Economic Times". Articles.economictimes.indiatimes.com. Archived from the original on 7 జూలై 2012. Retrieved 21 November 2012.
  6. "Ex-Doon mates mount pressure on Naveen Niwas, Kamal rings up Pappu". Odishatoday.com. Archived from the original on 19 మే 2009. Retrieved 21 November 2012.
  7. "Doon dosti gets Naveen Rs 20,000 cr – India – DNA". Dnaindia.com. 6 August 2009. Retrieved 21 November 2012.
  8. "India's Independent Weekly News Magazine". Tehelka. Archived from the original on 29 అక్టోబరు 2012. Retrieved 21 November 2012.
  9. Sandeep Mishra (11 February 2012). "Excise minister resigns over hooch tragedy – Times of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 14 డిసెంబరు 2013. Retrieved 21 November 2012.
  10. "Naveen Patnaik: The man who would be king, or would he? – Economic Times". Articles.economictimes.indiatimes.com. 26 February 2012. Archived from the original on 12 ఏప్రిల్ 2014. Retrieved 21 November 2012.
  11. "Profile-Chief Minister of Odisha". Orissa. Gov.in. Retrieved 27 May 2012.
  12. 12.0 12.1 12.2 "Profile-Chief Minister of Orissa". Orissa. Gov.in. Retrieved 27 May 2012.
  13. For Naveen, politics is a way to complete father's agenda. Indianexpress.com (10 May 1997). Retrieved on 25 December 2010.
  14. Ram Madhav, "Local factors led to Kandhamal violence", 8 January 2008, Rediff India Abroad.
  15. Kandhamal caused BJP-BJD break-up: Naveen Patnaik – Politics News – IBNLive Archived 2014-05-18 at the Wayback Machine. Ibnlive.in.com (3 February 2010). Retrieved on 25 December 2010.
  16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-16. Retrieved 2016-09-20.
  17. "Naveen Patnaik fails language test". Archived from the original on 8 జూన్ 2014. Retrieved 17 June 2014.
  18. "In Odisha's Chit Fund Scam, Trouble for Chief Minister Naveen Patnaik".
  19. http://timesofindia.indiatimes.com/india/Odisha-chit-fund-scam-BJD-MP-two-ex-MLAs-held/articleshow/45035974.cms
  20. "Chit fund scam: CBI raids 58 places in Odisha". The Hindu. 17 August 2014.
  21. "In Odisha, More Chit Fund Trouble for the BJD".
  22. "UN citation to Naveen for Phailin evacuation". No. Business Standard. 20 December 2013. Retrieved 9 June 2014.
  23. "Naveen Patnaik voted most popular chief minister". 18 May 2010. Retrieved 13 September 2004.
  24. "NDTV Opinion Poll One Year Report Card of UPA 2". 18 May 2010. Archived from the original on 29 నవంబరు 2014. Retrieved 15 November 2014.

ఇతర లింకులు