దుగరాజపట్నం ఓడరేవు

ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా లోని ఓడరేవు
(దుగరాజపట్నం పోర్టు నుండి దారిమార్పు చెందింది)

దుగరాజపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రతిపాదించబడ్డ ఓడరేవు. 2020లో నిర్మాణాన్ని ప్రారంభించి 2023లో పూర్తి చేయాలని భావించారు. ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. నౌకాశ్రయ నిర్మాణానికి దాదాపు రూ 8,000 కోట్లు ఖర్చు అవుతుంది.[1] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈక్విటీ భాగస్వామ్యంతో భారత కంపెనీల చట్టం 1956 ప్రకారం ఈ పోర్టును ఏర్పాటు చేసారు.[2]

దుగరాజపట్నం ఓడరేవు
Location
Countryభారతదేశం
Locationదుగరాజపట్నం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
Details
Owned byకేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ

పునరావాసం

మార్చు

సున్నితమైన పర్యావరణ వ్యవస్థ గల పులికాట్ సరస్సు, ఇస్రో వారి శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగ కేంద్రం దుగ్గరాజపట్నానికి చాలా సమీపంలో ఉన్నందున ఈ పోర్టు నిర్మాణంపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. పర్యావరణ, అటవీ అనుమతుల అనంతరం తూపిలిపాలెం గ్రామం వద్ద ఉన్న వాగర్రుకు స్థలాన్ని మార్చారు. తూపిలిపాలెం దుగరాజపట్నం నుండి 20 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ, ఈ నౌకాశ్రయాన్ని దుగరాజపట్నం పోర్ట్‌గానే పిలుస్తారు.[3] ఈ కొత్త ప్రదేశంలో సుమారు 5,028 ఎకరాల భూమిని సేకరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.[3]

మూలాలు

మార్చు
  1. "Dugarajapatnam Port to get 5,000 acres land to start with". The Hindu. NELLORE. 12 May 2013. Retrieved 26 July 2014.
  2. P.Manoj (10 May 2013). "Dugarajapatnam in Andhra Pradesh to have new major port". Live Mint and The Wall Street Journal. Retrieved 26 July 2014.
  3. 3.0 3.1 "Decks cleared for Dugarajapatnam port". Times of India. 13 February 2013. Retrieved 9 July 2014.