దిగంబర్ బెహెరా
దిగంబర్ బెహెరా (జననం 1953) భారతదేశంలోని ఒడిశా లోని కటక్ కు చెందిన వైద్యుడు.[1] ఆయన పల్మనరీ వ్యాధులలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2020లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.[2][3]
విద్య
మార్చుబెహెరా 1978లో ఎస్సిబి మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్, 1981లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐ) చండీగఢ్ నుండి ఎండి పూర్తి చేశారు.[1]
వృత్తి జివితం
మార్చు1978లో బెహెరా పిజిఐలోని మెడిసిన్ విభాగంలో జూనియర్ రెసిడెంటుగా చేరారు. ఆయన 2000 నుండి పల్మనరీ మెడిసిన్ విభాగానికి సీనియర్ ప్రొఫెసరుగా బోధిస్తున్నారు. 2014లో పల్మనరీ మెడిసిన్ విభాగానికి అధిపతిగా, 2017లో కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి రెండేళ్ల పొడిగింపుతో పల్మనరీ రీసెర్చ్ విభాగం డీన్ గా నియమితులయ్యారు.[1][4]
2011లో ఆయన పిజిఐ డైరెక్టర్ అయ్యారు. ఆయన నేషనల్ ట్యూబర్‌కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాంకు, ఇండియన్ ట్యూబర్‌కులోసిస్ రీసెర్చ్ కన్సార్టియం క్రింద ఉన్న కొన్ని విభాగాలకు ఛైర్మనుగా ఉన్నారు.[4]
ఆయన అమెరికన్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజిషియన్స్, నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆసియా పసిఫిక్ సొసైటీ ఆఫ్ రెస్పిరాలజీలో ఫెలోగా ఉన్నారు. ఆయన ఇండియన్ జర్నల్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్ అండ్ అలైడ్ సైన్సెస్ అండ్ ఇండియన్ జర్నల్ అఫ్ ట్యూబర్‌కులోసిస్ సంపాదకీయ బోర్డులో ఉన్నారు. అతను ఇండియన్ స్టడీ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా.[5][1]
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "Dr Behera, lung cancer specialist, gets Padma Shri". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2020-04-14.
- ↑ "गरीबी से लड़के लंग कैंसर विशेषज्ञ बनने वाले डॉ. दिगंबर बेहरा पद्मश्री से आभूषित". KhabarTak (in హిందీ). 26 January 2020. Archived from the original on 11 ఏప్రిల్ 2020. Retrieved 17 జూలై 2024.
- ↑ "आनंद महिंद्रा सहित 11 कारोबारियों को पद्म पुरस्कार". Bhaskar (in హిందీ). 26 January 2020.
- ↑ 4.0 4.1 4.2 Kanwar, Shimona (January 25, 2020). "Dr Digambar Behera of PGIMER selected for Padma award". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-04-14.
- ↑ "Chandigarh PGIMER doctor, 'langar baba' on Padma Shri list". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-01-26. Retrieved 2020-04-14.
- ↑ "Dr D Behera receives Dr PRJ Gangadharam award". www.mgims.ac.in. Retrieved 2020-04-14.
- ↑ "The Karel Styblo Public Health Prize". The Union (in ఇంగ్లీష్). Retrieved 2020-04-14.