ప్రధాన మెనూను తెరువు

సుందరయ్య విజ్ఞాన కేంద్రము

(సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి దారిమార్పు చెందింది)
సుందరయ్య విజ్ఞాన కేంద్రము

సుందరయ్య విజ్ఞాన కేంద్రము (ఆంగ్లం: Sundarayya Vignana Kendram) 1988లో హైదరాబాదులో స్థాపించబడింది. కమ్యూనిష్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య యొక్క సొంత సేకరణలతో ప్రారంభమైన ఈ గ్రంథాలయము ఆ తరువాత బెజవాడ గోపాలరెడ్డి, ఆరుద్ర, దాశరధి వంటి అనేకమంది ఇతరుల యొక్క సొంత సేకరణలు కూడా కలుపుకొని అభివృద్ధి చెందినది. వామపక్ష రాజకీయ కార్యకర్తలు మరియు రచయితల సొంత రచనలు ఈ సేకరణలో ప్రత్యేకత. కేవలము సుందరయ్య రచనలే దాదాపు లక్ష పుటలకు పైగా ఉన్నాయి. పరిశోధనా గ్రంథాలయములో 75,000 కు పైగా తెలుగు మరియు ఆంగ్లములో ముద్రితమైన సంపుటిలు ఉన్నాయి. ఈ కేంద్రము ఉర్దూ పరిశోధనా గ్రంథాలయము పేరిట ఉర్దూ పుస్తముల సేకరణలు కూడా భద్రపరుస్తున్నది. దక్షిణ ఆసియాలోనే అద్వితీయమైన ఈ సేకరణలో 17వ శతాబ్దము నుండి ముద్రితమైన 30,000 పుస్తకాలు, జర్నల్లు, పత్రికలు, మాన్యుస్క్రిప్టులు ఉన్నాయి.

బయటి లింకులుసవరించు