న్యూజీలాండ్ క్రికెట్ జట్టు

న్యూజీలాండ్ దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు

న్యూజీలాండ్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. బ్లాక్ క్యాప్స్ అని దీనికి పేరు. 1930లో ఇంగ్లండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో తమ మొదటి టెస్టు ఆడారు. టెస్టు క్రికెట్ ఆడిన ఐదవ దేశం అది. 26 ఏళ్ళ తరువాత, 1956 లో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో తొట్ట తొలి టెస్టు విజయం సాధించారు.[13] న్యూజీలాండ్ తమ మొదటి వన్‌డేని 1972-73 సీజన్‌లో పాకిస్తాన్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో ఆడారు.

న్యూజిలాండ్
దస్త్రం:Logo of cricket New zealand Team.png
మారుపేరుబ్లాక్ క్యాప్స్,[1] కివీస్[2]
అసోసియేషన్న్యూజీలాండ్ క్రికెట్
వ్యక్తిగత సమాచారం
టెస్టు కెప్టెన్టిమ్ సౌథీ
ఒన్ డే కెప్టెన్కేన్ విలియమ్‌సన్
Tట్వంటీ I కెప్టెన్కేన్ విలియమ్‌సన్
కోచ్గ్యారీ స్టెడ్
చరిత్ర
టెస్టు హోదా పొందినది1930
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదాపూర్తి సభ్యత్వం (1926)
ICC ప్రాంతంఐసిసి తూర్పు ఆసియా-పసిఫిక్
ఐసిసి ర్యాంకులు ప్రస్తుత[6] అత్యుత్తమ
టెస్టులు 5వ 1వ (6 జనవరి 2021)[3]
వన్‌డే 5వ 1వ (3 మే 2021)[4]
టి20ఐ 3వ 1వ (4 మే 2016)[5]
టెస్టులు
మొదటి టెస్టుv.  ఇంగ్లాండు లాంకాస్టర్ పార్క్ (క్రైస్ట్‌చర్చ్) లో; 1930 జనవరి 10-13
చివరి టెస్టుv.  శ్రీలంక బేసిన్ రిజర్వ్, (వెల్లింగ్టన్) లో; 2023 మార్చి 17–20
టెస్టులు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[7] 464 112/182
(170 డ్రాలు)
ఈ ఏడు[8] 5 3/1 (1 డ్రా)
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో పోటీ2 (first in 2019–21)
అత్యుత్తమ ఫలితంఛాంపియన్స్ (2019–21)
వన్‌డేలు
తొలి వన్‌డేv.  పాకిస్తాన్ లాంకాస్టర్ పార్క్, క్రైస్ట్‌చర్చ్ వద్ద; 1973 ఫిబ్రవరి 11
చివరి వన్‌డేv.  భారతదేశం వాంఖెడే స్టేడియం (ముంబయి) లో; 2023 నవంబరు 15
వన్‌డేలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[9] 821 377/394
(7 టైలు, 43 ఫలితం తేలలేదు)
ఈ ఏడు[10] 30 13/16
(0 టైలు, 1 ఫలితం తేలనివి)
పాల్గొన్న ప్రపంచ కప్‌లు13 (first in 1975)
అత్యుత్తమ ఫలితంరన్నరప్ (2015, 2019)
ట్వంటీ20లు
తొలి టి20ఐv.  ఆస్ట్రేలియాఈడెన్ పార్క్, (ఆక్లాండ్) లో; 2005 ఫిబ్రవరి 17
చివరి టి20ఐv.  ఇంగ్లాండు ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్; 2023 సెప్టెంబరు 5
టి20ఐలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[11] 200 102/83
(10 టైలు, 5 ఫలితం తేలనివి)
ఈ ఏడు[12] 18 9/7
(1 టైలు, 1 ఫలితం తేలనిది)
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ7 (first in 2007)
అత్యుత్తమ ఫలితంరన్నరప్ (2021)

Test kit

ODI kit

T20I kit

As of 2023 నవంబరు 15

2022 డిసెంబర్‌లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో టీ20ఐలో కేన్ విలియమ్సన్ ప్రస్తుత జట్టు కెప్టెన్, టిమ్ సౌథీ ప్రస్తుత టెస్టు కెప్టెన్. జాతీయ జట్టును న్యూజీలాండ్ క్రికెట్ నిర్వహిస్తుంది.

1998 జనవరిలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టును బ్లాక్‌క్యాప్స్‌గా పిలుస్తున్నారు. అప్పట్లో జట్టు స్పాన్సరైన క్లియర్ కమ్యూనికేషన్స్, జట్టుకు ఒక పేరును ఎంచుకోవడానికి ఒక పోటీని నిర్వహించగా ఈ పేరు ఎంపికైంది.[14] ఆల్ బ్లాక్స్‌కు సంబంధించిన అనేక జాతీయ జట్టు మారుపేర్లలో ఇది ఒకటి.

2022 నవంబరు 25 నాటికి, న్యూజీలాండ్ 1429 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 566 గెలిచింది, 635 ఓడిపోయింది. 16 టై, 168 డ్రాలూ అయ్యాయి. 44 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. [15] ఐసీసీ ప్రకారం న్యూజీలాండ్ టెస్టుల్లో 5వ స్థానంలో, వన్డేల్లో 1వ స్థానంలో, టీ20 ల్లో 5వ స్థానంలో ఉంది. [16]

2022 నాటికి జట్టు, 1975 నుండి జరిగిన మొత్తం 29 ఐసిసి పురుషుల ఈవెంట్‌లలోనూ పాల్గొంది. ఆరు ఫైనల్ మ్యాచ్‌లు ఆడి, రెండు టైటిళ్లను గెలుచుకుంది. 2000 అక్టోబరులో భారత్‌ను ఓడించి నాకౌట్ ట్రోఫీని గెలుచుకుంది. అది వారి తొలి ఐసిసి టైటిల్. 2015 లో దక్షిణాఫ్రికాను ఓడించి, న్యూజీలాండ్ తమ తొలి CWC ఫైనల్‌కు చేరుకుంది.[17] తర్వాతి ఎడిషన్‌లో భారత్‌ను ఓడించి వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. [18] తర్వాత 2021 జూన్‌లో వారు భారతదేశాన్ని ఓడించి ప్రారంభ WTCని గెలుచుకుంది. ఐదు నెలల తర్వాత వారు ఇంగ్లండ్‌ను ఓడించి, తమ తొలి T20 WC ఫైనల్‌కు చేరుకుంది.

చరిత్ర

మార్చు

న్యూజీలాండ్‌లో క్రికెట్ ప్రారంభం

మార్చు

హెన్రీ విలియమ్స్ న్యూజీలాండ్‌లో క్రికెట్ ఆటపై మొదటి నివేదిక ఇవ్వడంతో ఇక్కడి క్రికెట్ చరిత్రను రికార్డు చెయ్యడం మొదలైంది. అతను 1832 డిసెంబరులో 1832లో తన డైరీలో హోరోటుటు బీచ్‌లోని పైహియా, చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలు క్రికెట్ ఆడుతున్నట్లు వ్రాసాడు. 1835లో, చార్లెస్ డార్విన్, HMS బీగల్‌లో చేసిన భూప్రదక్షిణలో బే ఆఫ్ ఐలాండ్స్‌లోకి ప్రవేశించాడు. వైమేట్ నార్త్‌లో డార్విన్, విముక్తి పొందిన మావోరీ బానిసలు, ఒక మిషనరీ కుమారుడు క్రికెట్ ఆడుతూండగా చూశాడు. ది వాయేజ్ ఆఫ్ ది బీగల్‌లో డార్విన్ ఇలా వ్రాశాడు: [19]

బానిసత్వం నుండి మిషనరీలు విమోచన చేసిన అనేక మంది యువకులను పొలం పనుల్లో పెట్టారు. సాయంత్రం వాళ్ళు క్రికెట్‌ ఆడుతూండగా చూశాను.

న్యూజీలాండ్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌ 1842 డిసెంబరులో వెల్లింగ్‌టన్‌లో జరిగింది. వెల్లింగ్టన్ క్లబ్ కు చెందిన "రెడ్" జట్టు, "బ్లూ" జట్టు ఆడిన ఆ ఆట గురించి వెల్లింగ్టన్ స్పెక్టేటర్ 1842 డిసెంబరు 28 న ప్రచురించింది. 1844 మార్చిలో సర్వేయర్‌లు, నెల్సన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ గురించి ఎగ్జామినర్‌ పత్రిక పూర్తిగా రాసింది.

