దిముత్ కరుణరత్నే

శ్రీలంక క్రికెటర్

ఫ్రాంక్ దిముత్ మధుశంక కరుణరత్నే (జననం 1988, ఏప్రిల్ 21), శ్రీలంక క్రికెటర్, శ్రీలంక టెస్టు క్రికెట్ జట్టుకు ప్రస్తుత కెప్టెన్, గతంలో వన్డేలకు కెప్టెన్‌గా ఉన్నాడు.[1] ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు ఓపెనర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. టెస్టు క్రికెట్‌, వన్డేల్లో శ్రీలంకకు ఓపెనర్‌గా నిలిచాడు. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడతాడు.[2][3]

దిముత్ కరుణరత్నే
దిముత్ కరుణరత్నే (2022)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫ్రాంక్ దిముత్ మధుశంక కరుణరత్నే
పుట్టిన తేదీ (1988-04-21) 1988 ఏప్రిల్ 21 (వయసు 36)
కొలంబో, శ్రీలంక
మారుపేరుదిమ్మా, కెప్టెన్ కూల్
ఎత్తు6 అ. 0 అం. (1.83 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్రOpening batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 123)2012 నవంబరు 17 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2023 జూలై 24 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 146)2011 జూలై 9 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2023 జూలై 2 - జింబాబ్వే తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008–presentసింహళీస్ స్పోర్ట్స్ క్లబ్
2009Basnahira North
2010Wayamba
2022యార్క్‌షైర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 88 44 194 160
చేసిన పరుగులు 6,631 1,248 14,604 4,977
బ్యాటింగు సగటు 40.93 34.66 46.36 36.06
100లు/50లు 16/34 1/11 46/65 7/33
అత్యుత్తమ స్కోరు 244 103 244 132
వేసిన బంతులు 308 16 828 82
వికెట్లు 2 0 4 3
బౌలింగు సగటు 99.50 125.00 21.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/12 1/6 2/13
క్యాచ్‌లు/స్టంపింగులు 56/– 11/– 172/1 70/-
మూలం: ESPNcricinfo, 27 July 2023

2015 నుండి, కరుణరత్నే టెస్ట్ మ్యాచ్‌ల రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం వల్ల టెస్టుల్లో శ్రీలంక తరఫున అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా మారాడు.[4] చాలామంది వ్యాఖ్యాతలు ఇతన్ని సెకండ్ ఇన్నింగ్స్ స్పెషలిస్ట్‌గా అభివర్ణించారు.[5] 2017 అక్టోబరు వరకు చేసిన ఆరు సెంచరీలలో రెండవ ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు సాధించాడు.[6] 2017 అక్టోబరు 7న తిలకరత్నే దిల్షాన్ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు టెస్టు సెంచరీలు సాధించిన రెండో శ్రీలంక ఓపెనర్‌గా కరుణరత్నే నిలిచాడు. 2019 ఫిబ్రవరిలోదక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం శ్రీలంక టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[7]

2019 ఏప్రిల్ లో శ్రీలంక క్రికెట్ 2019 క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు లసిత్ మలింగ స్థానంలో దిముత్ కరుణరత్నేను జట్టు కొత్త వన్డే అంతర్జాతీయ కెప్టెన్‌గా నియమించింది.[8] క్రికెట్ ప్రపంచ కప్‌లో రిడ్లీ జాకబ్స్ తర్వాత తన బ్యాట్‌ని మోసిన ఏకైక బ్యాట్స్‌మెన్ ఇతడే.[9]


2022లో యార్క్‌షైర్‌ తరఫున బ్యాటింగ్‌ చేస్తున్న కరుణరత్నే

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

కరుణరత్నే 2012 చివరిలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ లో గాలేలో జరిగిన సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో అరంగేట్రం చేసాడు, మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. అయితే, అతను రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్ధ సెంచరీతోపాటు విజయవంతమైన పరుగులను కొట్టి బలంగా వెనుదిరిగాడు.[10]

2014 డిసెంబరు 28న క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో న్యూజిలాండ్‌పై తొలి టెస్టు సెంచరీని సాధించాడు. శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో రెండో మ్యాచ్‌లో 363 బంతుల్లో 152 పరుగులు చేశాడు. అతను సెంచరీ చేసినప్పటికీ, శ్రీలంక మ్యాచ్‌లో ఓడిపోయింది.

కరుణరత్నే 2015 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ కోసం అసలు జట్టులో ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో, ఇతని కుడి చేతిలో ఎముక విరిగింది. మ్యాచ్ తర్వాత జట్టు నుండి తొలగించబడ్డాడు. ఇతని స్థానంలో కుశాల్ పెరీరాను తీసుకున్నారు.[11]

 
2019లో మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో దిముత్ కరుణరత్నే

మూలాలు

మార్చు
  1. Gardner, Ben (17 January 2021). "Lahiru Thirimanne: From Worst Batsman In History To Test Centurion In The Space Of Three Days". Wisden Asia Cricket.
  2. "Dimuth Karunaratne: Sri Lanka". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  3. Tripathi, Divi (21 November 2021). "Let's be Frank, Dimuth Karunaratne is one of the very best Test openers in the world". Wisden Asia Cricket.
  4. Samiuddin, Osman (7 October 2017). "Inside the heart of a Karunaratne classic". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  5. Hinz, Kristopher (1 June 2019). "Karunaratne's patient presence". Island Cricket. Archived from the original on 2019-07-07. Retrieved 2023-08-25.
  6. "Second Innings wonder by Karunaratne". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  7. "Sri Lanka drop Chandimal for South Africa tour, Karunaratne made captain". ESPNcricinfo. ESPN Inc. 5 October 2019. Retrieved 2023-08-25.
  8. "Dimuth Karunratne to lead Sri Lanka during ICC Cricket World Cup 2019". Sri Lanka Cricket. 18 April 2019. Retrieved 2023-08-25.
  9. "World Cup 2019: Dimuth Karunaratne becomes only the second player to carry his bat in a World Cup match". The Indian Express. 1 June 2019. Retrieved 2023-08-25.
  10. "1st Test: Sri Lanka v New Zealand at Galle, Nov 17–19, 2012". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  11. "Dimuth Karunaratne Injured". Sri Lanka Cricket. 5 March 2015. Archived from the original on 6 September 2015.