ది రోడ్‌ 2023లో తెలుగులో విడుదలైన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ సినిమా. ఏఏఏ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ వ‌సీగ‌ర‌ణ్ దర్శకత్వం వహించాడు. త్రిష, సంతోష్ ప్రతాప్, షబ్బీర్, కల్లారక్కాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 సెప్టెంబర్ 21న విడుదల చేయగా[1], సినిమాను అక్టోబర్ 06న తెలుగు, త‌మిళం, క‌న్న‌డం భాషల్లో విడుదలైంది.[2]

ది రోడ్
దర్శకత్వంఅరుణ్ వ‌సీగ‌ర‌ణ్
కథఅరుణ్ వ‌సీగ‌ర‌ణ్
నిర్మాతఏఏఏ సినిమా ప్రైవేట్ లిమిటెడ్
తారాగణం
 • త్రిష
 • సంతోష్ ప్రతాప్
 • షబ్బీర్
 • కల్లారక్కాల్
 • మియా జార్జ్
ఛాయాగ్రహణంకేజి వెంకటేష్
కూర్పుఏ.ఆర్. శివరాజ్
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థ
ఏఏఏ సినిమా ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
2023 అక్టోబరు 6 (2023-10-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

మీరా (త్రిష‌), ఆనంద్‌ (సంతోష్ ప్ర‌తాప్‌) భార్యాభర్తలు. మీరా త‌న కొడుకు కెవిన్ పుట్టినరోజున కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది కానీ మీరా గర్భవతి కావ‌డంతో డాక్ట‌ర్ లాంగ్ దూరం ప్రయాణలు వెళ్ల‌కూడ‌ద‌ని స‌ల‌హా ఇవ్వడంతో చివ‌రి నిమిషంలో మీరా ట్రిప్ నుంచి తప్పుకొని ఆనంద్‌తో (సంతోష్ ప్ర‌తాప్‌) పాటు తన కొడుకు కెవిన్ మాత్ర‌మే కొడైకెనాల్ కారులో వెళ‌తారు. నేషనల్‌ హైవేలో వారి కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్ర‌మాదంలో ఆనంద్‌, కెవిన్ చ‌నిపోతారు. త‌న భ‌ర్త‌, కొడుకు ప్రమాదంలోనే చ‌నిపోయార‌ని అంద‌రితో పాటు మీరా అనుకుంటుంది. కానీ అది ప్ర‌మాదం కాద‌ని, హత్యని మీరాకు ఆ త‌ర్వాత‌ తెలుస్తుంది? ఈ విషయంలో నిజం తీసుకోవడానికి ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? ఆ ప్రయత్నాల్లో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ప్రాణాలకు తెగించి ఆమె కనుక్కునే ఆ నిజాలు ఏమిటి? హైవే పై పథకం ప్రకారం జరుగుతున్న ప్రమాదాల వెనుక ఎవరున్నారు? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: ఏఏఏ సినిమా ప్రైవేట్ లిమిటెడ్
 • నిర్మాత: ఏఏఏ సినిమా ప్రైవేట్ లిమిటెడ్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్ వ‌సీగ‌ర‌ణ్
 • సంగీతం: సామ్ సిఎస్
 • సినిమాటోగ్రఫీ: కేజి వెంకటేష్
 • ఎడిటర్ : ఏ.ఆర్. శివరాజ్
 • ఫైట్స్: ఫీనిక్స్ ప్రభు
 • ఆర్ట్ డైరెక్టర్: శివ యాదవ్

మూలాలు మార్చు

 1. ABP (22 September 2023). "మరో సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ తో రాబోతున్న త్రిష - తల్లి పాత్రలో అదరగొట్టిందిగా, 'ది రోడ్' ట్ర". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
 2. Namasthe Telangana (9 September 2023). "రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న త్రిష 'ది రోడ్‌' మూవీ". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
 3. The Hindu (6 October 2023). "'The Road' movie review: This Trisha-starrer is a predictable, dead-end thriller" (in Indian English). Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ది_రోడ్&oldid=4212474" నుండి వెలికితీశారు