న్యూజీలాండ్‌లో పర్యటించిన మొదటి జట్టు 1863-64లో పార్ నేతృత్వం లోని ఆల్ ఇంగ్లాండ్ XI. 1864 - 1914 మధ్య, 22 విదేశీ జట్లు న్యూజీలాండ్‌లో పర్యటించాయి. ఇంగ్లండ్ 6 జట్లను, ఆస్ట్రేలియా 15, ఫిజీ ఒకటి జట్లను పంపాయి.

మొదటి జాతీయ జట్టు

మార్చు

1894 ఫిబ్రవరి 15-17 మధ్య న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించే మొదటి జట్టు క్రైస్ట్‌చర్చ్‌లోని లాంకాస్టర్ పార్క్‌లో న్యూ సౌత్ వేల్స్‌తో ఆడింది. న్యూ సౌత్ వేల్స్ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1895-96లో న్యూ సౌత్ వేల్స్ మళ్లీ వచ్చింది. అప్పుడు ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌ను న్యూజీలాండ్ 142 పరుగుల తేడాతో గెలుచుకుంది. అది దాని మొదటి విజయం. 1894 చివరిలో న్యూజీలాండ్ క్రికెట్ కౌన్సిల్ ఏర్పడింది.

న్యూజీలాండ్ తన మొదటి రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లను (టెస్టులు కాదు) 1904-05లో విక్టర్ ట్రంపర్, వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, క్లెమ్ హిల్ వంటి స్టార్లతో కూడిన ఆస్ట్రేలియా జట్టుతో ఆడింది. మొదటి మ్యాచ్‌లో వర్షం, న్యూజీలాండ్‌ను పరాజయం నుండి కాపాడింది. రెండవ దానిలో న్యూజీలాండ్, ఇన్నింగ్స్ 358 పరుగుల తేడాతో ఓడిపోయింది. న్యూజీలాండ్ ఫస్ట్-క్లాస్ చరిత్రలో ఇది రెండవ అతిపెద్ద ఓటమి.

1945/46లో ఆస్ట్రేలియాతో జరిగినది, యుద్ధం తర్వాత న్యూజీలాండ్‌ ఆడిన తొలి టెస్టు. ఆ సమయంలో ఆ గేమ్‌ను "టెస్టు"గా పరిగణించలేదు. కానీ 1948 మార్చిలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీనికి టెస్టు హోదా ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో కనిపించిన న్యూజీలాండ్ ఆటగాళ్ళు బహుశా ఈ ఐసిసి చర్య వలన పెద్దగా సంతోషపడకపోవచ్చు- ఎందుకంటే న్యూజీలాండ్ ఆ మ్యాచ్‌లో 42, 54 పరుగులకు ఆలౌటైంది. పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు తగిన భత్యం చెల్లించడానికి న్యూజీలాండ్ క్రికెట్ కౌన్సిల్ ఇష్టపడకపోవడంతో, 1929 - 1972 మధ్య న్యూజీలాండ్‌తో ఆస్ట్రేలియా ఇది తప్ప మరి టెస్టులేమీ ఆడలేదు.

1949లో న్యూజీలాండ్ తన అత్యుత్తమ జట్లను ఇంగ్లాండ్‌కు పంపింది. ఇందులో బెర్ట్ సట్‌క్లిఫ్, మార్టిన్ డోన్నెల్లీ, జాన్ ఆర్. రీడ్, జాక్ కౌవీ ఉన్నారు. అయితే, ఆ టెస్టులు 3-రోజుల మ్యాచ్‌లు అవడం వలన మొత్తం 4 టెస్టులూ డ్రా అయ్యాయి. 1949 ఇంగ్లాండ్ పర్యటనను న్యూజీలాండ్ చేసిన అత్యుత్తమ పర్యటన ప్రదర్శనలలో ఒకటిగా చాలా మంది పరిగణిస్తారు. నాలుగు టెస్టులు డ్రా అయినప్పటికీ వాటన్నిటిలో అత్యధిక స్కోర్లు నమోదయ్యాయి. లార్డ్స్‌లో మార్టిన్ డోన్నెల్లీ చేసిన 206 పరుగులు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా ప్రశంసించబడింది. [20] గెలవలేకపోయినా, న్యూజీలాండ్ ఒక టెస్టులో కూడా ఓడిపోలేదు. దీనికి ముందు, డాన్ బ్రాడ్‌మాన్ నేతృత్వంలోని 1948 నాటి ఆస్ట్రేలియా జట్టు మాత్రమే దీనిని సాధించింది.

న్యూజీలాండ్, 1951-52లో వెస్టిండీస్‌తో, 1955/56లో పాకిస్తాన్, భారత్‌లతో తన మొదటి మ్యాచ్‌లను ఆడింది.

న్యూజీలాండ్ 1954/55లో ఇంగ్లండ్‌పై 26 పరుగులకు ఆలౌటై, అత్యల్ప ఇన్నింగ్స్ స్కోరును నమోదు చేసింది. తర్వాతి సీజన్‌లో తొలి టెస్టు విజయం సాధించింది. 4 టెస్టుల సిరీస్‌లో మొదటి 3 టెస్ట్‌లను వెస్టిండీస్ సులభంగా గెలుచుకుంది. నాల్గవ టెస్టులో తన మొదటి టెస్టు విజయాన్ని సాధించింది. ఇది సాధించడానికి వారికి 45 మ్యాచ్‌లు, 26 సంవత్సరాలూ పట్టింది.

తర్వాతి 20 ఏళ్లలో న్యూజీలాండ్ మరో ఏడు టెస్టుల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ కాలంలో చాలా వరకు ఇద్దరు అద్భుతమైన బ్యాట్స్‌మెన్లైన బెర్ట్ సట్‌క్లిఫ్, గ్లెన్ టర్నర్, జాన్ రీడ్‌ వంటి గొప్ప ఆల్-రౌండరు జట్టులో ఉన్నప్పటికీ, వారి దాడికి నాయకత్వం వహించే క్లాస్ బౌలర్ లేడు.

రీడ్ 1961-62లో దక్షిణాఫ్రికా పర్యటనలో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అక్కడ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రా అయింది. మూడు, ఐదో టెస్టుల్లో సాధించిన విజయాలు న్యూజీలాండ్ సాధించిన తొలి విదేశీ విజయాలు. రీడ్ ఈ పర్యటనలో 1,915 పరుగులు చేసి, దక్షిణాఫ్రికాలో పర్యటించిన బ్యాటర్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును నెలకొల్పాడు. [21]

న్యూజీలాండ్ 1969/70లో పాకిస్తాన్ పర్యటనలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. [22] దాదాపు 40 ఏళ్ల తర్వాత 30 సిరీస్‌ల తరువాత న్యూజీలాండ్‌ తొలి సిరీస్‌ విజయం అందుకుంది. [23]

1970 నుండి 2000 వరకు

మార్చు
 
స్కోర్‌బోర్డ్ - బేసిన్ రిజర్వ్ ఫిబ్రవరి 1978. ఇంగ్లండ్‌పై NZ తొలి విజయం

1973లో రిచర్డ్ హ్యాడ్లీ జట్టు లొకి ప్రవేశించాడు. అతని రాకతో, న్యూజీలాండ్ టెస్టుల్లో గెలిచే రేటు నాటకీయంగా పెరిగింది. 1990లో రిటైరయ్యే ముందు న్యూజీలాండ్ తరపున 86 టెస్టులు ఆడిన హాడ్లీ, అతని తరంలోని అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడుగా పేరుపొందాడు. హాడ్లీ ఆడిన 86 టెస్టుల్లో న్యూజీలాండ్‌, 22 గెలిచుకుని 28 ఓడిపోయింది. 1977/78లో న్యూజీలాండ్ 48వ ప్రయత్నంలో ఇంగ్లండ్‌పై తన మొదటి టెస్టును గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో హాడ్లీ 10 వికెట్లు పడగొట్టాడు.

