దీవి నరసింహదీక్షిత్

కవి, వక్త, పరిశోధకులుగా ప్రసిద్ధి

ఆచార్య దీవి నరసింహదీక్షిత్ (డాక్టర్.డి.యన్.దీక్షిత్ ) కవి, వక్త, పరిశోధకులుగా ప్రసిద్ధి. వీరు గుంటూరు హిందూ కళాశాలలో ప్రధానాచార్యులుగా పదవీవిరమణ చేశారు.[1]

Dr. D.N. DEEKSHIT
ఆచార్య దీవి నరసింహదీక్షిత్
జననందీవి నరసింహదీక్షిత్
10-05-1962
శ్యామలా నగర్, జిల్లా : గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్
నివాస ప్రాంతంగుంటూరు, భారత దేశము India
వృత్తిసంస్కృత ఆచార్యులు
ఉద్యోగంHindu College in Guntur, Andhra Pradesh
ప్రసిద్ధికవి, వక్త, పరిశోధకులు
మతంహిందూ
భాగస్వాములుశ్రీమతి మాధవి
పిల్లలువేంకట పవన్ తేజ్
తండ్రిదీవి వేంకట రామాచార్యులు
తల్లిశ్రీమతి జగన్మోహిని

జీవిత విశేషాలు

మార్చు

డాక్టర్.డి.యన్.దీక్షిత్ గా ప్రసిద్ధి పొందిన ఆచార్య దీవి నరసింహదీక్షిత్ గారు శ్రీమతి జగన్మోహిని, పండిత దీవి వేంకట రామాచార్యులు దంపతులకు గుంటూరు జిల్లాలో జన్మించాడు.

విద్యాభ్యాసం

మార్చు

ప్రాథమికంగా సంస్కృత భాషను తండ్రి గారి వద్ద అభ్యసించారు. పాఠశాల విద్య - శ్రీ రంగాచార్య ఓరియంటల్ హైస్కూల్, "సాహిత్య విద్యా ప్రవీణ" - డా॥కె.వి.కె. సంస్కృత కళాశాల, గుంటూరులో పూర్తీ చేశారు. ఎం.ఏ. (సంస్కృతం) - ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, మహాకవి భాసుని రూపకములు - భాషాశాస్త్ర పరిశీలన (భాసరూపకాణాం భాషాశాస్త్రానురోధన పరిశీలనమ్) అనే అంశంపై విద్యావారిధి (Ph.D) - కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో పూర్తి చేశారు.

వృత్తి విశేషాలు

మార్చు
  • 1. 1982-2021 హిందూ కళాశాల, గుంటూరులో సేవా వివరాలు
  • 2. 1982 నుండి సంస్కృత ఆధ్యాపకులు
  • 3. 1990 నుండి సంస్కృత విభాగాధ్యక్షులు
  • 4. 2018 నుండి వైస్ ప్రిన్సిపాల్
  • 5. నవంబరు 2020 నుండి జూన్ 2021 వరకు ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు.

డి.యన్.దీక్షిత్ గారు తన ప్రవృత్తిగా సంస్కృతం, తెలుగు భాషల అభివృద్ధికి విశేషంగా కృషిచేశాడు. కవిగా, వక్తగా, పరిశోధకులుగా, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమ ప్రయోక్తగా భారతీయ సంస్కృతి, సంస్కృత భాషా ప్రచారకులుగా బహుముఖంగా ప్రస్థానం గావిస్తున్నారు.

నిర్వహించిన జాతీయ సదస్సులు

మార్చు

జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని సంస్కృత భాషా సాహిత్యాలకు సంబంధించిన 30 పరిశోధన వ్యాసాలు సమర్పించారు.

  • 1. సంస్కృతం - తెలుగు సాహిత్యాలలో పర్యావరణ చేతన (U.G.C Sponsored) 2006
  • 2. సంస్కృత సాహిత్యంలో మానవత్వపు విలువలు (U.G.C. Sponsored) 2014
  • 3. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం, తిరుపతి, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయములలోని పరిశోధన విద్యార్థులకు మార్గదర్శి (Research Guide) గా ఉన్నారు.
  • 4. శ్రీ దీక్షిత్ గారి అనువాద రచన 'ఉన్నతిః' 2015 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిచే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో సెమిస్టర్ -1లో పాఠ్యాంశంగా నిశ్చయింపబడింది. (Common Core under choice Based Credit System)

