దున్నపోతు
దున్నపోతును దున్న, దుక్కిపోతు, ఎనుపోతు, ఎనుపగొడ్డు, మహిషము అని కూడా అంటారు. ఇది దున్నడానికి ఉపయోగించే మగ గేదె (పోతుగేదె) కావడం వలన దీనికి దున్నపోతు అని పేరు వచ్చింది. దున్నపోతును ఆంగ్లంలో మేల్ బఫెలో (male buffalo) అంటారు.
వ్యవసాయం
మార్చుదున్నపోతులు బలంగా ఉంటాయి, అందువలన వీటిని ఎద్దుల వలె భూమిని దున్నడానికి, బండి లాగడానికి ఉపయోగిస్తారు.
యమధర్మరాజు వాహనం
మార్చుపురాణాలలో యమధర్మరాజు వాహనంగా దున్నపోతును సూచిస్తారు. ఇది బలంగా, భయంకరంగా యమునికి తగిన వాహనంగా ఉంటుంది.
బలి
మార్చుపోలేరమ్మ, అంకాలమ్మ మొదలగు జాతరలలో దున్నపోతును నరికి బలి ఇస్తారు.
కుంభబలి:
కొత్తకుండలో 11 సేర్ల జొన్నలను కుంభం కూడుగా వండి అమ్మవారి ముందు రాశిపోసి దున్నపోతును నరకుటను కుంభబలి అంటారు.
సామెతలు
మార్చు- దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట
- దున్నపోతు మీద వాన కురిసినట్టు