1980లలో న్యూజీలాండ్ తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన మార్టిన్ క్రోతో పాటు, జాన్ రైట్, బ్రూస్ ఎడ్గార్, జాన్ ఎఫ్. రీడ్, ఆండ్రూ జోన్స్, జియోఫ్ హోవార్త్, జెరెమీ కోనీ, ఇయాన్ స్మిత్, జాన్ బ్రేస్‌వెల్, లాన్స్ కెయిర్న్స్, స్టీఫెన్ బూక్, ఎవెన్ చాట్‌ఫీల్డ్ వంటి అనేక మంది మంచి ఆటగాళ్ళు ఆడారు. వారు అప్పుడప్పుడు మ్యాచ్‌ను గెలిపించగల ఆట ఆడగల సామర్థ్యం ఉన్నవారు. స్థిరంగా ఆడి మ్యాచ్‌కు విలువైన సహకారం అందించేవారు.

న్యూజీలాండ్ జట్టు లోని ఇద్దరు స్టార్ ప్లేయర్లు (రిచర్డ్ హాడ్లీ, మార్టిన్ క్రోవ్) మ్యాచ్ గెలిపించే ప్రదర్శనలు చెయ్యగా, ఇతర ఆటగాళ్ళు మంచి సహకారాన్ని అందించడానికి, 1985 లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ఉత్తమ ఉదాహరణ. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో హాడ్లీ 9–52 తీసుకున్నాడు. న్యూజీలాండ్ ఏకైక ఇన్నింగ్స్‌లో, మార్టిన్ క్రోవ్ 188, జాన్ రీడ్ 108 పరుగులు చేశారు. ఎడ్గార్, రైట్, కోనీ, జెఫ్ క్రోవ్, వి. బ్రౌన్, హాడ్లీలు 17 - 54* మధ్య పరుగులు సాధించారు. ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో, హాడ్లీ 6–71, చాట్‌ఫీల్డ్ 3–75 తీసుకున్నారు. న్యూజీలాండ్, ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ప్రపంచ క్రికెట్‌లో మెరుగైన జట్లతో క్రమం తప్పకుండా పోటీపడే అవకాశం న్యూజీలాండ్‌కు, టెస్టు క్రికెట్ కంటే వన్డే క్రికెట్ ద్వారానే ఎక్కువగా ఇచ్చింది. వన్డే క్రికెట్‌లో ఒక బ్యాట్స్‌మన్ తన జట్టు గెలవడానికి సెంచరీలు చేయాల్సిన అవసరం లేదు. బౌలర్లు ప్రత్యర్థిని ఔట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బ్యాట్స్‌మెన్ 50, మరికొందరు 30లు, బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడం, అందరూ బాగా ఫీల్డింగ్ చేయడం ద్వారా వన్డే గేమ్‌లను గెలవవచ్చు. న్యూజీలాండ్ ఆటగాళ్ళు నిలకడగా వీటిని సాధిస్తూ జట్టుకు అన్ని విధాలుగా మంచి వన్డే రికార్డును సాధించిపెట్టారు.

బహుశా 1981లో MCG లో ఆస్ట్రేలియాతో జరిగిన "అండర్ ఆర్మ్" మ్యాచ్ న్యూజీలాండ్ అత్యంత అపఖ్యాతి పాలైన వన్డే మ్యాచ్. న్యూజీలాండ్‌ మ్యాచ్‌ను టై చేయడానికి ఆఖరి బంతికి ఆరు పరుగులు చేయాలి. న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ మెక్‌కెచ్నీని సిక్సర్ కొట్టనీయకుండా నిరోధించడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ చాపెల్, అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయమని తన సోదరుడు ట్రెవర్ చాపెల్‌కు చెప్పాడు. ఆస్ట్రేలియన్ అంపైర్లు ఈ చర్య చట్టబద్ధమేనని నిర్ణయించారు. అయినప్పటికీ క్రికెట్‌లో తీసుకున్న అత్యంత క్రీడావ్యతిరేక నిర్ణయాలలో ఇది ఒకటి అని ఈ రోజు వరకు చాలా మంది భావిస్తారు.

న్యూజీలాండ్ 1983లో ఆస్ట్రేలియాలో ట్రై-సిరీస్‌లో ఆడినప్పుడు, లాన్స్ కెయిర్న్స్ వన్డే బ్యాటింగులో కల్ట్ హీరో అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఒక మ్యాచ్‌లో, అతను ప్రపంచంలోని అతిపెద్ద మైదానాలలో ఒకటైన ఎమ్‌.సి.జి.లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ 149 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, న్యూజీలాండ్ క్రికెట్‌కు లాన్స్ అందించిన గొప్ప సహకారం అతని కుమారుడు క్రిస్ కెయిర్న్స్.

1990లో హాడ్లీ రిటైరవడానికి ఒక సంవత్సరం ముందు క్రిస్ కెయిర్న్స్ జట్టు లోకి వచ్చాడు. న్యూజీలాండ్ జట్టు లోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరైన కెయిర్న్స్, 1990లలో డానీ మోరిసన్‌తో కలిసి బౌలింగ్ దాడికి నాయకత్వం వహించాడు. న్యూజీలాండ్ జట్టులో అత్యంత అద్భుతమైన బ్యాటరైన స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టును 21వ శతాబ్ది లోకి నడిపించాడు. నాథన్ ఆస్టిల్, క్రెయిగ్ మెక్‌మిలన్ కూడా న్యూజీలాండ్ తరఫున పుష్కలంగా పరుగులు సాధించారు. అయితే ఈ ఇద్దరూ, ఊహించిన దానికంటే ముందుగానే రిటైరయ్యారు.

డేనియల్ వెట్టోరి 1997లో 18 ఏళ్ల యువకుడిగా జట్టులోకి ప్రవేశించాడు. 2007లో ఫ్లెమింగ్ నుండి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు అతను ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నింగ్ ఆల్-రౌండర్‌గా పరిగణించబడ్డాడు. 2009 ఆగష్టు 26 న, 300 వికెట్లు, 3000 టెస్టు పరుగులు సాధించిన డేనియల్ వెట్టోరి, చరిత్రలో అది సాధించిన ఎనిమిదో ఆటగాడు, రెండవ ఎడమచేతి బౌలరూ (చమిందా వాస్ తర్వాత) అయ్యాడు. వెట్టోరి 2011 లో అంతర్జాతీయ షార్ట్ ఫామ్ క్రికెట్ నుండి నిరవధిక విరామం తీసుకుని, టెస్టు క్రికెట్‌లో మాత్రం న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం కొనసాగించాడు. 2015 క్రికెట్ ప్రపంచ కప్‌కు తిరిగి వచ్చాడు.

1996 ఏప్రిల్ 4 న, న్యూజీలాండ్ ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సాధించింది, వెస్టిండీస్‌పై సాధించిన 4 పరుగుల విజయానికి గాను, జట్టు మొత్తం జట్టు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. మొత్తం జట్టు ఇలాంటి అవార్డును సాధించడం ఇది ఏకైక పర్యాయం. [24] [25]

అంతర్జాతీయ మైదానాలు

మార్చు
Locations of all stadiums which have hosted a men's international cricket match within New Zealand since 2018

మొదటి మ్యాచ్ ఆడిన తేదీ ప్రకారం పేర్చిన జాబితా ఇది. ప్రపంచ కప్, ప్రపంచ కప్ క్వాలిఫైయర్ గేమ్‌ల వంటి తటస్థ మ్యాచ్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

వేదిక నగరం ప్రాతినిధ్యం వహించే జట్టు సామర్థ్యం వాడిన కాలం టెస్టులు వన్‌డేలు టి20I
ప్రస్తుత వేదికలు
బేసిన్ రిజర్వ్ వెల్లింగ్టన్ వెల్లింగ్టన్ 11,600 1930–2023 67 30
ఈడెన్ పార్క్ ఆక్లండ్ ఆక్లండ్ 42,000 1930–2022 50 79 25
మెక్లీన్ పార్క్ నేపియర్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ 19,700 1979–2022 10 44 5
సెడాన్ పార్క్ హ్యామిల్టన్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ 10,000 1981–2023 27 39 12
వెల్లింగ్టన్ ప్రాంతీయ స్టేడియం వెల్లింగ్టన్ వెల్లింగ్టన్ 34,500 2000–2021 31 15
జాన్ డేవిస్ ఓవల్ క్వీన్స్‌టౌన్ Otago 19,000 2003–2023 9 1
యూనివర్శిటీ ఓవల్ డునెడిన్ Otago 6,000 2008–2023 8 11 2
సాక్స్టన్ ఓవల్ నెల్సన్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ 6,000 2014–2019 11 2
హాగ్లీ ఓవల్ క్రైస్ట్‌చర్చ్ కాంటర్బరీ 18,000 2014–2022 12 16 9
బే ఓవల్ టౌరాంగా నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ 10,000 2014–2023 4 11 10
గత వేదికలు
లాంకాస్టర్ పార్క్ క్రైస్ట్‌చర్చ్ కాంటర్బరీ 38,628 1930–2011 40 48 4
కారిస్‌బ్రూక్ డునెడిన్ ఒటాగో 29,000 1955–2004 10 21
పుకేకురా పార్క్ న్యూ ప్లిమత్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ 1992 1
ఓవెన్ డెలానీ పార్క్ టౌపో నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ 15,000 1999–2001 3
కోభమ్ ఓవల్ వాంగెరీ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ 5,500 2012–2017 2
బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ లింకన్ న్యూజీలాండ్ అకాడమీ 2014 2
As of 8 April 2023[26]

