మహిళలు, బాలికలపై అత్యాచారం కేసుల్లో నేరస్థులకు మరణశిక్ష లాంటి కఠిన శిక్షలు పడేలా ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం ప్రవేశపెట్టినది. ఈ బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆమోదం తెలిపింది.[1]

నేపథ్యం

మార్చు

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, లైంగిక దాడులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం అనే పేరుతో ఒక కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును హోంమంత్రి సుచరిత 2019, డిసెంబరు 13న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ దిశ చట్టాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చట్టం ద్వారా మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ రానుంది.[2]

చట్టం వివరాలు

మార్చు
  1. ఈ దిశ ప్రకారం 14 రోజుల్లోపే విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా చట్టాన్ని రూపొందించారు.
  2. ఈ చట్టం లో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదుగా లేదా ఉరిశిక్షకూ అవకాశం ఉంది.
  3. సోషల్‌, మీడియాల్లో వేధింపులకు పాల్పడే వారిని శిక్షించేందుకు ఐపిసిలో 354(ఇ) అనే కొత్త సెక్షన్‌ తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం మొదటి తప్పుకు రెండేళ్లు, రెండవ తప్పుకు నాలుగేళ్లు శిక్ష విధించనున్నారు.
  4. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విచారణకు త్వరగా జరిగేలా ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.[3]

మూలాలు

మార్చు
  1. "దిశ చట్టం విప్లవాత్మకం". Sakshi. 2019-12-14. Retrieved 2019-12-14.
  2. Eenadu. "మహిళలకు బ్రహ్మాస్త్రం 'దిశ' చట్టం - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2019-12-13. Retrieved 2019-12-14.
  3. "ప్రతిష్టాత్మక 'దిశ' యాక్ట్‌లోని ముఖ్యాంశాలివే." Sakshi. 2019-12-13. Retrieved 2019-12-14.
"https://te.wikipedia.org/w/index.php?title=దిశ_చట్టం&oldid=3918382" నుండి వెలికితీశారు