దాలిపర్తి పిచ్చహరి

దాలిపర్తి పిచ్చహరి ప్రఖ్యాత నాదస్వర విద్వాంసుడు.

జీవిత విశేషాలు

మార్చు

కృష్ణాజిల్లా లక్ష్మీపురంలో పిచ్చహరి సంగీతవిద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆయన వృత్తిపరంగా సన్నాయిని తన తండ్రి వద్ద అభ్యసించారు. శాస్త్రీయసంగీతాన్ని ప్రముఖ సంగీతవిద్వాంసుడు, తెలుగు నాట కర్ణాటక సంగీతకారుల పరంపర తీర్చిదిద్దిన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద శిష్యరికం చేసి అభ్యసించారు.

సంగీత రంగం

మార్చు

నాదస్వర విద్వాంసునిగా ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతాల్లో పలు కచేరీలు చేసి పేరొందారు.

పిచ్చహరి వాద్య ప్రధాన లక్షణం లాలిత్యం. మధురమైన, సున్నితమైన పలుకుతో స్థాయితోపాటు హాయి పెంచుతూ ఆ నాదస్వరం వీనులవిందు చేస్తుంది. పలుకు పలుకుతున్నట్లే, గొంతు ఒదిగినట్లే పిచ్చహరి వాద్యం కూడా వీలుగా ఒదగడం విశేషం.

విశిష్టత

మార్చు

శ్రుతి బాగా తగ్గించి రెండు, ఒకటిన్నరలో వేణుగాన సుఖాన్ని కలిగిస్తూ సన్నాయి నొక్కులు నొక్కి, సొగసుగా స్వరం అనగల పాటవం పిచ్చహరి సొమ్ము. త్యాగరాజు ప్రశిష్యునిగా, తెలుగు నాట కర్ణాటక సంగీత పరంపరలో ముఖ్యమైన విద్వాంసునిగా పేరొందిన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు స్వయంగా "ఇంకా తక్కువ శ్రుతిలో వాయించడం మా పిచ్చహరి అపూర్వ ప్రజ్ఞ. పూర్వం అల్లంత దూరంలో ఉంటేగాని వినలేని నాదస్వరం ఇప్పుడు కచేరీలో కూర్చునే వినవచ్చు" అంటూ శిష్యుని ప్రశంసించి మురిసిపోయేవారు. సారమతి, ధేనుక, నీలాంబరి, శహనా వంటి తత్త్వస్ఫోరకమైన రాగాలు సన్నాయిపై ఆలపించడంలో ఆయనకు విశిష్టమైన శైలి ఉంది.[1]

మూలాలు

మార్చు
  1. ఆంధ్రసచిత్ర వారపత్రికలో తెలుగు వెలుగులు శీర్షికన 14-12-1960న దాలిపర్తి పిచ్చహరి వ్యాసం

ఇవి కూడా చూడండి

మార్చు

పారుపల్లి రామకృష్ణయ్య పంతులు