ప్రస్తుత స్క్వాడ్

మార్చు

ఇది 2023–2024 వరకు NZCతో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్ళు, 2022 ఆగస్టు నుండి న్యూజీలాండ్ తరపున ఆడిన లేదా ఇటీవలి టెస్ట్, వన్‌డే లేదా T20I స్క్వాడ్‌లలో స్థానం పొందిన ఆటగాళ్ళ జాబితా. ఒప్పంద ఆటగాళ్ల పేర్లు బొద్దుగా చూపించాం.[27] అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఇటాలిక్‌లలో జాబితా చేయబడ్డారు.

  • రూపాలు - ఆటగాడు గత సంవత్సరంలో న్యూజీలాండ్‌లో ఆడిన లేదా ఇటీవలి జట్టులో ఎంపికైన క్రికెట్ రూపాలను సూచిస్తుంది.
పేరు వయస్సు బ్యాటింగు శైలి బౌలింగు శైలి దేశీయ జట్టు చొక్కా సంఖ్య చొక్కా సంఖ్య కెప్టెన్ చివరి టెస్టు చివరి వన్‌డే చివరి టి20I
బ్యాటర్లు
ఫిన్ అలెన్ 25 కుడిచేతి వాటం ఆక్లండ్ వన్‌డే, టి20ఐ 16   2023   2023
చాడ్ బోవ్స్ 31 కుడిచేతి వాటం కాంటర్బరీ వన్‌డే, టి20ఐ 30   2023   2023
హెన్రీ నికోల్స్ 32 ఎడమచేతి వాటం కాంటర్బరీ టెస్టు, టి20ఐ 86   2023   2023   2021
గ్లెన్ ఫిలిప్స్ 27 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ ఒటాగో వన్‌డే, టి20ఐ 23   2020   2023   2023
కేన్ విలియమ్సన్ 34 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ టెస్టు, టి20ఐ 22 ODI (C)   2023   2023   2022
విల్ యంగ్ 31 కుడిచేతి వాటం సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ టెస్టు, వన్‌డే, టి20ఐ 32   2023   2023   2023
ఆల్ రౌండర్లు
మైఖేల్ బ్రేస్వెల్ 33 ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ వెల్లింగ్టన్ టెస్టు, వన్‌డే, టి20ఐ 4   2023   2023   2023
మార్క్ చాప్మన్ 30 ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ ఆక్లండ్ వన్‌డే, టి20ఐ 80   2023   2023
డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 26 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ ఒటాగో T20I 11   2023
స్కాట్ కుగ్గెలీన్ 32 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ Test 68   2023   2017   2021
కోల్ మెక్కన్చీ 32 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ కాంటర్బరీ వన్‌డే, టి20ఐ 44   2023   2023
డారిల్ మిచెల్ 33 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం కాంటర్బరీ టెస్టు, వన్‌డే, టి20ఐ 75   2023   2023   2023
జేమ్స్ నీషమ్ 33 ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ వెల్లింగ్టన్ వన్‌డే, టి20ఐ 50   2017   2023   2023
రచిన్ రవీంద్ర 24 ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ వెల్లింగ్టన్ వన్‌డే, టి20ఐ 8   2022   2023   2023
మిచెల్ సాంట్నర్ 32 ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ వన్‌డే, టి20ఐ 74   2021   2023   2023
వికెట్ కీపర్లు
టామ్ బ్లండెల్ 34 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ వెల్లింగ్టన్ టెస్టు, టి20ఐ 66   2023   2023   2021
డేన్ క్లీవర్ 31 కుడిచేతి వాటం సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ T20I 15   2022   2023
డెవాన్ కాన్వే 33 ఎడమచేతి వాటం వెల్లింగ్టన్ టెస్టు, వన్‌డే, టి20ఐ 88   2023   2023   2023
టామ్ లాథమ్ 32 ఎడమచేతి వాటం కాంటర్బరీ టెస్టు, వన్‌డే, టి20ఐ 48 టెస్టు, టి20ఐ (VC)   2023   2023   2023
టిమ్ సీఫెర్ట్ 29 కుడిచేతి వాటం నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ T20I 43   2019   2023
పేస్ బౌలర్లు
ట్రెంట్ బౌల్ట్ 35 కుడిచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ మీడియం నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ ODI 18   2022   2022   2022
డగ్ బ్రేస్‌వెల్ 33 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ Test 34   2023   2022   2021
జాకబ్ డఫీ 30 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం ఒటాగో వన్‌డే, టి20ఐ 27   2023   2023
లాకీ ఫెర్గూసన్ 33 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ ఆక్లండ్ వన్‌డే, టి20ఐ 69   2019   2023   2023
మాట్ హెన్రీ 32 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం కాంటర్బరీ టెస్టు, వన్‌డే, టి20ఐ 21   2023   2023   2023
కైల్ జేమీసన్ 29 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం కాంటర్బరీ ODI, T20I 12   2022   2022   2023
బెన్ లిస్టర్ 28 కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం ఆక్లండ్ వన్‌డే, టి20ఐ 17   2023   2023
ఆడమ్ మిల్నే 32 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ వన్‌డే, టి20ఐ 20   2023   2023
హెన్రీ షిప్లీ 28 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ కాంటర్బరీ వన్‌డే, టి20ఐ 46   2023   2023
టిమ్ సౌతీ 35 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ టెస్టు, వన్‌డే, టి20ఐ 38 Test, T20I (C)   2023   2023   2023
బ్లెయిర్ టిక్నర్ 30 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ టెస్టు, వన్‌డే, టి20ఐ 13   2023   2023   2023
నీల్ వాగ్నర్ 38 ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ Test 10   2023
స్పిన్ బౌలర్లు
ఆదిత్య అశోక్ 22 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ ఆక్లండ్ T20I   2023
అజాజ్ పటేల్ 35 ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ Test 24   2023   2021
ఇష్ సోధి 31 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ టెస్టు, వన్‌డే, టి20ఐ 61   2023   2023   2023

కోచింగ్ సిబ్బంది

మార్చు
స్థానం పేరు
టీమ్ మేనేజర్ మైక్ శాండిల్
ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్
బ్యాటింగ్ కోచ్ ల్యూక్ రోంచి
బౌలింగ్ కోచ్ షేన్ జుర్గెన్సెన్
ఫిజియోథెరపిస్ట్ టామీ సిమ్సెక్
కండిషనింగ్ కోచ్ క్రిస్ డోనాల్డ్సన్
పనితీరు విశ్లేషకుడు పాల్ వారెన్
మీడియా ప్రతినిధి విల్లీ నికోల్స్

కోచింగ్ చరిత్ర

మార్చు
  • 1985–1987: గ్లెన్ టర్నర్
  • 1990–1993: వారెన్ లీస్
  • 1993–1995: జియోఫ్ హోవార్త్
  • 1995–1996: గ్లెన్ టర్నర్
  • 1996–1999: స్టీవ్ రిక్సన్
  • 1999–2001: డేవిడ్ ట్రిస్ట్
  • 2001–2003: డెనిస్ అబెర్‌హార్ట్
  • 2003–2008: జాన్ బ్రేస్‌వెల్
  • 2008–2009: ఆండీ మోల్స్
  • 2010: మార్క్ గ్రేట్‌బ్యాచ్
  • 2010–2012: జాన్ రైట్
  • 2012–2018: మైక్ హెస్సన్
  • 2018–ప్రస్తుతం: గ్యారీ స్టెడ్

