దావీదు (1040–970 BC) (Hebrew: דָּוִד): బైబిల్ లో సమూయేలు గ్రంధములో వ్రాయబడిన ప్రకారము దావీదు ఇశ్రాయేలు, యూదా సమైఖ్య రాజ్యానికి 2వ రాజు. దావీదు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 1040–970 BC మధ్య పరిపాలించాడు.[1]  మత్తయి సువార్త, లూకా సువార్త ప్రకారం యేసు క్రీస్తు యొక్క వంశావళికి మూలపురుషుడు.

సౌలు మరణించిన తరువాత మొదట యూదా వారి మీద రాజుగా ఉండి తరువాత ఇశ్రాయేలు రాజు ఇష్బోషెతు(సౌలు కుమారుడు) మరణానంతర పరిణామములలో సమైఖ్య పరచబడిన రెండు రాజ్యములకు రాజుగా ఉండెను. బైబిల్ లో వ్రాయబడిన ప్రకారము, యౌవన కాలములో గొర్రెల కాపరిగా ఉన్న దావీదు తరువాత సంగీతకారునిగాను, ప్రత్యర్ధి గొలియాతును చంపడము వలన బహు కీర్థి గడించెను. రాజైన సౌలుకు ఇష్టుడుగాను, సౌలు కుమారుడైన యోనాతానుకు ఆప్త మిత్రుడుగాను ఉండెను. తరువాత దావీదునకు కలిగిన కీర్తిని బట్టి, దేవుడు అతనికి తోడుగా ఉండుటను బట్టి, ఒకవేళ దావీదు తన రాజ్య సింహాసనమును తీసికొనునేమో అని సౌలు భయపడి దావీదు మీద విషపు చూపు నిలిపెను.  సౌలు, యోనాతాను యుద్ధములో హతమైన తర్వాత దావీదు యెరూషలేమును స్వాధీనపరచుకొని, దేవుని మందసమును పట్టణములోనికి తీసుకొని వచ్చి, సౌలుచే స్థాపించబడిన రాజ్యమును విస్తరింప చేసెను.

రాజుగా, దావీదు చేసినటువంటి ఘోర తప్పిదము బత్సెబా యెడల జరిగించినటువంటి వ్యభిచారము, ఆమె భర్త అయిన ఊరియాను హత్య గావించుటకు పురికొల్పెను. దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదునకు తప్పు గుర్తు చేసి హెచ్చరించగా, దావీదు పశ్చాత్తపపడెను. దావీదు చేసిన పాపమును బట్టి దేవుడు దావీదును శిక్షించెను. దావీదు కుమారుడైన అబ్షాలోము తండ్రికి విరోధముగా లేచి అతని సింహాసనమును లోపరచుకొనడానికి ప్రయత్నము చెసెను. అబ్షాలోము నుండి తప్పించుకొన్నవాడై, దావీదు జెరూషలేము వీడి, మరలా అబ్షాలోము మరణము తర్వాత యెరూషలేము తిరిగి వచ్చి ఇశ్రాయేలును యేలనారంభించెను. దావీదు ఇశ్రాయేలు రాజ్యమును స్థిరపరచుటలో అనేక యుద్ధములు చేసెను. రక్తసిక్త కార్యములొనరించుట వలన, దేవుని మదిరమును కట్టుటకు దావీదును దేవుడు నిరాకరించెను. దావీదు మరణించక ముందు సొలోమోనును తన వారసునిగా ఎన్నుకొనెను. దేవుని యందు దావీదు చూపిన హృదయ పూర్వక విధేయతను, భక్తిని బట్టి, ఆదర్శమైన రాజుగా గౌరవించబడెను. రాబోయే మెస్సీయ దావీదు వంశావళి నుండి వచ్చునని ప్రవచనాత్మకముగా అనేక లేఖనములలో ప్రవచించబడెను. దావీదు రాసిన కీర్తనలు దేవుని యందు అతనికి గల హృదయ స్థితిని తెలియ జేయును.  

Ancient Near East కు చెందిన చరిత్రకారులను బట్టి దావీదు 1000 BCE సమయములో జీవించి ఉండవచ్చు అని పేర్కొన్నారు, ఇది చరిత్రలో దావీదు యొక్క అస్థిత్వమునకు ఆధారము. మొదట్లో చారిత్రకమైన ఆధారము లేనప్పటికిని, దమస్కు రాజు ఇద్దరు శత్రు రాజులపైన తన యొక్క విజయమునకు జ్ఞాపకార్ధముగా ప్రతిష్టించిన శిలాఫలకము Tel Dan Stele పై పేర్కొన్న హీబ్రూ పద సమూహము ביתדוד‎, bytdwd ను బట్టి దావీదు యొక్క అస్తిత్వము రూఢీపరచబడినది. పండితులు దీని భాషాంతర అర్ధము "House of David"గా తర్జుమా చేసారు.  అయినప్పటికిని Ancient Near East చరిత్రకారులు బైబిల్ లో పేర్కొన్న సమైఖ్య సామ్రాజ్యమును గూర్చిన సందేహ నివృత్తి గావించలేకపోయెను.      

యూదుల యొక్క లిఖిత, మౌఖిక సంప్రదాయల్లో, బైబిలి లోని నూతన నిభంధనలో దావీదును గూర్చి అధికముగా ప్రస్తావించబడింది. ఆది క్రైస్తవులు యేసు క్రీస్తు యొక్క జీవితమును దావీదు, మెస్సీయాల సూచనలతో సరిపోల్చారు. ఆది క్రైస్తవులు యేసు క్రీస్తు యొక్క జీవితమును దావీదు, మెస్సీయాల సూచనలతో సరిపోల్చారు. యేసు దావీదు వంశావళిలో నుండి వచ్చినట్టు బైబిల్ లో పేర్కొనబడినది. కురాన్ లో, ఇస్లామిక్ యొక్క లిఖిత, మౌఖిక సంప్రదాయల్లో కూడా దావీదును గూర్చి ప్రస్తావించబడినది. శతాబ్ధాలుగా దావీదు యొక్క వ్యక్తిత్వము, స్వభావము అన్ని సాహిత్యములలో, కళలలో స్పూర్థిమంతమైన పాత్రగా ఉపయోగించబడుతున్నది.  


మూలాలు మార్చు

  1. Carr, David M. & Conway, Colleen M., An Introduction to the Bible: Sacred Texts and Imperial Contexts, John Wiley & Sons (2010), p. 58

లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దావీదు&oldid=3802975" నుండి వెలికితీశారు