దిలీప్ మహలనాబిస్

భారతీయ వైద్యుడూ, శాస్త్రవేత్తా

దిలీప్ మహలనాబిస్/మహలనావిస్[గమనిక 1] (12 నవంబర్ 1934 - 16 అక్టోబరు 2022)[1] ఒక భారతీయ శిశువైద్య నిపుణుడు. అతిసార వ్యాధుల చికిత్సకు ఓరల్ రీహైడ్రెయ్షన్ థెరపీని (Oral Rehydration therapy) ప్రవేశపెట్టిన వారిలో ఈయన ఒకరు. ఈయన 1960లలో కలకత్తాలోని జాన్స్ హాప్కిన్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌లో (Johns Hopkins International Center for Medical Research and Training) కలరా ఇంకా ఇతర అతిసార వ్యాధులపై పరిశోధన చేసారు. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) నుండి వచ్చి పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్న శరణార్థులలో కలరా విజృంభించింది. అప్పుడు ఈయన నేతృత్వంలో జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ పరిశోధకుల బృందం ఓరల్ రీహైడ్రెయ్షన్ థెరపీని వారిపై వాడి, అది ప్రాణాలను ఎలా నిలబెట్టగలదో చూపించింది.

దిలీప్ మహలనాబిస్
జననం(1934-11-12)1934 నవంబరు 12
మరణం2022 అక్టోబరు 16(2022-10-16) (వయసు 87)
జాతీయతభారతీయుడు

ప్రస్థానం

మార్చు

1980ల ద్వితియార్ధంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డైయరియల్ డిసీస్ కన్ట్రోల్ ప్రొగ్రామ్‌కు (అర్థం:అతిసార వ్యాధి అదుపు కార్యక్రమం, Diarrheal Disease Control Programme) వైద్యాధికారిగా చేసారు. 1990ల్లో బంగ్లాదేశ్‌లోని ఇన్టర్నేషనల్ సెన్టర్ ఫర్ డైయరియల్ డిసీస్ రిసర్చ్ (International Centre for Diarrhoeal Disease Research (ICDDR,B), అర్థం: అతిసార వ్యాధుల పరిశోధనకు అంతర్జాతీయ కేంద్రం)లో డైరెక్టర్ ఆఫ్ క్లినికల్ రిసర్చ్ (Director of Clinical Research, అర్థం: చికిత్సా పరిశోధనలకు మార్గదర్శకులు)గా సేవలందించారు.

1994లో రొయల్ స్వీడిష్ అకడమీ ఒఫ్ సైయన్సెస్‌కు (Royal Swedish Academy of Sciences) విదేశీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2002లో ఒ.అర్.టి కనుగొనడం, అమలుపరచడంలో వారి పాత్రకు గానూ, డా॥ మహలనాబిస్, డా॥నథెన్యల్ పయర్స్, డా॥ డెయ్విడ్ నలిన్, డా॥ నొర్బర్ట్ హిర్శ్‌హొర్న్ లకు మొదటి పొలిన్ పురస్కారం[గమనిక 2] వచ్చింది. 2006లో‌ ఒ.ఆర్.టి అభివృద్ధికి గానూ డా॥ మహలనాబిస్, డా॥ రిచర్డ్ కెష్(శ్), డా॥ డెయ్విడ్ నలిన్‌లకు ప్రిన్స్ మహిడొల్ పురస్కారం[గమనిక 3] లభించింది.[2] ఒ.అర్.టి (ORT) అనేది అతిసార తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు కానీ, ఇన్ట్రవీనస్ రీహైడ్రెయ్షన్ థెరపీ (intravenous Rehydration therapy,)[గమనిక 4] ఇవ్వలేని పరిస్థితుల్లో గానీ పనికొచ్చే చికిత్సా పద్ధతి. ఈ పద్ధతి ఇప్పటివరకు 6 కోట్ల ప్రాణాలు కాపాడి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.[ఆధారం చూపాలి]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈయన భార్య పేరు జయంతి మహలనాబిస్.[3] అక్టోబర్ 16, 2022న కోల్‌కతాలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు.[4]

పురస్కారాలు

మార్చు
  • పొలిన్ పురస్కారం (2002)
  • ప్రిన్స్ మహిడొల్ పురస్కారం (2006)[5]

పరిశోధనా పత్రాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

గమనికలు

మార్చు
  1. బెంగాలీ భాషలో 'బ'ను ఇతర భాషల్లో 'వ'గా వ్రాయడం పరిపాటి
  2. పిల్లల వైద్యశాస్త్రంలో కృషికి ఇవ్వబడే అమెరికా పురస్కారం. ప్రస్తుతం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయట్లేదు
  3. వైద్యశాస్త్రంలో కృషికి ఇచ్చే థాయి దేశపు పురస్కారం
  4. రక్తనాళాల్లోకి లవణాలున్న నీటిని నేరుగా ఎక్కించే చికిత్సా ప్రక్రియ. మామూలు భాషలో తెలుగువారు సెలైన్ పెట్టడం అంటుంటారు

మూలాలు

మార్చు
  1. "Kungl. vetenskapsakademien – Matrikel 1998/1999". Matrikel (in స్వీడిష్). Stockholm: Kungl. Vetenskapsakademien: 84. 1998. ISSN 0302-6558.
  2. "Prince Mahidol Award 2006 Ceremony". ryt9.com. 25 January 2007. Retrieved 1 September 2017.
  3. "Author Information Form for Mahalanabis, Jayanti".
  4. "Dilip Mahalanabis: নীরবেই চলে গেলেন ডাঃ দিলীপ মহলানবিশ, যাঁর দৌলতে স্বীকৃতি পায় ORS" (in Bengali). Peoples Reporter. 16 October 2022. Retrieved 16 October 2022.
  5. "Pioneer Of Oral Rehydration Therapy Receives Prince Mahidol Award". Medical News Today. 16 November 2006. Retrieved 1 September 2017.

మరింత సమాచారం

మార్చు