జట్టు రంగులు

మార్చు
కాలం కిట్ తయారీదారు స్పాన్సర్ (ఛాతీ) స్పాన్సర్ (స్లీవ్స్)
1980–1989 అడిడాస్
1990 DB డ్రాఫ్ట్
1991
1992 ISC
1993–1994 బ్యాంక్ ఆఫ్ న్యూజీలాండ్
1995–1996 DB డ్రాఫ్ట్
1997 బ్యాంక్ ఆఫ్ న్యూజీలాండ్
1998 కాంటర్బరీ టెల్స్ట్రాక్లియర్
1999 ఆసిక్స్
2000 WStar టెల్స్ట్రాక్లియర్
2001–2005 నేషనల్ బ్యాంక్ ఆఫ్ న్యూజీలాండ్ టెల్స్ట్రాక్లియర్
2006–2008
2009 ధీరజ్ & ఈస్టు కోస్ట్
2010 కాంటర్బరీ
2011–2014 ఫోర్డ్
2015–2016 ANZ
2017 ANZ
2018–ప్రస్తుతం

టోర్నమెంటు చరిత్ర

మార్చు

ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్

మార్చు
ఐసిసి Cricket World Cup record
Host(s) & Year Round 1 Round 2 Semi-finals Final Position
Pos P W L T NR Pts Pos P W L T/NR PCF Pts
  1975 2/4 3 2 1 0 0 4 Lost to   వెస్ట్ ఇండీస్ by 5 wickets Did not qualify SF
  1979 2/4 3 2 1 0 0 8 Lost to   ఇంగ్లాండు by 9 runs SF
   1983 3/4 6 3 3 0 0 6 Did not qualify Grp
   1987 3/4 6 2 4 0 0 8 Grp
   1992 1/9 8 7 1 0 0 14 Lost to   పాకిస్తాన్ by 4 wickets Did not qualify SF
    1996 3/6 5 3 2 0 0 6 Lost to   ఆస్ట్రేలియా by 6 wickets Did not qualify QF
   1999 3/6 5 3 2 0 0 6 4/6 3 1 1 0/1 2 5 Lost to   పాకిస్తాన్ by 9 wickets Did not qualify SF
  2003 3/7 6 4 2 0 0 16 5/6 3 1 2 0 4 8 Did not qualify S6
  2007 1/4 3 3 0 0 0 6 3/8 6 4 2 0 2 10 Lost to   శ్రీలంక by 81 runs Did not qualify SF
    2011 4/7 6 4 2 0 0 8 Beat   దక్షిణాఫ్రికా by 49 runs Lost to   శ్రీలంక by 5 wickets SF
   2015 1/6 6 6 0 0 0 12 Beat   వెస్ట్ ఇండీస్ by 143 runs Beat   దక్షిణాఫ్రికా by 4 wickets (DLS) Lost to   ఆస్ట్రేలియా by 7 wickets RU
   2019 4/10 9 5 3 0 1 11 Beat   భారతదేశం by 18 runs Lost to   ఇంగ్లాండు by 9 boundaries RU
  2023
    2027

ఐసిసి T20 ప్రపంచ కప్

మార్చు
ICC T20 World Cup record
Host(s) & Year Round 1 Round 2 Semi-finals Final Position
Pos P W L T NR Pts Pos P W L T NR Pts
W L W L
  2007 2/3 2 1 1 0 0 0 2 2/4 3 2 1 0 0 0 4 Lost to   పాకిస్తాన్ by 6 wickets Did not qualify SF
  2009 2/3 2 1 1 0 0 0 2 3/4 3 1 2 0 0 0 2 Did not qualify S8
  2010 1/3 2 2 0 0 0 0 4 3/4 3 1 2 0 0 0 2 S8
  2012 2/3 2 1 1 0 0 0 2 4/4 3 0 1 0 2 0 0 S8
  2014 Automatically progressed 3/5 4 2 2 0 0 0 4 S10
  2016 to the Super 10s stage 1/5 4 4 0 0 0 0 8 Lost to   ఇంగ్లాండు by 7 wickets Did not qualify SF
  &   2021 Automatically progressed 2/6 5 4 1 0 0 0 8 Beat   ఇంగ్లాండు by 5 wickets Lost to   ఆస్ట్రేలియా by 8 wickets RU
  2022 to the Super 12s stage 1/6 5 3 1 0 0 1 7 Lost to   పాకిస్తాన్ by 7 wickets Did not qualify SF
   2024
   2026
   2028
    2030

ఐసిసి World Test Championship

మార్చు
ఐసిసి World Test Championship record
Year League stage Final Host Final Final Position
Pos మ్యాచ్‌లు Ded PC Pts PCT
P W L D T
2019–21[28] 2/9 11 7 4 0 0 0 600 420 70.00   Hampshire Bowl 2021 Beat   భారతదేశం by 8 wickets W
2021–23 6/9 13 4 6 3 0 0 156 60 38.46   The Oval 2023 Did not qualify 6th

ఐసిసి Champions Trophy (ఐసిసి KnockOut)

మార్చు
ఐసీసీ నాకౌట్ ట్రోఫీ రికార్డు
హోస్ట్(లు) & సంవత్సరం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ క్వార్టర్ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ చివరి స్థానం
  1998   జింబాబ్వే ని 5 వికెట్ల తేడాతో ఓడించింది   శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది అర్హత సాధించలేదు QF
  2000 బై   జింబాబ్వేను 64 పరుగుల తేడాతో ఓడించింది.   పాకిస్తాన్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.   భారతదేశం 4 వికెట్ల తేడాతో ఓడించింది 1
ఐసిసి Champions Trophy record
Host(s) & Year Group stage Semi-finals Final Position
Pos P W L T NR NRR Pts
  2002 3/3 2 1 1 0 0 0.030 2 Did not qualify Grp
  2004 2/3 2 1 1 0 0 1.603 2 Grp
  2006 2/4 3 2 1 0 0 0.572 4 Lost to   ఆస్ట్రేలియా by 34 runs Did not qualify SF
  2009 1/4 3 2 1 0 0 0.782 4 Beat   పాకిస్తాన్ by 5 wickets Lost to   ఆస్ట్రేలియా by 6 wickets 2
  2013 3/4 3 1 1 0 1 0.777 3 Did not qualify Grp
  2017 4/4 3 0 2 0 1 −1.058 1 Grp
  2025
  2029

Austral-Asia Cup

మార్చు
ఆస్ట్రలేషియా కప్ రికార్డు
Host & Year First Round Semi-finals Final Position
  1986 Lost to   భారతదేశం by 3 wickets Lost to   పాకిస్తాన్ by 10 wickets Did not qualify SF
ఆస్ట్రలేషియా కప్ రికార్డు
Host & Year Group stage Semi-finals Final Position
Pos P W L T NR RR Pts
  1990 2/3 2 1 1 0 0 5.330 2 Lost to   పాకిస్తాన్ by 8 wickets Did not qualify SF
  1994 2/3 2 1 1 0 0 4.240 2 Lost to   పాకిస్తాన్ by 62 runs SF

Commonwealth Games

మార్చు
Commonwealth Games record
Host(s) & Year Group stage Semi-finals Medal round Position
Pos P W L T NR NRR Pts Bronze medal match Gold medal match
  1998 1/4 3 3 0 0 0 1.799 6 Lost to   ఆస్ట్రేలియా 9 wickets Beat   శ్రీలంక by 51 runs Did not qualify 3/16

విజయాలు

మార్చు

ఐసిసి

మార్చు
  • World Test Championship:
    • Champions (1): 2019–2021
  • World Cup:
  • T20 World Cup:
    • Runners-up (1): 2021
  • Champions Trophy:
    • Champions (1): 2000
    • Runners-up (1): 2009

ఇతరాలు

మార్చు
  • కామన్వెల్త్ గేమ్స్ :
    • కాంస్య పతకం (1): 1998

ఫలితాలు

మార్చు

టెస్టులు

మార్చు
ప్రత్యర్థి కాలం సీరీస్ మ్యాచ్‌లు
P W L D W/L %W %L %D P W L D T W/L %W %L %D
  ఆస్ట్రేలియా 1946–2020 21 2 14 5 0.14 9.52 66.67 23.80 60 8 34 18 0 0.23 13.33 56.66 30.00
  బంగ్లాదేశ్ 2001–2022 8 6 0 2 75.00 0.00 25.00 17 13 1 3 0 13.0 76.47 5.88 17.64
  ఇంగ్లాండు 1930–2022 38 6 24 8 0.25 15.78 63.15 21.05 110 12 51 46 0 0.23 10.90 46.36 42.72
  భారతదేశం 1955–2021 21 6 12 3 0.50 28.57 57.14 14.28 62 13 22 27 0 0.59 20.96 35.48 43.54
  పాకిస్తాన్ 1955–2021 21 5 10 6 0.50 23.80 47.61 28.57 60 14 25 21 0 0.56 23.33 41.66 35.00
  దక్షిణాఫ్రికా 1932–2022 17 0 13 4 0.00 0.00 76.47 23.52 47 5 26 16 0 0.19 10.63 55.31 34.04
  శ్రీలంక 1983–2019 16 7 4 5 1.75 43.75 25.00 31.25 36 16 9 11 0 1.77 44.44 25.00 30.55
  వెస్ట్ ఇండీస్ 1952–2020 18 8 6 4 1.33 44.44 33.33 22.22 49 17 13 19 0 1.30 34.69 26.53 38.77
  జింబాబ్వే 1992–2016 7 5 0 2 71.42 0.00 28.57 17 11 0 6 0 64.70 0.00 35.29
Summary 1930–2022 167 45 83 39 0.54 26.94 49.70 23.35 458 109 181 168 0 0.60 23.79 39.51 36.68
Last updated: 27 June 2022 Source:ESPNCricInfo

