దివ్య నగేష్
దివ్య నగేష్ (జననం 1991 మే 22) ఒక భారతీయ సినిమా నటి. ఆమె 2009 తెలుగు చిత్రం అరుంధతిలో బాలనటిగా తన పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ చిత్రం తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోకి అనువాదమైంది.
దివ్య నగేష్ | |
---|---|
జననం | [1] | 1991 మే 22
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 2009 – ప్రస్తుతం |
ప్రారంభ జీవితం
మార్చుదివ్య ముంబైలో జన్మించింది. అయితే, వారి కుటుంబం చెన్నైలో స్థిరపడటంతో ఆమె అక్కడే చదువుకుంది. ఆమె చెన్నైలోని సెయింట్ జోసెఫ్ స్కూల్, తిరుచ్చిలోని హోలీ క్రాస్ హై స్కూల్ లలో చదువుకుంది.
కెరీర్
మార్చుదివ్య స్కూల్ డేస్‌లో బుల్లితెర సీరియల్స్, వాణిజ్య ప్రకటనలలో బాలతారగా నటించింది. లెర్బనన్, అతు ఏరు కన కాలం, జిల్లును ఏరు కాదల్, పోయి వంటి సినిమాల్లో బాలనటిగా చేసింది. ఆమె అపరిచితుడు చిత్రంలో యువకుడు విక్రమ్‌కి చెల్లెలుగా నటించింది. సినిమాలో కరెంట్ నిలిచిన నీటిలో కరెంటు ప్రవహిస్తోందన్న విషయాన్ని గుర్తించకుండా స్కూల్‌కు వెళుతూ పడి చనిపోయే సన్నివేశంలో తన నటనకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
అవార్డులు
మార్చుఅరుంధతి చిత్రంలో తన నటనకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డు - 2009.