ముద్రింపబడిన సంస్కృత కావ్య రచనలు

మార్చు
  • 1. సాగరగీతమ్ - ప్రచురణ 1990.
  • 2. విశ్వనృత్యమ్ (శివతాండవ వర్ణన) ముద్రణ : 1991
  • 3."భారతీభూషణమ్" - "భారతరత్న" శ్రీ అటల్ బిహారి వాజపేయి జీవిత చరిత్రను వర్ణించే కావ్యం 3.2.2004న ప్రత్యేక కార్యక్రమంలో అటల్ జీ స్వయంగా ఈ కావ్యాన్ని ఆవిష్కరించారు.[2][3]
  • 4. వనస్తతిలకా (సంస్కృత కవితల సంకలనం) ముద్రణ : 2013.[4][5]
  • 5. బాలల కోసం సరళసంస్కృత రచన "మీరాబాయి " ప్రచురణ : సంస్కృతభారత్ ఆంధ్ర ప్రదేశ్ 2013
  • 6. శ్రీనివాస కళ్యాణం (సచిత్ర బొమ్మల) 2016 [6]
  • 7. "సత్యం పరం ధీమహి" (సంస్కృత నృత్యరూపకం) : వాషింగ్టన్ నగరంలో ప్రదర్శించబడింది. ప్రచురణ 2017
  • 8. బ్రహ్మాంజలి స్తోత్రకావ్య సంకలనమ్, ప్రచురణ : 2018

వ్యాఖ్యాన రచనలు

మార్చు
  • 1. మణిమాల- సంస్కృత సుభాషితాలకు తెలుగులో వ్యాఖ్య - తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ, 1990
  • 2. శ్రీ మహిషాసురమర్దినీ స్తోత్ర వ్యాఖ్యానమ్ - ప్రథమ ముద్రణ - 1994
  • 3. క్రీస్తుతి కదంబమ్ - లక్ష్మీదేవి స్తోత్రాలకు వ్యాఖ్య - ప్రథమ ముద్రణ 2002
  • 4. "ముకుందమాల"కు తెలుగు వ్యాఖ్య - ముద్రణ 2019 [7]

అనువాద రచనలు

మార్చు
  • 1. "నింగి రంగుల దొంగాట" డా॥ హర్షదేవ్ మాధవ్ రచించిన సంస్కృత హైకూ కవితలకు తెలుగు అనువాదం, ప్రచురణ సంస్కృతి ప్రకాశన్, అహ్మదాబాద్, జూన్ 2021

భాషా సాంస్కృతిక సేవలు

మార్చు
  • 1. ఆకాశవాణి (All India Radio) లో వివిధములైన సాహిత్య - ఆధ్యాత్మిక విషయాలపై సుమారు 200 ప్రసంగాలు చేశారు.
  • 2. దూరదర్శన్ కార్యక్రమాలు : సప్తగిరి (DD-8), SVBC, ఛానల్స్ ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అనేక ప్రసంగాలు చేశారు. చేస్తున్నారు.
  • 3. బ్రహ్మపురాణం (ప్రవచనం) - 42.Episode (SVBC) )
  • 4. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ప్రత్యక్షవ్యాఖ్యానం - గత 20 సం॥ల నుండి
  • 5. You Tube ప్రేక్షకుల కోసం : రామాయణం in Telugu (తెలుగులో రామాయణం)
  • 6. ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ నారాయణ తీర్థుల జన్మస్థలం గ్రామంలో వారి స్మారకమందిర నిర్మాణం కోసం శ్రీనారాయణ తీర్థ ట్రస్ట్ వ్యవస్థానిక సభ్యులుగా ఉండి కృషి చేశారు
  • 7. గుంటూరు జిల్లా అధికారభాషా సంఘసభ్యులు (2007-2010).
  • 8. అరబిందో సొసైటీ గుంటూరు శాఖ సభ్యులు
  • 9. సభ్యులు, సాహితీ సమాఖ్య, గుంటూరు
  • 10. "సంస్కృత భారతీ" గుంటూరు జిల్లా అధ్యక్షులు. ఈ సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా సంస్కృత భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నారు.
  • 11. శ్రీ వైఖానస మహామందలి గుంటూరు శాఖ అధ్యక్షులు,

అందుకున్న ప్రధాన సత్కారాలు

మార్చు
  • 1. 2005 సాహితీ రత్నాకర బిరుదు ప్రధానం.
  • 2. 2010 డాక్టర్ ప్రసాదరాయ కులపతి పురస్కారం
  • 3. 2010 కాంచీకామకోటి పీఠ సాహిత్య పురస్కారం
  • 4. 2011 శ్రీ పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్య పురస్కారం
  • 5. 2011 రామాయణ తత్వ ప్రవచనపారీణ - బిరుద ప్రధానం
  • 6. 2012 ఉగాదీ సాహితీ పురస్కారం - తెనాలి సమాఖ్యదే
  • 7. 2015 బి. ఆర్. మహేష్ ఛారిటబుల్ ట్రస్ట్ పురస్కారం:
  • 8. 2016 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక ప్రతిభా పురస్కారం 2016[ఆధారం చూపాలి]
  • 9. 2020 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతిభాపురస్కారం

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు