మనిషికి వున్నవి రెండు నేత్రాలు. శివుడికి ఫాలభాగంలో మూడో నేత్రం ఉంది. దానినే "పాలనేత్రం" లేదా "కాలాగ్ని నేత్రం" అని అంటారు. ఈ మూడో నేత్రంతోనే లోకాన్ని దర్శిస్తుంటాడు శివుడు. అయితే ఆ కన్ను తెరిస్తే అంతా భస్మమే. కనుక కన్ను తెరవకుండానే లోకాన్ని దర్శిస్తుంటాడు. కనుక దాన్ని "దివ్యచక్షువు" అని అంటారు. ఈ దివ్యచక్షువు ద్వారా గ్రహించేదే "దివ్యజ్ఞానం".[1]

శివుడి విగ్రహం, మురుదేశ్వరం

పొందినవారు

మార్చు

పురాణాలలో దివ్యచక్షువు పొందినవారు:

  1. మహాభారత యుద్ధాన్ని దివ్య నేత్రాలతో దర్శించి రాసిన వ్యాసుడు.
  2. దృతరాష్ట్రునికి చెప్పిన సంజయుడు : దివ్య చక్షువును శ్రీకృష్ణుడు సంజయునికి ఇచ్చి మహాభారత యుద్ధాన్ని హస్తినలోనే చూసి ధృతరాష్ట్రునికి వివరించేటట్లు చేసాడు.
  3. విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడు
  4. మహాభారతంలో రాయబార సభలో ధృతరాష్ట్రుడు దివ్య చక్షువుతో శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శించాడు.
  5. దివ్యచక్షువు ద్వారా వాల్మీకి మహర్షి శ్రీరాముడు జన్మించకముందే రామాయణం అంతా దర్శించి వ్రాశాడు.
  6. దివ్యచక్షువు ద్వారా వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం తెలుసుకుని రాసాడు.[2]

మూలాలు

మార్చు
  1. తాళపత్ర గ్రంథ సర్వస్వం - బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు
  2. "దివ్యనేత్రం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Retrieved 2020-09-28.[permanent dead link]

బాహ్య లంకెలు

మార్చు