ది ట్రిప్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. వి.డి.ఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మించిన ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించాడు.[1] ఆమని, గౌతమ్ రాజు, షఫీ, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను 26 అక్టోబర్ 2021న విడుదల చేసి[2], సినిమాను 12 నవంబర్ 2021న విడుదలైంది.[3]

ది ట్రిప్
దర్శకత్వంవంశీకృష్ణ ఆకెళ్ళ
నిర్మాతదుర్గం రాజమౌళి
తారాగణంఆమని
షఫీ
గౌతమ్ రాజు
ఛాయాగ్రహణంవిశ్వ దేవబత్తుల
కూర్పుబొంతల నాగేశ్వరరెడ్డి
సంగీతంకార్తిక్ కొడకండ్ల
నిర్మాణ
సంస్థ
వి.డి.ఆర్ ఫిల్మ్స్
సినిమా నిడివి
12 నవంబర్ 2021
భాషతెలుగు

కథ మార్చు

కాలేజ్ స్టూడెంట్ అయిన గౌతమ్ డ్రగ్స్‌కు అలవాటుపడి బానిస అవుతాడు. ఆమనీ తన కొడుకు డ్రగ్స్‌కు బానిసైయాడని తెలిసి తల్లడిల్లిపోతుంది. గౌతమ్ ఆ మత్తులో తనకు తెలియకుండానే తను తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే గౌతమ్ ఒకరోజు ఒక గ్రామానికి బయలుదేరి ఒక అడవిడిలో ఇబ్బందుల్లో పడుతాడు. గౌతమ్ అక్కడి నుండి ఎలా బయటపడ్డాడు, చివరగా అతడు ఎలా మారాడు అన్నదే మిగిలిన సినిమా కథ.

నటీనటులు మార్చు

 • ఆమని
 • గౌతమ్ రాజు
 • షఫీ
 • సౌమ్య శెట్టి
 • సరళారెడ్డి[4]
 • వైభవ్ సూర్య
 • శ్రీసాయి దుర్గ
 • డా. హరిగోపాల్
 • బేబీ నేత్ర రెడ్డి
 • మాస్టర్ అధర్వన్
 • సిల్వర్ సురేష్

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: వి.డి.ఆర్ ఫిల్మ్స్
 • నిర్మాత: దుర్గం రాజమౌళి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ
 • సంగీతం: కార్తిక్ కొడకండ్ల
 • సినిమాటోగ్రఫీ: విశ్వ దేవబత్తుల
 • ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి

మూలాలు మార్చు

 1. Eenadu (27 October 2021). "రొటీన్‌కు భిన్నంగా 'ది ట్రిప్‌'". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
 2. Andhrajyothy (26 October 2021). "'ది ట్రిప్' మూవీ ఫస్ట్ లుక్ విడుదల". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
 3. Eenadu (11 November 2021). "ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో వచ్చే సినిమాలివే". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
 4. Sakshi (30 December 2021). "సందేశమే ఆమె సినిమా". Archived from the original on 17 జనవరి 2022. Retrieved 17 January 2022.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ది_ట్రిప్&oldid=3517017" నుండి వెలికితీశారు