ఫోర్బ్స్
ఫోర్బ్స్ ఒక అమెరికన్ వ్యాపార పత్రిక. దీనిని 1917లో బి. సి. ఫోర్బ్స్ ప్రారంభించాడు. 2014 నుంచి హాంకాంగ్ కేంద్రంగా కలిగిన ఇంటిగ్రేటెడ్ వేల్ మీడియా ఇన్వెస్ట్‌మెంట్స్ అనే ఇన్వెస్ట్‌మెంట్ గ్రూపు యాజమాన్యంలో ఉంది. స్టీవ్ ఫోర్బ్స్ దీనికి ఛైర్మన్, ఎడిటర్ ఇన్ ఛీఫ్. మైక్ ఫెడర్లీ దీనికి సియిఓ.[3] ఇది న్యూ జెర్సీ కేంద్రంగా పని చేస్తున్నది. వ్యాపార పత్రికల విభాగంలో ఫార్చ్యూన్, బ్లూమ్‌బెర్గ్ బిజినెస్ వీక్ దీనికి ప్రధాన పోటీదారులు.[4]
border | |
ఛైర్మన్/ ఎడిటర్ ఇన్ చీఫ్ | స్టీవ్ ఫోర్బ్స్ |
---|---|
సంపాదకుడు | రాండాల్ లేన్[1] |
వర్గాలు | వ్యాపార పత్రిక |
తరచుదనం | త్రైమాసికానికి రెండు సార్లు |
ముద్రణకర్త | ఫోర్బ్స్ మీడియా |
మొత్తం కాపీలు (2020) | 657,215[2] |
స్థాపక కర్త | బి. సి. ఫోర్బ్స్ |
మొదటి సంచిక | సెప్టెంబరు 15, 1917 |
సంస్థ | ఇంటిగ్రేటెడ్ వేల్ మీడియా ఇన్వెస్ట్‌మెంట్స్ |
దేశం | అమెరికా |
కేంద్రస్థానం | న్యూజెర్సీ, అమెరికా |
భాష | ఆంగ్లము |
ISSN | 0015-6914 |
OCLC | 6465733 |
సంవత్సరానికి ఎనిమిది సార్లు ప్రచురితమయ్యే ఈ పత్రికలో ఆర్థికం, పెట్టుబడులు, పరిశ్రమలు, మార్కెటింగ్ విషయాలపైన కథనాలు ఉంటాయి. ఇవే కాకుండా వీటి సంబంధిత రంగాలైన సాంకేతికం, కమ్యూనికేషన్స్, విజ్ఞానం, రాజకీయాలు, న్యాయశాస్త్రం మొదలైన రంగాల గురించి కూడా కథనాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది ప్రచురించే జాబితాలు, ర్యాంకులకు ప్రసిద్ధి చెందింది. ఉదాహరణకు ఫోర్బ్స్ 400 ద్వారా అమెరికాలో అత్యంత ధనవంతులైన వ్యక్తులు, ఫోర్బ్స్ 30 ద్వారా ముప్ఫై సంవత్సరాల లోపు ప్రతిభావంతులైన 30 మంది వ్యక్తులు, అమెరికాలో అత్యంత ధనవంతులైన ప్రముఖులు, ఫార్చ్యూన్ గ్లోబల్ 2000 ద్వారా ప్రపంచంలో ఉత్తమ సంస్థలు, ఫోర్బ్స్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు, ప్రపంచ బిలియనీర్లు మొదలైన జాబితాలు విడుదల చేస్తుంది.[5] ఫోర్బ్స్ పత్రిక మోటో చేంజ్ ది వరల్డ్ ("Change the World").[6]
మూలాలు
మార్చు- ↑ Romenesko, Jim (August 9, 2011). "Randall Lane returns to Forbes as editor". Poynter.org. Archived from the original on February 22, 2014.
- ↑ "Consumer Magazines". Alliance for Audited Media. Archived from the original on October 13, 2020.
- ↑ Silva, Emma (November 30, 2017). "Mike Federle Succeeds Mike Perlis As CEO Of Forbes". Folio.
- ↑ Carr, David. "Even Forbes is Pinching Pennies". The New York Times. Retrieved 24 April 2024.
- ↑ Delbridge, Emily (November 21, 2019). "The 8 Best Business Magazines of 2020". The Balance Small Business. New York City: Dotdash. Best for Lists: Forbes. Retrieved February 8, 2020.
- ↑ "'Forbes' Launches New Tagline, Brand Campaign". MediaPostb. October 24, 2012. Retrieved January 24, 2020.