దావత్ (తెలంగాణ కథ 2017)
దావత్ అనేది సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) ప్రచురించిన పుస్తకం. తెలంగాణ కథా సిరీస్ లో భాగంగా ప్రచురించబడిన ఐదవ పుస్తకం ఇది. 2017లో వెలువడిన కథలలో నుంచి తెలంగాణ రచయితలు రాసిన 13 మంచి కథలతో ఈ సంకలనంగా వెలువడింది.[1][2]
దావత్ (తెలంగాణ కథ 2017) | |
కృతికర్త: | కథా సంకలనం |
---|---|
సంపాదకులు: | సంగిశెట్టి శ్రీనివాస్ డా. వెల్దండి శ్రీధర్ |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | కథలు |
ప్రచురణ: | సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) |
విడుదల: | 2017, నవంబరు 14 |
పేజీలు: | 128 |
సంపాదకులు
మార్చు- సంగిశెట్టి శ్రీనివాస్
- డా. వెల్దండి శ్రీధర్
కథల నేపథ్యం
మార్చుఆవయవ దానం నేపథ్యంలో 'దానం' (కె.వి. మన్ ప్రీతమ్) కథ, దున్నేవాడితే భూమి అన్న నేపథ్యంలో 'పచ్చశీర' (హుమాయిన్ సంఘీర్) కథ, రజాకార్ల అన్యాయాలు-అకృత్యాల నేపథ్యంలో 'బర్రెంత చెట్లు.. ఓ యాది' (డా. సరోజన బండ) కథ, స్త్రీ శక్తి నేపథ్యంలో 'ద్వాలి' (సమ్మెట ఉమాదేవి) కథ, సంచార జాతుల వారిని ప్రభుత్వ చేరదీసి వారికి ఉపాధిని చూపించాలనే నేపథ్యంలో 'రంగులగూడు' (వజ్జీరు ప్రదీపు) కథ, నోట్లరద్దు వల్ల సామాన్య ప్రజలు ఎంత కష్టపాడ్డారనే నేపథ్యంలో 'పెద్దనోటు' (మేరెడ్డి యాదగిరిరెడ్డి) కథ, బతుకమ్మ పండుగ-మానవ సంబంధాల నేపథ్యంలో 'తల్లిగారిల్లు' (చందు తులసి) కథ, ఆరె కటికల జీవిత నేపథ్యంలో 'లచ్చుంబాయి' (రూప్ కుమార్ డబ్బీకార్) కథ, వైద్య విద్య చదివిన విద్యార్థులు కూడా స్త్రీల పట్ల వారి శరీర ధర్మాల పట్ల చూపే అవహేళన నేపథ్యంలో 'నాలుగేళ్ళ చదువు' (వేముగంటి ధీరజ్ కశ్యప్) కథ, ముస్లిం కుటుంబాలలో భర్త ఆధిపత్యం-నిరంకుశ ధోరణులు-ఏకపక్ష విధానాల నేపథ్యంలో 'పంఛీ ఔర్ పింజ్రా' (నస్రీన్ ఖాన్) కథ, తాగుబోతు భర్త పెట్టే బాధలు పడలేక భాత్య ఆత్మహత్య చేసుకుంటే ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయోనన్న నేపథ్యంలో 'ఊరి మీద ఉరితాడు' (స్కైబాబా) కథ, అనుకోకుండా ఒక ఫంక్షన్ లో కలిసిన యువతీయువకుల మధ్య కొనసాగే దోబూచులాట నేపథ్యంలో 'బోర్లించిన చెప్పు' (పూడూరి రాజిరెడ్డి) కథ, యువతీయువకుల మధ్య సాగే ప్రేమ నేపథ్యంలో 'సముద్రం నిద్రపోదు' (కిరణ్ చర్ల) కథ రాయబడ్డాయి.[3]
విషయసూచిక
మార్చుక్రమసంఖ్య | కథ పేరు | రచయిత పేరు |
---|---|---|
1 | దానం | కె.వి. మన్ ప్రీతమ్ |
2 | పచ్చశీర | హుమాయిన్ సంఘీర్ |
3 | బర్రెంత చెట్లు.. ఓ యాది | డా. సరోజన బండ |
4 | ద్వాలి | సమ్మెట ఉమాదేవి |
5 | రంగులగూడు | వజ్జీరు ప్రదీపు |
6 | పెద్దనోటు | మేరెడ్డి యాదగిరిరెడ్డి |
7 | తల్లిగారిల్లు | చందు తులసి |
8 | లచ్చుంబాయి | రూప్ కుమార్ డబ్బీకార్ |
9 | నాలుగేళ్ళ చదువు | వేముగంటి ధీరజ్ కశ్యప్ |
10 | పంఛీ ఔర్ పింజ్రా | నస్రీన్ ఖాన్ |
11 | ఊరి మీద ఉరితాడు | స్కైబాబ |
12 | బోర్లించిన చెప్పు | పూడూరి రాజిరెడ్డి |
13 | సముద్రం నిద్రపోదు | కిరణ్ చర్ల |
ఆవిష్కరణ
మార్చు2018, నవంబరు 14న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది.
మూలాలు
మార్చు- ↑ Eenadu (2019-03-31). "కథల దావత్ (ఆదివారం అనుబంధం)". EENADU (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-31. Retrieved 2022-05-31.
- ↑ "దావత్ - తెలంగాణ కథ - 2017". lit.andhrajyothy.com. Archived from the original on 2022-05-31. Retrieved 2022-05-31.
- ↑ కె.పి., అశోక్ కుమార్ (2018-11-25). "దావత్ చేసిన తెలుగు కథ". www.sanchika.com. Archived from the original on 2021-05-04. Retrieved 2022-05-31.