షఫీ ప్రముఖ సినీ నటుడు. చంద్రగిరి మండలం చంద్రగిరి కోటలోపల గ్రామం అతని స్వస్థలం. బికాం డిగ్రీ తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో చదివాడు. తెలుగులో నాటక రంగ ప్రముఖుడైన బళ్ళారి రాఘవ స్ఫూర్తితో తిరుపతిలో ప్రయోగాత్మక నాటక సంస్థ నెలకొల్పాలనుకున్నాడు. కానీ అది వీలు కాలేదు. నటనపైన ఉన్న మక్కువతో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా(ఢిల్లీ) లో 3 సంవత్సరాల కోర్సు చేశాడు. ఇతను ఖడ్గం సినిమాలో ప్రతినాయక పాత్రతో మంచి పేరు సంపాదించాడు.

షఫి
జన్మ నామంమొహమ్మద్ షఫి
జననం (1975-07-02) 1975 జూలై 2 (వయస్సు: 45  సంవత్సరాలు)
ప్రముఖ పాత్రలు ఖడ్గం
ఛత్రపతి

నాటకరంగంలో ప్రముఖులైన గిరీష్ కర్నాడ్, బి.వి. కారంత్, రామ్ గోపాల్ బజాజ్ లాంటి వారితో కలిసి పనిచేశాడు. ఖడ్గం సినిమాలో తీవ్రవాది పాత్ర కోసం చార్మినారు సందుల్లో ఒక స్నేహితుడి ఇంట్లో ఒక నెలపాటు నివాసం ఉండి అక్కడ వారి అలవాట్లను గమనించాడు. [1]

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరము చిత్రం దర్శకుఁడు పాత్ర పేరు
ష్... [[(film director)|]
రెడీ
మాయాజాలం
మంగతాయారు టిఫిన్ సెంటర్
ఛత్రపతి
ప్రాణం
ఖడ్గం
ప్రేమ కావాలి
లక్ష్మి
దూకుడు
బలుపు
భాద్ షా
డెంజర్
గోల్కొండ హై స్కూల్
కరెంట్

మూలాలుసవరించు

  1. K.V.S, Madhav. "thehindu". thehindu.com. Kasturi and Sons. Retrieved 16 June 2016.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=షఫి&oldid=2826720" నుండి వెలికితీశారు