దుగరాజపట్నం ఓడరేవు
దుగరాజపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రతిపాదించబడ్డ ఓడరేవు. 2020లో నిర్మాణాన్ని ప్రారంభించి 2023లో పూర్తి చేయాలని భావించారు. ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. నౌకాశ్రయ నిర్మాణానికి దాదాపు రూ 8,000 కోట్లు ఖర్చు అవుతుంది.[1] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈక్విటీ భాగస్వామ్యంతో భారత కంపెనీల చట్టం 1956 ప్రకారం ఈ పోర్టును ఏర్పాటు చేసారు.[2]
దుగరాజపట్నం ఓడరేవు | |
---|---|
Location | |
Country | భారతదేశం |
Location | దుగరాజపట్నం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
Details | |
Owned by | కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ |
పునరావాసం
మార్చుసున్నితమైన పర్యావరణ వ్యవస్థ గల పులికాట్ సరస్సు, ఇస్రో వారి శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగ కేంద్రం దుగ్గరాజపట్నానికి చాలా సమీపంలో ఉన్నందున ఈ పోర్టు నిర్మాణంపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. పర్యావరణ, అటవీ అనుమతుల అనంతరం తూపిలిపాలెం గ్రామం వద్ద ఉన్న వాగర్రుకు స్థలాన్ని మార్చారు. తూపిలిపాలెం దుగరాజపట్నం నుండి 20 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ, ఈ నౌకాశ్రయాన్ని దుగరాజపట్నం పోర్ట్‌గానే పిలుస్తారు.[3] ఈ కొత్త ప్రదేశంలో సుమారు 5,028 ఎకరాల భూమిని సేకరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.[3]
మూలాలు
మార్చు- ↑ "Dugarajapatnam Port to get 5,000 acres land to start with". The Hindu. NELLORE. 12 May 2013. Retrieved 26 July 2014.
- ↑ P.Manoj (10 May 2013). "Dugarajapatnam in Andhra Pradesh to have new major port". Live Mint and The Wall Street Journal. Retrieved 26 July 2014.
- ↑ 3.0 3.1 "Decks cleared for Dugarajapatnam port". Times of India. 13 February 2013. Retrieved 9 July 2014.