* కనీసం 2 మ్యాచ్‌లు ఆడిన ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రమే ఇక్కడ చేర్చబడ్డాయి. వన్-ఆఫ్ మ్యాచ్‌లు ద్వైపాక్షిక సిరీస్‌గా పరిగణించబడవు.

ప్రత్యర్థి కాలం సీరీస్ మ్యాచ్‌లు
P W L D W/L %W %L %D P W L T Tie+W Tie+L N/R %W
  ఆఫ్ఘనిస్తాన్ 2015–2019 0 2 2 0 0 0 0 0 100.00
  ఆస్ట్రేలియా 1974–2022 17 3 10 4 0.30 17.64 58.82 23.52 141 39 95 0 0 0 7 29.10
  బంగ్లాదేశ్ 1990–2021 9 7 2 0 3.50 77.77 22.22 0.00 38 28 10 0 0 0 0 73.68
  కెనడా 2003–2011 0 3 3 0 0 0 0 0 100.00
  East Africa 1975–1975 0 1 1 0 0 0 0 0 100.00
  ఇంగ్లాండు 1973–2019 18 7 8 3 0.87 38.88 44.44 16.66 91 43 41 2 0 1 4 51.14
  భారతదేశం 1975–2023 17 6 9 2 0.66 35.29 52.94 11.76 116 50 58 1 0 0 7 46.33
  ఐర్లాండ్ 2007–2022 1 1 0 0 100.00 0.00 0.00 7 7 0 0 0 0 0 100.00
  కెన్యా 2007–2011 0 2 2 0 0 0 0 0 100.00
  నెదర్లాండ్స్ 1996–2022 1 1 0 0 100.00 0.00 0.00 4 4 0 0 0 0 0 100.00
  పాకిస్తాన్ 1973–2023 20 11 7 2 1.57 55.00 35.00 10.00 110 50 56 1 0 0 3 47.19
  స్కాట్‌లాండ్ 1999–2022 0 4 4 0 0 0 0 0 100.00
  దక్షిణాఫ్రికా 1992–2019 10 2 8 0 0.20 20.00 80.00 0.00 71 25 41 0 0 0 5 37.87
  శ్రీలంక 1979–2019 15 8 3 4 2.66 53.33 20.00 26.66 99 49 41 1 0 0 8 54.39
  UAE 1996-1996 0 1 1 0 0 0 0 0 100.00
  యు.ఎస్.ఏ 2004-2004 0 1 1 0 0 0 0 0 100.00
  వెస్ట్ ఇండీస్ 1975–2022 12 5 6 1 0.83 41.66 50.00 8.33 68 30 31 0 0 0 7 49.18
  జింబాబ్వే 1987–2015 9 6 2 1 3.00 66.66 22.22 11.11 38 27 9 1 0 0 1 74.32
Summary 1973–2023 129 57 55 17 1.03 44.19 42.64 13.18 797 366 382 7 0 1 42 48.94
Last updated: 24 January 2023. Source:ESPNCricInfo

* కనీసం 2 మ్యాచ్‌లు ఆడిన ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రమే ఇక్కడ చేర్చబడ్డాయి. వన్-ఆఫ్ మ్యాచ్‌లు ద్వైపాక్షిక సిరీస్‌గా పరిగణించబడవు.

* "టై+డబ్ల్యూ", "టై+ఎల్" అనేవి బౌల్ అవుట్ లేదా వన్-ఓవర్-ఎలిమినేటర్ ("సూపర్ ఓవర్") వంటి టైబ్రేకర్‌లో టై అయిన మ్యాచ్‌లను, టైబ్రేకరు ఫలితాన్నీ సూచిస్తాయి.

* గెలుపు శాతంలో ఫలితం తేలని వాటిని గణించదు. టైలను (టైబ్రేకర్‌తో సంబంధం లేకుండా) సగం విజయంగా గణిస్తుంది.

* వదిలేసుకున్న మ్యాచ్‌లు లెక్కించలేదు.

T20I మ్యాచ్‌లు

మార్చు
ప్రత్యర్థి కాలం సీరీస్ మ్యాచ్‌లు
P W L D W/L %W %L %D P W L Tie Tie+W Tie+L N/R %W
  ఆఫ్ఘనిస్తాన్ 2021–2021 0 1 1 0 0 0 0 0 100.00
  ఆస్ట్రేలియా 2005–2021 2 1 0 1 50.00 0.00 50.00 16 5 10 0 1 0 0 34.37
  బంగ్లాదేశ్ 2010–2022 3 2 1 0 2.00 66.66 33.33 0.00 17 14 3 0 0 0 0 82.35
  ఇంగ్లాండు 2007–2022 4 1 3 0 0.33 25.00 75.00 0.00 23 8 13 0 0 1 1 38.63
  భారతదేశం 2007–2023 8 3 5 0 0.75 40.00 60.00 0.00 24 10 11 1 0 2 0 47.91
  ఐర్లాండ్ 2009–2022 1 1 0 0 100.00 0.00 0.00 4 4 0 0 0 0 0 100.00
  కెన్యా 2007-2007 0 1 1 0 0 0 0 0 100.00
  నమీబియా 2021-2021 0 1 1 0 0 0 0 0 100.00
  నెదర్లాండ్స్ 2014–2022 1 1 0 0 100.00 0.00 0.00 3 3 0 0 0 0 0 100.00
  పాకిస్తాన్ 2007–2022 7 3 3 1 1.00 42.85 42.85 14.28 29 11 18 0 0 0 0 37.93
  స్కాట్‌లాండ్ 2009–2022 1 1 0 0 100.00 0.00 0.00 4 4 0 0 0 0 0 100.00
  దక్షిణాఫ్రికా 2005–2017 3 0 2 1 0.00 0.00 66.66 33.33 15 4 11 0 0 0 0 26.66
  శ్రీలంక 2006–2019 6 3 1 2 3.00 50.00 16.66 33.33 20 11 7 0 0 1 1 60.52
  వెస్ట్ ఇండీస్ 2006–2022 7 4 1 2 4.00 57.14 14.28 28.57 19 10 4 0 1 2 2 67.64
  జింబాబ్వే 2010–2015 2 2 0 0 100.00 0.00 0.00 6 6 0 0 0 0 0 100.00
Summary 2005–2023 45 22 16 7 1.57 48.89 35.55 15.56 185 94 78 1 2 6 4 54.41
Last updated: 01 February 2023. Source:ESPNCricInfo[29][30]

* కనీసం 2 మ్యాచ్‌లు ఆడిన ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రమే ఇక్కడ చేర్చబడ్డాయి. వన్-ఆఫ్ మ్యాచ్‌లు ద్వైపాక్షిక సిరీస్‌గా పరిగణించబడవు.

* "టై+డబ్ల్యూ", "టై+ఎల్" అనేవి బౌల్ అవుట్ లేదా వన్-ఓవర్-ఎలిమినేటర్ ("సూపర్ ఓవర్") వంటి టైబ్రేకర్‌లో టై అయిన మ్యాచ్‌లను, టైబ్రేకరు ఫలితాన్నీ సూచిస్తాయి.

* గెలుపు శాతంలో ఫలితం తేలని వాటిని గణించదు. టైలను (టైబ్రేకర్‌తో సంబంధం లేకుండా) సగం విజయంగా గణిస్తుంది.

రికార్డులు

మార్చు

ప్రపంచ రికార్డులు

మార్చు
  • రిచర్డ్ హ్యాడ్లీ, 1988లో బెంగుళూరులో భారత్‌పై అత్యధిక టెస్టు వికెట్లు (374) తీసిన ప్రపంచ రికార్డు (374) సృష్టించాడు. 1990లో క్రైస్ట్‌చర్చ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 400 టెస్టు వికెట్లు సాధించిన మొదటి బౌలర్‌గా హాడ్లీ నిలిచాడు. అతని కెరీర్‌ను 431 వికెట్లతో ముగించాడు. ఆ తర్వాత కపిల్ దేవ్ ఆ రికార్డును ఛేదించాడు.
  • అత్యధిక సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ప్రపంచ రికార్డు న్యూజీలాండ్‌దే. అయితే వీళ్ళు ఇంకా ఏ ట్రోఫీని గెలవలేదు.
  • కోరీ అండర్సన్‌కు వన్డే ఇంటర్నేషనల్స్‌లో (లేదా అంతర్జాతీయ క్రికెట్‌లోని మరేదైనా ఫార్మాట్) రెండవ వేగవంతమైన సెంచరీ రికార్డు ఉంది. వెస్టిండీస్‌తో ఆడుతూ అతను, కేవలం 36 బంతుల్లోనే తన శతకం సాధించాడు. వెస్టిండీస్‌పై AB డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ చేయడంతో కోరీ అండర్సన్ ఆ రికార్డును కోల్పోయాడు.
  • 1996లో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు మొత్తానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
  • ఆండ్రూ జోన్స్, మార్టిన్ క్రోవ్ 1991లో శ్రీలంకపై 467 పరుగులతో టెస్టుల్లో అత్యధిక 3వ వికెట్ భాగస్వామ్యాన్ని సాధించారు. ఆ సమయంలో ఇది ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం. [31]
  • బ్రియాన్ హేస్టింగ్స్, రిచర్డ్ కొలింగే కలిసి 1973లో పాకిస్థాన్‌పై 10వ వికెట్‌కు 151 పరుగులు చేశారు, ఇది ఆ సమయంలో అత్యధిక 10వ వికెట్ భాగస్వామ్యం.[32]
  • నాథన్ ఆస్టిల్ 2002లో క్రైస్ట్‌చర్చ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని సాధించాడు. [33] అతను 153 బంతుల్లో 200 పరుగులు చేశాడు. 114 బంతుల్లో తొలి వంద పరుగులు చేయగా, రెండవ వంద కేవలం 39 బంతుల్లో సాధించాడు. అతను చివరికి 222 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆస్టిల్ 59 బంతుల్లో వంద పరుగులు చేసి, ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
  • వేగవంతమైన సెంచరీ చేసిన ప్రపంచ రికార్డు బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉంది. 2016 ఫిబ్రవరి 20 న క్రైస్ట్‌చర్చ్‌లో తన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 100 పరుగులు చేసాడు. [34]
  • బ్రెండన్ మెకల్లమ్ [35] టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. అతను తన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆడమ్ గిల్‌క్రిస్టు [35] రికార్డైన 100 ను అధిగమించాడు. ఈ రికార్డు గతంలో క్రిస్ కెయిర్న్స్ పేరిట ఉండేది. [35]
  • ట్వంటీ 20 అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ (116* వి. ఆస్ట్రేలియా, 123 v. బంగ్లాదేశ్).
  • బ్రెండన్ మెకల్లమ్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు సాధించాడు. అతను పల్లెకెలెలో బంగ్లాదేశ్‌ పై ఈ రికార్డు సాధించాడు. సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌పై 156* పరుగులు చేసిన ఆరోన్ ఫించ్ ఆ రికార్డును ఛేదించాడు. [36]
  • క్రిస్ కెయిర్న్స్, అతని తండ్రి లాన్స్ కెయిర్న్స్ 100 టెస్టు వికెట్లు సాధించిన ఇద్దరు తండ్రి-కొడుకుల జంటలో ఒకరు. దక్షిణాఫ్రికాకు చెందిన పీటర్, షాన్ పొలాక్^లు అలాంటి మరొక జంట.
  • మార్టిన్ గప్టిల్ 2015లో 237* పరుగులతో ప్రపంచకప్‌లలో అత్యధిక స్కోరు సాధించాడు.
  • ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో గప్టిల్ కెరీర్‌లో అత్యధిక పరుగులు (2,271), అత్యధిక సిక్సర్లు (103, క్రిస్ గేల్‌తో సమానం) రికార్డు చేసాడు. ఈ రెండు రికార్డులు గతంలో బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉన్నాయి. [37]
  • 1980 నవంబరు 23 న అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టిన మొదటి - ఇప్పటివరకు ఏకైక- ప్రత్యామ్నాయ ఫీల్డర్ జాన్ బ్రేస్‌వెల్.
  • డేనియల్ వెట్టోరి ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాలుగేసి వికెట్లు తీసి రెండు ఇన్నింగ్సుల్లోనూ అర్ధ శతకాలు చేసిన మొదటి క్రికెటరు. అతను 2008 అక్టోబరులో చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌పై ఈ ఘనతను సాధించాడు. అతని గణాంకాలు బాల్‌తో 5/95, 4/74, బ్యాట్‌తో 55*, 76. [38]
  • మూడు ట్వంటీ-20 అంతర్జాతీయ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు కోలిన్ మున్రో. 2018 జనవరి 3న వెస్టిండీస్‌పై 88 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్‌లతో 104 పరుగులు చేసి ఇది సాధించాడు.
  • 100 వన్డేలు, టెస్టులు, టీ20లు ఆడిన తొలి ఆటగాడు రాస్ టేలర్.
  • క్రిస్ హారిస్ [39] 29 వికెట్లతో వన్‌డేల్లో అత్యధిక క్యాచ్ అండ్ బౌల్డ్ అవుట్‌ల రికార్డు సాధించాడు.

గుర్తించదగినవి

మార్చు
  • కనీసం 100 వన్‌డేలు ఆడిన బ్యాట్స్‌మెన్‌లలో రాస్ టేలర్‌కు 8వ అత్యధిక వన్‌డే బ్యాటింగ్ సగటు ఉంది. కేన్ విలియమ్సన్ 10వ స్థానంలో ఉన్నాడు.
  • న్యూజీలాండ్ జింబాబ్వే (హరారే 2005) ని ఒకే రోజులో 59, 99 స్కోర్ల వద్ద రెండుసార్లు ఆలౌట్ చేసింది. జింబాబ్వే (1952లో మాంచెస్టర్‌లో భారత్ అలాగే ఔటయింది) ఒకే రోజులో రెండుసార్లు ఔట్ అయిన రెండో జట్టుగా నిలిచింది. రెండు రోజుల్లోనే టెస్టు ముగిసిపోయింది. [40] ఈ ఫీట్ 2012లో నేపియర్‌లో పునరావృతమైంది, జింబాబ్వేను 51, 143 పరుగులకు న్యూజీలాండ్ అవుట్ చేసి మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. [41]
  • టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన న్యూజీలాండ్ ఆటగాడిగా కేన్ విలియమ్సన్ 24 సెంచరీలతో రికార్డు సృష్టించాడు.
  • బ్రెండన్ మెకల్లమ్ టెస్టుల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధికంగా 302 పరుగులు చేసిన న్యూజీలాండ్ ఆటగాడిగా (2014లో భారత్‌కు వ్యతిరేకంగా) రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం న్యూజీలాండ్‌ నుంచి ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు అతడు.
  • బ్రెండన్ మెకల్లమ్ 4 సార్లు టెస్టులో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసాడు. ఇది న్యూజీలాండ్ రికార్డు.
  • బ్రెండన్ మెకల్లమ్ న్యూజీలాండ్ తరపున 2015 క్రికెట్ ప్రపంచ కప్ పూల్ A మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై వేగవంతమైన ప్రపంచ కప్ ఫిఫ్టీ (18 బంతుల్లో) సాధించాడు. అంతకుముందు ప్రపంచ కప్ (2007)లో కెనడాపై తానే చేసిన 20-బంతుల రికార్డును అధిగమించాడు.
  • వెల్లింగ్టన్‌లో జరిగిన 2015 ప్రపంచకప్ క్వార్టర్-ఫైనల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 237 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మార్టిన్ గప్టిల్ న్యూజీలాండ్ తరఫున అత్యధిక వన్డే ఇంటర్నేషనల్ స్కోరు రికార్డు సృష్టించాడు.[42]
  • 2007 జనవరిలో హోబర్ట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి ఓవర్ (ఇన్నింగ్స్ [43] గణాంకాలు: 10–0–61–4)లో షేన్ బాండ్ వన్‌డే హ్యాట్రిక్ సాధించాడు.
  • టిమ్ సౌతీ ట్వంటీ-20 హ్యాట్రిక్ సాధించాడు, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5–18 గణాంకాలు సాధించాడు.
  • కోలిన్ మున్రో 2016 జనవరి 10 న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శ్రీలంకపై 14 బంతుల్లో రెండో వేగవంతమైన T20 అంతర్జాతీయ 50 పరుగులు చేశాడు.
  • వన్డేల్లో 200 వికెట్లు తీసిన న్యూజీలాండ్ క్రికెటర్లు క్రిస్ హారిస్, డేనియల్ వెటోరి, కైల్ మిల్స్, క్రిస్ కెయిర్న్స్ మాత్రమే.
  • వన్‌డేల్లో 4000 పరుగులు/200 వికెట్ల డబుల్ పూర్తి చేసిన న్యూజీలాండ్ క్రికెటర్లు క్రిస్ హారిస్, క్రిస్ కెయిర్న్స్ ఇద్దరే. మిగిలిన వారు శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య, దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వెస్ కల్లిస్, పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్, బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్. [44]
  • అజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు, ఇంగ్లండ్‌కు చెందిన జిమ్ లేకర్, భారత ఆటగాడు అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన మూడవ అంతర్జాతీయ క్రికెటరి, మొదటి న్యూజీలాండ్ క్రికెటరూ అతడు. [45]
  • 2022 జూన్‌లో ఇంగ్లండ్‌పై, న్యూజీలాండ్ టెస్టు మ్యాచ్ చరిత్రలో ఓడిపోయిన మ్యాచ్‌లో ఐదవ అత్యధిక జట్టు మొత్తం (553). రెండవ అత్యధిక మ్యాచ్ స్కోరు (837) చేసింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Blackcaps". NZC. Archived from the original on 4 March 2021. Retrieved 10 March 2021.
  2. "New Zealand People". New Zealand. Archived from the original on 23 March 2021. Retrieved 10 March 2021.
  3. "Jamieson takes six as New Zealand scale the rankings summit". ICC. 6 January 2021. Archived from the original on 6 January 2021. Retrieved 6 January 2021.
  4. "New Zealand climb to top of the ODI rankings in annual update". ICC. 3 May 2021. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
  5. "New Zealand top T20I rankings for first time". ESPNcricinfo. 4 May 2016. Archived from the original on 10 January 2021. Retrieved 1 January 2021.
  6. "ICC Rankings". International Cricket Council.
  7. "Test matches - Team records". ESPNcricinfo.
  8. "Test matches - 2023 Team records". ESPNcricinfo.
  9. "ODI matches - Team records". ESPNcricinfo.
  10. "ODI matches - 2023 Team records". ESPNcricinfo.
  11. "T20I matches - Team records". ESPNcricinfo.
  12. "T20I matches - 2023 Team records". ESPNcricinfo.
  13. Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. p. 163. ISBN 978-1-84607-880-4.
  14. Anderson, Ian (29 January 1998). "It's Clear Black Caps very dull". Waikato Times. p. 12.
  15. "NEW ZEALAND / RECORDS / COMBINED టెస్టు, టి20ఐ AND T20I RECORDS / RESULT SUMMARY". ESPNcricinfo. Archived from the original on 12 June 2021. Retrieved 10 March 2021.
  16. "ICC rankings – ICC టెస్టు, టి20ఐ and Twenty20 rankings – ESPN Cricinfo". ESPNcricinfo. Archived from the original on 3 March 2015. Retrieved 2 March 2015.
  17. Baum, Greg (24 March 2015). "Cricket World Cup: Drama aplenty as New Zealand enter first final". The Sydney Morning Herald. Archived from the original on 8 September 2018. Retrieved 8 September 2018.
  18. "New Zealand in final despite thrilling Jadeja-Dhoni counter-attack". ESPN CricInfo. 10 July 2019. Retrieved 10 July 2019.
  19. The Summer Game by D.O & P.W. Neely 1994 Page 11
  20. "New Zealand cricket Page 4 – Playing England". NZHistory. 20 December 2012. Archived from the original on 7 February 2015. Retrieved 7 February 2015.
  21. "Outstanding Achievements". Te Ara – the Encyclopedia of New Zealand. 23 April 2009. Archived from the original on 7 February 2015. Retrieved 7 February 2015.
  22. "New Zealand in Pakistan Test Series, 1969/70". ESPN Cricinfo. 1 January 1970. Archived from the original on 26 March 2015. Retrieved 7 February 2015.
  23. "Most consecutive series without victory". ESPNcricinfo. Archived from the original on 12 June 2021. Retrieved 5 March 2021.
  24. "1995–1996 West Indies v New Zealand – 4th Match – Georgetown, Guyana". HowStat. Archived from the original on 28 July 2017. Retrieved 11 March 2017.
  25. "4th ODI, New Zealand tour of West Indies at Georgetown, Apr 3 1996". ESPNcricinfo. Archived from the original on 28 August 2017. Retrieved 11 March 2017.
  26. "List of cricket grounds in New Zealand".
  27. "Milne set to return to NZC contract list". Archived from the original on 2023-06-11. Retrieved 2023-09-02.
  28. "ICC World Test Championship 2019–2021 Table". ESPN Cricinfo. Archived from the original on 12 August 2021. Retrieved 29 August 2021.
  29. "Records | Twenty20 Internationals | Team records | Results summary | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-11-21.
  30. "New Zealand Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-11-21.
  31. "Records - Test matches - Partnership records - Highest partnerships for any wicket - ESPNcricinfo". Archived from the original on 30 August 2017. Retrieved 8 September 2018.
  32. "Records - Test matches - Partnership records - Highest partnership for the tenth wicket - ESPNcricinfo". Archived from the original on 11 May 2015. Retrieved 8 September 2018.
  33. "Records: Test matches - Batting records - ఫాస్ట్est double hundreds". ESPN Cricinfo. Archived from the original on 27 March 2019. Retrieved 6 September 2015.
  34. "Brendon McCullum: New Zealand captain breaks ఫాస్ట్est Test century record". British Broadcasting Corporation. 20 February 2016. Archived from the original on 18 September 2020. Retrieved 8 February 2020.
  35. 35.0 35.1 35.2 "Records / Test matches / Batting records / Most sixes in career". ESPNcricinfo. Archived from the original on 27 March 2019. Retrieved 4 March 2019.
  36. "World Twenty20 2012: Brendon McCullum's record 123 leads New Zealand to emphatic win over Bangladesh". The Daily Telegraph. 21 September 2012. Archived from the original on 22 November 2019. Retrieved 8 February 2020.
  37. "Records | Twenty20 Internationals | Batting records | Most runs in career | ESPNcricinfo". Cricinfo. Archived from the original on 29 May 2018. Retrieved 29 May 2018.
  38. ""Vettori's unique feat" (cricinfo)". ESPN Cricinfo. Archived from the original on 5 February 2009. Retrieved 7 May 2012.
  39. "Winning without losing a wicket, and Kumble's record". Cricinfo. 12 January 2004. Archived from the original on 14 November 2007. Retrieved 21 February 2007.
  40. "Hopeless Zimbabwe crushed inside two days- Zimbabwe v New Zealand 1st Test, Harare". The Bulletin. Cricinfo. 8 August 2005. Archived from the original on 22 November 2012. Retrieved 15 November 2012.
  41. Fernando, Andrew (28 January 2012). "New Zealand bowl out Zimbabwe twice in a day". Cricinfo. ESPN. Archived from the original on 28 April 2012. Retrieved 15 November 2012.
  42. "Cricket Records – New Zealand – Records – One-Day Internationals – High scores". ESPN Cricinfo. Archived from the original on 6 December 2014. Retrieved 19 November 2014.
  43. "Australia crush Kiwis in Hobart". BBC Sport. 14 January 2007. Archived from the original on 19 September 2011. Retrieved 15 November 2012.
  44. Seervi, Bharath (19 July 2015). "Shakib Al Hasan – Quickest to complete double of 4000 runs and 200 wickets in ODIs". Sportskeeda Stats. Absolute Sports. Archived from the original on 19 September 2015. Retrieved 6 September 2015.
  45. "Full Scorecard of India vs New Zealand, December 03 - 06, 2021".