దివి మురళి
దివి మురళి భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త. దివీస్ ల్యాబరేటరీ స్థాపకుడు.[1] 2018లో ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాలో 59 వ స్థానంలో ఉన్న వ్యక్తి. కాకతీయ యూనివర్శిటీ నుంచి ఫార్మశీలో పి.హెచ్.డీ. చేశారు.
దివి మురళి | |
---|---|
జననం | దివి మురళీకృష్ణ ప్రసాద్ మంతెన, కృష్ణా జిల్లా |
వృత్తి | వ్యాపారవేత్త |
తల్లిదండ్రులు |
|
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుదివి మురళి కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంతెన అనే గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులకు 13 మంది సంతానంలో ఈయన ఆఖరి వాడు. తండ్రి సత్యనారాయణ జిల్లా పరిషర్ సెక్రటరీగా పని చేసేవాడు. సత్యనారాయణ పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కలకత్తా వెళ్ళీ డిగ్రీ పూర్తి చేసి వచ్చాడు. వాళ్ళ ఊర్లో అంత చదువు చదివింది మొదట ఆయనే. మచిలీపట్నం హిందూ హైస్కూల్లో చదువుకున్నాడు. చదువులో సగటు విద్యార్థిగా ఉండేవాడు. ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణుడు కాలేదు.
మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఎం. ఫార్మసీ చదివాడు.
మూలాలు
మార్చు- ↑ బెహరా, శరత్ కుమార్. "ఐదొందలతో అమెరికా వెళ్లా!". eenadu.net. ఈనాడు. Archived from the original on 20 February 2019.